Liger Review: 2.5/5 విజయ్ దేవరకొండ వన్ మాన్ షో ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద సరైన పంచ్ మిస్?

Images Credit: Instagram/thedevarakonda

సినిమా పేరు: లైగర్ దర్శకుడు: పూరి జగన్నాధ్ నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ నిర్మాతలు: హిందీ నిర్మాత‌లు క‌ర‌ణ్ జోహార్, అజ‌య్ మెహ‌తా లతో పాటు ఛార్మి, పూరి జగన్నాథ్. సంగీతం: విక్రం మంత్రోస్, తనిష్క్ బాఘ్చి, సునీల్ కశ్యప్.

వరుస ప్లాప్ లలో విజయ్ దేవరకొండ ఉండటంతో పూరి జగన్నాథ్ తో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేయటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమాలో నతివాడిగా ఇంకా ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ కెరియర్ లో సరికొత్త పాత్రలు చేయడంతో మరింత ఆసక్తి నెలకొంది

పైగా ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా పాత్ర పోషించటం సంచలనం రేపింది. ఇన్ని ఆర్భాటాలు హాంగులు కలిగిన…”లైగర్” నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం..

“లైగర్” పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ అతని తల్లి బాలామణి (రమ్యకృష్ణ) ఒకటే గోల్. అదేమిటంటే ఎలాగైనా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ MMA లీగ్ లో గెలవాలని ఛాంపియన్ కావాలని. ఈ లక్ష్యం కోసం కరీంనగర్ నుండి తల్లి కొడుకు ఇద్దరూ ముంబైకి వస్తారు. “లైగర్” తండ్రి కూడా ఒకప్పుడు పెద్ద ఫైటర్

దీంతో తన కొడుకు కూడా అంతకుమించి రాణించాలని తల్లి యొక్క కోరిక. దీంతో తన కొడుకు విషయంలో చాలా జాగ్రత్తలు .. మొదటి నుండి బాలమని తీసుకుంటూ ఉంటాది. ఎవరితోనూ ముఖ్యంగా అమ్మాయిలతో కూడా కలవనివ్వకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటది. ఈ క్రమంలో కోచ్ (రోనిత్ రాయ్) సాయం పొందుకుంటారు.

నేషనల్ ఛాంపియన్ అవటానికి విజయ్ దేవరకొండ అనేక కష్టాలు పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో తాన్య (అనన్య పాండే) అని అమ్మాయితో పరిచయం ఏర్పడటం.. తాన్య ఎలాగైనా విజయ్ దేవరకొండ నీ ప్రేమలో పడేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేషనల్ ఛాంపియన్ లక్ష్యాన్ని దెబ్బతీసేలా ఆమె వ్యవహరిస్తూ ఉంటది.

అయితే తాన్య ఉచ్చు.. నుండి “లైగర్” ఎలా తప్పించుకున్నాడు..? ఆ తర్వాత తాన్య ఏ విధంగా సహాయపడింది..?, అమెరికాలో లాస్ వేగస్ లో జరిగే నేషనల్ ఛాంపియన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ వరకు విజయ్ దేవరకొండ ఎలా వెళ్ళాడు..?, అతని తండ్రి ఎవరు..? మైక్ టైసన్ స్టోరీలో ఎందుకు వస్తాడు..?

లైగర్” చూస్తున్నంత సేపు పాతకాలం నాటి సినిమా చూసినట్టు ఉంటది. సినిమాలో మధ్యలో ట్విస్ట్ లు… రావటం కొద్దిగా ప్లస్ అయింది. పూరి జగన్నాథ్ సినిమాలలో హీరో క్యారెక్టర్జేషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ “లైగర్” లో చాలావరకు అది మిస్ అయిందని చెప్పవచ్చు. సినిమా ఫస్ట్ అఫ్ పర్వాలేదు అనిపించిన సెకండాఫ్.. ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.

పాజిటివ్ పాయింట్స్: విజయ్ దేవరకొండ యాక్షన్, జబర్దస్త్ శ్రీను కామెడీ,ఫైట్స్ , రమ్యకృష్ణ

నెగిటివ్ పాయింట్స్: స్టోరీ, స్క్రీన్ ప్లే, నటీనటుల లిప్ సింక్ డబ్బింగ్.

విజయ్ దేవరకొండ వన్ మాన్ షో అయినా గాని దర్శకుడు పూరి మార్క్  కనిపించకపోవడంతో..”లైగర్” బాక్సాఫీస్ వద్ద సరైన పంచ్ మిస్ అయింది అని  చెప్పవచ్చు.