Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి కూడా ఒకటి. 2006 లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. మహేష్ కు ఎనలేని స్టార్ స్టేటస్ కూడా ఇచ్చింది. మాస్ హీరో ఇమేజ్ను దక్కించింది. అప్పట్లో పోకిరి చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచి దుమ్మురేపింది. దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్ లోను ఈ సినిమా మంచి సక్సెస్ ని ఇచ్చింది. ఇక ఈ మూవీలో మహేష్ యాక్టింగ్ మరియు డైలాగ్ డెలివరీ, స్టోరీ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాయి. అంతటి ఘన విజయం సాధించిన పోకిరి చిత్రానికి నేటితో అనగా ఏప్రిల్ 28 తో 18 ఏళ్లు పూర్తి అయ్యాయి.
పోకిరి సినిమా 2006 ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైంది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ తో దుమ్మురేపింది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అదరగొట్టింది. ఇక ఈ చిత్రం టాలీవుడ్ లో ఒకానొక ఐకానిక్ గా నిలిచింది. మహేష్ బాబు ఈ సినిమాలో చేసిన పండు క్యారెక్టర్ కాల్ట్గా నిలిచింది. దర్శకుడు పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ ఈ సినిమాలో హైలెట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇక పోకిరి సినిమాకు 18 సంవత్సరాలు నిండిన సందర్భంగా నేడు అనగా ఏప్రిల్ 28న సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ట్రోలర్స్. వీట్లతో మహేష్ ఫ్యాన్స్ మతి పోగొడుతున్నారు. చాలామంది ప్రేక్షకులు ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ ను హైలెట్ చేస్తూ రివ్యూస్ ఇస్తున్నారు.
పోకిరి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తో కూడా తన సత్తా నిరూపించుకుంది. ఈ చిత్రం సుమారు రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 2006 లోనే 70 కోట్లను సాధించడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి సమయంలోనే ఈ మూవీ బిగ్గెస్ట్ గ్రోసార్ గా నిలిచింది. ఇక పోకిరి చిత్రంలో కొన్ని డైలాగ్స్ కూడా ఆనాటి ప్రేక్షకులనే కాకుండా నేటి ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.
మొత్తానికి అలా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పోకిరి మూవీ. ఇక అప్పట్లో ఈ సినిమాకి ఎంతోమంది ప్రేక్షకులు బాగా ఎడిట్ అయ్యి ఈ సినిమానే ఒక నాలుగు ఐదు సార్లు రిపీట్ గా చూశారు కూడా. అంతలాగా ఆకట్టుకుంది మరి ఆనాటి ప్రేక్షకులని ఈ సినిమా. ఇక ఈ మూవీలో మహేష్ బాబు సరసన ఇలియానా నటించిన మెప్పించింది. ఇక ఈ సినిమాతో ఇలియానా కి కూడా మంచి స్టార్ స్టేటస్ అందిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ సినిమాస్ కి కొంచెం గ్యాప్ ఇచ్చింది. సరేనా అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీ నుంచి దూరమైంది ఇలియానా. ఇక మరోసారి పోకిరి లాంటి కాన్సెప్ట్ తో వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!