దుర్గను ఇరికించబోయిన మోనిత. తన గొయ్యి తానే తోవ్వుకోవడం అంటే ఇదేనేమో!

కార్తీక దీపం October 19 ఎపిసోడ్ 1488:

Karthika Deepak Images Courtesy of Disney+ Hostar

ఈరోజు అక్టోబర్ 20 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. శివ మోనితకి నిజం చెప్పేస్తాడు.దాంతో మోనిత షాక్ అవుతుంది. ‘అంటే.. కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందా?’ అని అనుమానిస్తుంది.

లేదులే గుర్తొస్తే నాతో ఎందుకు అలా ఉంటాడు అని అనుకుంటుంది. ఇక కార్తీక్ దీప దగ్గర ఉండడం చూసి మోనిత షాక్ అవుతుంది. ఈ క్రమంలోనే నేటి. ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి..ఇక కార్తీక్ వంట పూర్తి చేసి సరిగ్గా తినమని దీప ముందు పెట్టే సరికి.. మోనిత ఆవేశంగా వచ్చేస్తుంది. ‘కార్తీక్ ఏంటిది? ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నావేంటీ?’ అంటూ నిలదీస్తుంది.

అది సరే కానీ.. నన్ను ఎందుకు రమ్మంటున్నావ్.. మీ దుర్గాగారు లేరా?’ అంటాడు అనుమానంగా మోనితని కార్తీక్ కావాలనే రెచ్చగొడుతూ.అవును డాక్టరమ్మా మొన్నోరోజు శివతో డాక్టర్ బాబుని రెండు గంటలు బయటకి తిప్పమని చెప్పారట కదా నువ్వు దుర్గసార్? అందుకే నువ్వు చెప్పకముందే బయటికి వచ్చేసారు అంటుంది డాక్టర్ బాబు’ అంటూ చురకలు వేస్తుంది దీప.

ఇక కార్తీక్ మాత్రం నువ్వు తిని దీపా అది ఎప్పుడూ ఉండే రచ్చే కదా అంటూ దీపకు ప్రేమగా వడ్డిస్తాడు. ఇక మరోవైపు దుర్గ దగ్గరకు వెళ్లిన మోనిత.. ‘నీ అంత తేలుస్తా ఇక మీ కథ ముగిస్తాను’ అని డైరెక్ట్‌గా పొగరుగా వార్నింగ్ ఇస్తుంది.మోనిత అలా వార్నింగ్ ఇవ్వడంతో దుర్గ కాస్త భయపడి జరిగిన విషయం దీపకు చెబుతాడు.సరే జాగ్రత్తగా ఉండు అంటుంది దీప.

మరోవైపు కార్తీక్ శివ దగ్గరకు వెళ్లి సౌర్యను వెతికావా?’ అంటూ ఆరా తీస్తాడు. ‘వెతికాను.. వెతుకుతూనే ఉన్నాను’ అంటూ బిల్డప్ కొడతాడు శివ. ‘సరే శివా.. నాకు మరో సాయం చెయ్యాలి నువ్వు’ అంటాడు కార్తీక్. ‘చెప్పండి సార్ అంటే ఈ రోజు రాత్రి నుంచి నువ్వు ఆ వంటలక్క ఇంటి ముందే నిద్రపోవాలి’ అంటాడు కార్తీక్. బిత్తరపోతాడు శివ.

మరోవైపు దీప, దుర్గలు వేరువేరుగా మోనిత ఏం చేయబోతుందోనని భయపడుతూ కంగారుపడుతూ గడుపుతారు. మోనిత మాత్రం ఎక్కడికో వెళ్తుంది. అక్కడ కూడా మోనిత చాలా నమ్మకంగా ధైర్యంగా ఉంటుంది. 

ఇంతలోనే మోనిత కారు ఇంటి ముందు ఆగుతుంది. ఆ వెనుకే పోలీసుల కారు కూడా ఆగుతుంది. అందులోంచి పోలీసులు దిగుతారు. వెంటనే మోనిత.రండి సార్ అంటూ వాళ్లని తీసుకొస్తుంది. దుర్గను చూపించి అదిగో వాడే..

అప్పుడే ‘ఒక్కనిమిషం ఆగండి ఎస్ఐ గారు అంటాడు కార్తీక్. ‘మోనితా.. మరి దుర్గ క్రిమినల్ అయితే.. అలాంటి క్రిమినల్‌ని స్నేహితుడు, బంధువు అని ఎందుకు చెప్పావ్‌ ఇన్నిరోజులు?’ అంటాడు. మోనిత బిత్తరపోతుంది. ‘ఎస్‌ఐ గారు.. 

అందులో దుర్గ ‘మోనిత నేను బెస్ట్ ఫ్రెండ్స్, బంధువులం కూడా తను నేను కలిసే ఏ పని అయినా చేసేవాళ్లంఅంటూ ఉంటుంది. అది చూసిన పోలీస్ ఆఫీసర్ ఏంటి మేడమ్ అంటే వీడు చేసిన పనుల్లో మీకు భాగం ఉందా? ఇద్దరూ కలిసే నేరాలు చేస్తున్నారా’ అంటాడు ఎస్ఐ కోపంగా.

అయ్యో ఒక్కనిమిషం సార్.. వీళ్లు నేరం చేశారని నేను అనడంలేదు. తను గతం మరిచిపోయింది ఒకరోజు దుర్గ మంచివాడు అంటుంది. మరో రోజు దుర్గ చెడ్డవాడు అంటుంది.. తనకి ఏం గుర్తుండదు అంటూ సమాధానం ఇస్తాడు కార్తీక్.