Intinti Gruhalakshmi Latest Episode:

గంగలో దూకేసిన నందు.. లాస్య పరిస్థితి అయోమయం.. ఒక్కటైన తులసి, సామ్రాట్..

సామ్రాట్ ఈరోజు ఇంట్లో చేయనున్న పార్టీకి రెడీ అవుతాడు.. అప్పుడే హనీ వచ్చి ఏంటి డాడీ ఈ షర్ట్ వేసుకున్నావు అని కామెంట్ చేస్తుంది.. పక్కనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చూసి పక్కపక్క నవ్వుతాడు.. షర్టు కాకుండా నువ్వు టీ షర్ట్ వేసుకో డాడీ అని అంటుంది హనీ.. అంతలో సామ్రాట్ వేరే షర్టు వెతికి తీసుకువస్తాడు.

Intinti Gruhalakshmi August 3

ఇది వేసుకుంటే ఇంకా ముసలోడికి లాగా కనిపిస్తావు అని అంటుంది హనీ.. తన బట్టల్లో వెతికి ఒక టీ షర్ట్ ని తీసుకుని వస్తుంది.. ఈ షర్ట్ వేసుకో డాడీ అని చెబుతుంది. సామ్రాట్ ఆ షర్ట్ లో అచ్చం యంగ్ గా ఉన్నావని హనీ పొగుడుతుంది.. అప్పుడే తులసి వాళ్ళు వచ్చారు సార్ అని పనమ్మాయి చెబుతుంది..

తులసి వాళ్ళందరూ సామ్రాట్ వాళ్ళ ఇంట్లోకి రాగానే గేటు దగ్గరే ఒక నిమిషం అని తులసి అంటుంది.. మీ అబ్బాయి చెప్పినట్టుగానే ఇంట్లో ఎవ్వరూ మీ అబ్బాయి నా భార్య భర్త అని చెప్పకండి అని ఒకసారి గుర్తు చేస్తుంది తులసి.. అదేంటమ్మా తులసి అలా చెప్పుకోవడం నాకు కూడా నందు నా మాజీ భర్త ఇష్టం లేదు అత్తయ్య అని తులసి అంటుంది.. తులసి ఆంటీ అని పరిగెత్తుకుంటూ హనీ వెళుతుంది..

అంకిత దివ్య ఇద్దరు సామ్రాట్ వాళ్ళ ఇంటిని చూసి సూపర్ గా ఉంది అని అనుకుంటారు.. పాత గొడవలు మర్చిపోయి వచ్చినందుకు చాలా సంతోషమని .. సామ్రాట్ వల్ల పాపాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడుతాడు.. గొడవలు మనుషుల్ని దూరం చేస్తాయని తెలుసు కానీ మొదటిసారి ఇలా మనల్ని దగ్గర చేస్తాయని తెలియదు అని సామ్రాట్ అంటాడు.. గొడవలకి వచ్చేస్థాపన బదులు అనుకుంటే అన్నీ కథలు ఎప్పుడో సుకాంతం అయ్యే అని తులసి అంటుంది..

కొంతమంది మగవాళ్ళు అలా చేయరు కదా .. వారికి అహంకారం అడ్డవస్తుంది అని తులసి అంటుండగా.. నందు, లాస్య ఇద్దరు వస్తారు.. లోకంలో ఉన్న మగవాళ్ళ మనస్తత్వాలు అన్నింటినీ కాచి వడపోసినట్లు మాట్లాడుతున్నావు.. నీకు మగవాళ్ళు అంటే కోపమా అని లాస్య అడుగుతుంది.. తను క్యాజువల్ గా అనింది అని సామ్రాట్ అనడంతో ఆ టాపిక్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు..

నాన్న వీళ్ళందరూ ఇంకా నుంచునే ఉన్నారు కూర్చోబెట్టి మాట్లాడాలని అని  అంటుంది. మీరందరూ కూర్చోండి నేను స్నాక్స్ తీసుకొస్తాను. ఆ తర్వాత మీకు  కావాల్సిన లంచ్ రెడీ చేస్తాను అని సామ్రాట్ అంటాడు..

మా సామ్రాట్ వంట బాగా చేస్తాడు నల్ల భీముడు తర్వాత మా సామ్రాటే అంత బాగా చేస్తాడు అని సమ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు. మా నందు కూడా బాగానే చేస్తాడు అని లాస్య అంటుంది.. సామ్రాట్ ఒకటి నందు ఒకటి ఇద్దరు కలిసి వంటలు చేస్తారు అని లాస్య టీమ్స్ డివైడ్ చేస్తుంది..

నేను, లాస్య ఇద్దరం వంటల టెస్ట్ చూసి చెబుతాం అని తులసి అంటుంది.. అలా నందు సామ్రాట్ ఇద్దరు వంటలు చేస్తారు తులసి సామ్రాట్ ఇద్దరు మాట్లాడుకోవడం చూసి నందు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపో పోతుండగా లాస్య అడ్డుపడుతుంది.. ఏమైంది వెళ్తున్నావ్ అని అడగగా.. గంగలో దూకడానికి వెళ్తున్నాను అని నందు అంటాడు.. తులసికి సామ్రాట్ దగ్గర అవుతుంటే నాకు కోపం రగిలిపోతుంది అని నందు అంటాడు..