మోనిత దగ్గర అడ్డంగా బుక్ అయిన కార్తీక్.నెక్స్ట్ ప్లాన్ ఏంటో మరి!

కార్తీక దీపం October 21 ఎపిసోడ్ 1489:

Karthika Deepak Today's Episode Images Courtesy of Disney+ Hotstar

ఈరోజు అక్టోబర్ 21 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్‌లో దుర్గని అరెస్ట్ చేయించడానికి పోలీసుల్ని మోనిత తీసుకొస్తే.. పోలీసుల దగ్గర కార్తీక్ మోనితని ఇరికిస్తాడు. దాంతో మోనిత బిత్తరపోతుంది.అలాగే వంటలక్కకు కూడా ప్రాణహాని ఉంది అని రక్షణ కల్పించండి’ అని కార్తీక్ పోలీసుల్ని కోరతాడు.

అదే సీన్ నేటి కథనంలో కూడా కంటిన్యూ అవుతుంది.ప్రాణ హాని. ఉంది అని అంటున్నారు కదా ఎవరివల్లనో చెప్పండి అని పోలీసులు అంటే కార్తీక్ వెంటనే మోనితవైపు వేలు చూపించి షాకిస్తాడు. వెంటనే హ …మోనితా ఆ రోజు దీప మీద దాడి జరగడం నీకు తెలుసు కదా? వాళ్లని నువ్వు గుర్తుపట్టగలవా?’ అంటాడు కార్తీక్.

మోనిత షాక్‌లో ఉండగానే ‘అదేలే చీకటి కదా నువ్వు కూడా గుర్తుపట్టలేవులే అని అంటాడు కార్తీక్. సరే అయితే మా దగ్గర రౌడీల లిస్ట్ ఉంది. వాళ్లని పిలిపించి విచారణ జరిపిస్తానులే ఆ తర్వాత అసలు కారకులు బయటికి వస్తారు’ అనేసి కానిస్టేబుల్స్‌ని తీసుకుని వెళ్లిపోతాడు ఎస్ఐ.ఇక. దీప, దుర్గలు కార్తీక్‌కి థాంక్స్ చెప్పి వెళ్లిపోతారు.

వెంటనే మోనిత కోపంగా కార్తీక్ ఏం చేస్తున్నావ్ నువ్వు? ఇలా ప్రవర్తిస్తావేంటీ?’ అని నిలదీస్తుంది. ‘అదే నా డౌట్ కూడా.. ఎందుకు ఇలా చేస్తున్నావ్ మోనితా మొన్నేమో దుర్గ బంధువు, స్నేహితుడు అని చెప్పి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావ్.. 

ఇప్పుడు క్రిమినల్ అని జైల్లో వేయిస్తే తర్వాత ఎంక్వయిరీలో తన స్నేహితురాలిగా నిన్ను కూడా జైలికి తీసుకుని వెళ్తే పోయేది నా పరువే. పైగా నువ్వు లేకపోతే నేను ఒంటరివాడ్ని అయిపోతాను కదా? అందుకే అలా చేశాను’ అంటాడు కార్తీక్

అవునా.. మరి వంటలక్క విషయంలో ఎందుకు అలా మాట్లాడావ్’ అంటుంది మోనిత.అది కూడా సేమ్ మోనితా.. తీరా ఆ వంటలక్కకి ఏదైనా అయితే ఇరుక్కునేది నువ్వే కదా? అందుకే అలా చేశాను..’అంటాడు కార్తీక్. ‘ఏంటో కార్తీక్ నీకు అన్నీ ఈ మధ్య బాగానే గుర్తుంటున్నాయి’ అంటుంది మోనిత.తలకు దెబ్బ తగిలినప్పటి నుంచి బాగానే గుర్తుంటుంది అంటాడు కార్తీక్.

సీన్ కట్ చేస్తే కార్తీక్ ఫొటో పెట్టుకుని దుర్గ పూజలు చేస్తూ ‘నన్ను కాపాడాడిన దేవుడు’ అంటూ ఉంటాడు. మోనిత వచ్చి.. ‘రేయ్ సేఫ్ అయ్యానని సంబరాలు చేసుకోకు.. నేనేంటో త్వరలోనే చూపిస్తాను’ అంటుంది. ‘అది సరే కానీ.. నా విషయంలో కార్తీక్ సార్‌కి పూర్తిగా అనుమానం వచ్చేసింది. నిన్ను వదిలించుకోవాలనే కార్తీక్ సార్ ప్లాన్.

మోనిత ఆలోచనలో పడుతుంది. ఇంతలో ఇంట్లో పని చేసే శివలత చీపురతో ఇళ్లంతా తుడుస్తుంటే సోఫో కింద నుంచి టాబ్లెట్స్ వస్తూ ఉంటాయి. వాటిని చేతిలోకి తీసుకుని మోనితకి చూపిస్తుంది. వాటిని చూసి షాక్ అవుతుంది మోనిత.

 మేడం మీరు ఇచ్చిన టాబ్లెట్స్ ను సార్ వేసుకోవట్లేదనుకుంటా అంటుంది శివలత. మోనిత బిత్తరపోతుంది. ‘ఏంటి కార్తీక్ ఇలా ప్రవర్తిస్తున్నాడు.. కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందా? దుర్గ విషయంలో కార్తీక్ నన్ను నమ్మడం లేదా? 

కార్తీక్ దీప దగ్గర ఉన్నాడేమో అనుకుని దీప దగ్గరకు వెళ్తుంది మోనిత. అక్కడ కార్తీక్ లేడని తెలిసి.. ‘నీ మొగుడు నాకే సొంతం.. కార్తీక్ నావాడు.. నీ అంతు చూస్తాను అంటూ మొత్తం తను చేసిన నేరాలన్నీ చెప్పుకుంటూ వస్తుంది మోనిత. అప్పుడే దీప కూల్‌గా అంతా విన్నారుగా డాక్టర్ బాబు.. రండి బయటికి’ అంటుంది కావాలనే.