తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఆశ్చర్యకరమైన వాస్తవాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్…ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన తట్టుకునే రీతిలో లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సెంటర్ ని నిర్మించడం జరిగింది. 

2016 వ సంవత్సరంలో ఈ అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ శంకుస్థాపన నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. దాదాపు ఆరు సంవత్సరాలు రాత్రి పగలు పనిచేసి ఈ భవనాన్ని ఎట్టకేలకు పూర్తి చేయడం జరిగింది.

రాష్ట్రంలో పోలీసు ఉన్నత అధికారులు ఒకే చోట కూర్చుని క్రైమ్ మానిటరింగ్ మరియు కమాండ్ కంట్రోల్ చేసే రీతిలో అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నిర్మితమైన ఈ భవనం లో విదేశీ సాంకేతిక మరియు మోడరన్ టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ విభాగాలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారులు మానిటరింగ్ చేయనున్నారు.

"ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్" గా పేరు పెట్టిన ఈ భవనం యొక్క స్పెషాలిటీ.. దాదాపు 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు మొత్తం సమన్వయంతో వేగంగా కలిసి పనిచేసే టెక్నాలజీ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కమాండ్ కంట్రోల్ భవనం నాలుగో అంతస్తులు అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ మోనిటరింగ్ తో పాటు ఇంకా నేర ప్రభావిత ప్రాంతాలను కంట్రోల్ చేసే తరహాలో లక్షలాది సీసీ కెమెరాలను ఇక్కడ నుండే వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్ లు ఏర్పాటు చేయడం జరిగింది.

ఆరు పాయింట్ రెండు లక్షల విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకున్న ఈ భవనంలో 4.26 లక్షల విస్తీర్ణంలో భవన నిర్మాణం ఇంకా 2.16 లక్షల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నీ మొత్తం ఐదు టవర్ లుగా విభజించారు. A,B,C,D, E టవర్ లుగా విభజించడం జరిగింది.

"A" టవర్ లో 20 అంతస్తులు ఇందులో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది. ఇక టవర్ "B" లో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. దీనిలో టెక్నాలజీ ఫ్యూజన్ టవర్ తో పాటు.. డయల్ 100కి సంబంధించి ఆఫీసు షి సేఫ్టీ, సైబర్ అండ్ నార్గోటిక్స్, క్రైమ్ విభాగాలు... ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక టవర్ C లో మూడు అంతస్తులుంటాయి. ఇందులో వచ్చేసరికి 480 మంది కూర్చునేందుకు వీలుగా పెద్ద ఆడిటోరియం ఏర్పాటు చేయడం జరిగింది. D టవర్ విషయానికి వచ్చేసరికి మీడియా, ట్రైనింగ్ సెంటర్.

ఇక చివరి టవర్ "E" లో 4,5,6 అంతస్తులలో కమాండ్ కంట్రోల్ మరియు డేటా సెంటర్ తో పాటు మల్టీ డిపార్ట్మెంట్, సీసీటీవీ మానిటరింగ్, వార్ రూమ్, కోఆర్డినేషన్, రిసీవింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.

అంతేకాదు యత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేకంగా హెలికాప్టర్ దిగటానికి కూడా హెలిపాడ్ నిర్మించడం జరిగింది. ఇంకా 14 మరియు 15 అంతస్తులలో తెలంగాణ పోలీస్ చరిత్ర గురించి తెలియజేసే మ్యూజియం ఏర్పాటు చేశారు.

మొత్తం 600 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం జరుపుకున్న ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో న్యూయార్క్ మరియు సింగపూర్ వంటి చోట్ల మాత్రమే ఉన్నాయని ఉన్నతాధికారులు తెలియజేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న అన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ల కంటే.. తెలంగాణలో తాజాగా నిర్మితమైన ఈ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ హైటెక్నాలజీ సాంకేతిక కలిగింది.