రిషితో వసుకు చీర ఇవ్వమన్నది దేవయానా.? నేనా… మీ మేడమా తేల్చుకో అన్నా రిషి..!

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 583

Guppedantha Manasu Today Episode October 17 Author: Suma K

అందరి ముందు తనని ఎలా కొట్టావు నువ్వు చేసింది తప్పు అని చెప్తాడు. నువ్వు బాధపడుతున్న వసు గురించి ఆలోచిస్తున్నావ్ కానీ నేను రిషి మనసుకైనా గాయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది జగతి.అయినా వసు ఆ చీర కట్టుకొని ఉండాల్సింది కదా అని బాధపడుతుంది.

గుప్పెడంత మనసు October 17 ఎపిసోడ్ 583 : వసును కొట్టడం తప్పు అని జగతిని మందలించిన మహేంద్ర :

మహేంద్ర కూడా రిషి, వసులు బయటకు వెళ్లారు.వాళ్ళిద్దరి మధ్య దూరం మరింత  పెరిగిపోతుంది ఏమో అని అంటాడు. అయినా వసు ఈమధ్య మొండిగా ప్రవర్తిస్తుంది. ఆ  మొండితనం విలువ రిషి మనసు అని తెలుసుకోలేకపోతుంది అంటుంది జగతి. ఇక  మహేంద్ర.. రిషి ఫోటో చూస్తూ సారీ నాన్న ఇదంతా నా వల్లే కదా అని బాధపడతాడు.

గుప్పెడంత మనసు October 17 ఎపిసోడ్ 583

వసుకు సారీ చెప్పిన రిషి :

ఇక గార్డెన్లో కూర్చున్న రిషి వసుతో బాధపడుతున్నావా అని అడుగుతాడు.దేని గురించి సార్ మేడం నన్ను కొట్టినందుకా, లేక ఆ చీర కట్టుకోలేనందుకా అనీ అంటుంది. ఆవిడ కొట్టడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తుంది.అది వదిలేయ్ నేను తెచ్చినందుకైనా ఆ చీర కట్టుకోవచ్చు కదా అప్పుడు నీకు కోడలు స్థానం వచ్చేది కదా అని అంటాడు రిషి.

ఆకాశమంత ప్రేమ ముందు ఆరు గజాలు చీర ఏ మాత్రం సార్ అంటుంది వసు. ఎవరు ఎలా అనుకున్నా ఎవరు తిట్టినా కొట్టినా మన మధ్య ఉన్న బంధం చెరిగిపోదు కదా సార్ అని అంటుంది. ఇష్టం లేని పని చేస్తే బంధం ఎలా నిలబడుతుంది అన్న రిషితో, ప్రేమ సార్, ప్రేమ ఉన్నచోట ఇలాంటివేవీ నిలబడవు మన మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి గాని, అంతుచిక్కని విభేదాలు ఏమీ లేవు అని రిషికి నచ్చ చెబుతుంది.

Guppedantha Mansu Today Episode October 17 ఎపిసోడ్ 583

అసలు అలా చీర ఇవ్వాలనే ఆలోచన మీది కాదు అని అంటుంది వసు. అప్పుడు రిషి…దేవయాని తనకు చీర ఇచ్చి వసుకి ఇమ్మని చెప్పిన విషయం గుర్తుచేసుకుంటాడు. అదే విషయం వసుకి కూడా చెప్తాడు రిషి

ఇక ఆ చీర విషయం వదిలేయమని వసు కి సారీ చెప్తాడు రిషి.మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు తప్పు చేస్తేనే వాళ్ల గురించి బాధపడుతూ ఎదుటి వాళ్ళకి సారి చెప్తారు, అంటే మీరు జగతి మేడంని అని అనే లోపు రిషి కోపంతో అరిచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మీరు మారతారు సార్ అనుకుంటూ రిషి ని వెంబడిస్తుంది వసు

Guppedantha Mansu Today Episode October 17  Episode 583

ధరణి ఇచ్చిన కాఫీ తాగుతూన్న దేవయాని ఏంటో ధరణి, ఆలోచిస్తుంటే ఈ లోకం ఏమైపోతుందో… రాను రాను మనుషుల్లో మానవత్వం మాయమైపోతుంది అని అంటుంది. దెయ్యాలు వేదాలు వెల్లిస్తున్నాయి అని అనుకుంటుంది ధరణి మనసులో. 

గుప్పెడంత మనసు October 17 ఎపిసోడ్ 583

అయినా వసుధారకి ఏమైంది మా అత్తయ్య గారి చీర కట్టుకోమంటే కట్టుకోకుండా  రిషిని బాధ పెట్టింది అంటుంది.ఏదేమైనా ఈ చీర నీకు కూడా చాలా బాగుంది  అని,కాఫీ కూడా బావుంది థాంక్యూ ధరణి అని అంటుంది. ఈ మహా తల్లి నాకు థాంక్స్  చెప్పింది అంటే ఏదో ప్రళయం రాబోతుంది అని మనసులో అనుకుంటుంది ధరణి.

నేనా.. మీ మేడంనా తేల్చుకో అని వసుధారను అడిగిన రిషి :