NewsOrbit
2022 Asia Cup Cricket

Asia Cup 22 : షాహీన్ అఫ్రిదిని పరామర్శించిన కోహ్లీ, తొందరగా యుద్ధానికి సిద్ధం కమ్మని సలహా!

Virat Kohli meets Pakisthani players ahead of 2022 Asia Cup Cricket
Rishab Pant meets Pakisthani Players ahead of India Vs Pakisthan Match
Asia Cup 2022 Indian Players meet Pakistani Players

Asia Cup 22 క్రికెట్ అభిమానులకు పండగ రాబోతోంది. ఈ ఆదివారం ఆసియా కప్‌లో క్రికెట్ మహాసంగ్రామం జరగబోతుంది. అది ఎవరెవరి మధ్య జరగబోతుందో చెప్పాల్సిన పనిలేదు. అవును.. మీరు ఊహించింది నిజమే…. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరగబోతోంది. ఈ క్రమంలో ఆసియాకప్ టోర్నీ కోసం జట్లన్నీ దుబాయ్ చేరుకున్నాయి. దుబాయ్‌లోని ICC అకాడమీలో శిక్షణ సెషన్‌లలో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకరినొకరు కలుసుకుని ఆప్యాయంగా శుభాకాంక్షలు చెప్పుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Virat Kohli meets Babar Azam ahead of India Vs Pakisthan Match
ఇక టీమిండియా ఆసియాకప్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుండడం ఓ వైపు ఇండియా క్రికెట్ అభిమానులకు, మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఓ పండగలాగ ఉంది. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగబోతుందనే విషయం అందరికీ తెలిసినదే. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఈ మ్యాచ్‌కు భారత స్టార్ బౌలర్ బుమ్రా, పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది దూరంగా ఉండనున్నారు. దాంతో ఆ బాధ్యత భారత్ తరఫున భువీ లీడ్ చేయనుండగా.. పాక్ బౌలింగ్ ఎటాక్‌ను హరీస్ రౌఫ్ లీడ్ చేయనున్నాడు.

గాయంతో ఆసియాకప్ టోర్నీకి దూరమైన అఫ్రిది.. ట్రైనింగ్ సెషన్ వద్ద జట్టుతో పాటే ఉన్నాడు. అతను గాయంతో మోకాలి బ్రేస్ ధరించి కనిపించాడు. స్పీడీ రికవరీ కోసం అతనికి భారత స్టార్లు పరామర్శలు తెలిపారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఈ వీడియో షేర్ చేసింది. షాహీన్ అఫ్రిదిని కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్‌ పరామర్శించారు. సంభాషణ ముగింపులో పాకిస్థాన్ పేసర్ త్వరగా కోలుకోవాలని కోహ్లీ విష్ చేశాడు. అలాగే భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కూడా అఫ్రిది కలిశాడు. ఈ నెల ప్రారంభంలో జింబాబ్వేలో జరిగిన 3మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాహుల్ భారత్‌కు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

IND vs PAK: T20 వరల్డ్ కప్ టోర్నీలో నిన్న జరిగిన పాకిస్తాన్ -ఇండియా మ్యాచ్ సరికొత్త రికార్డు..!!

sekhar

T20 IND VS PAK: T20 వరల్డ్ కప్ టోర్నీలో ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై గెలిచిన భారత్, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ..!!

sekhar

T20 World Cup: క్రికెట్ లవర్స్ కి అదిరిపోయే న్యూస్ సినిమా థియేటర్ లలో T20 వరల్డ్ కప్ మ్యాచ్ లు..!!

sekhar

దుబాయ్ లో జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!

sekhar

India vs Pakistan Asia Cup Prediction: ఆశలు వదులుకోవలసిందేనా? భారత్ vs పాకిస్థాన్… గెలవబోయేది ఎవరు?

Siva Prasad