రామ్ గోపాల్ వర్మ..! అక్కినేని నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన ‘శివ‘ తీసినప్పుడు అయినా లేదా స్వీటీ అనే ఒక హాట్ పాపతో ‘నగ్నం‘ అంటే ఒక బూతు లాంటి సినిమాలు తీసినప్పుడైనా ఆ పేరులో అదే సెన్సేషన్. వర్మ ట్వీట్ వేదవాక్కులుగా భావించే కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ అతని సొంతం. అతనికి లక్షలాది మంది శత్రువులు, ద్వేషించేవారు మరియు కించపరిచేవారు ఉంటారు కానీ ఎవరు అతని జీవితాన్ని కనీసం రవ్వంత కూడా ప్రభావితం చేసింది లేదు. అది వర్మ రేంజ్. మరి లాక్ డౌన్ సమయంలో తన కంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్న వర్మ ఇప్పటికే వరుస సినిమాలతో థియేటర్స్ తో సంబంధం లేకుండా ‘క్లైమాక్స్‘ మరియు ‘నగ్నం‘ అనే రెండు చిత్రాలను తీసి ప్రేక్షకుల మీదకు వదిలారు. ఇప్పుడు ‘పవర్ స్టార్‘ పవన్ కళ్యాణ్ బయోపిక్ అంటూ మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ వర్మ వీటివల్ల లాభం ఎంత వస్తుందో చూద్దాం…
పాపులర్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో రామ్ గోపాల్ వర్మ ఏడారిలో చేయించిన విన్యాసాలే ‘క్లైమాక్స్‘ సినిమా. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటిసారి శ్రేయాస్ ఈటీ మీడియా మరియు ఎటిటి యాప్ లో ‘పే పర్ వ్యూ‘ కింద ఒకసారి వీక్షించేందుకు వంద రూపాయలను రుసుము గా నిర్ణయించారు. అయితే చాలామంది ఈ సినిమాను ఎవరు చూస్తారు లే అని లైట్ తీసుకున్నారు కానీ వర్మ మాత్రం క్షణాల్లో లో రికార్డులు కొల్లగొట్టాడం మొదలు పెట్టేశాడు. చిత్రం విడుదలైన 24 గంటల లోపల లక్షా 70 వేల మంది ‘క్లైమాక్స్‘ చిత్రాన్ని తలా 100 రూపాయలు వెచ్చించి చూడగా మొత్తం మీద ఈ చిత్రం వల్ల వర్మకి మొదటిరోజే దాదాపు రెండు కోట్ల రూపాయలు వచ్చింది. ఈ సినిమా కి అయిన ఖర్చు అటుఇటుగా 5-10 లక్షల లోపు అన్నది ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాకి మొత్తం మీద మూడు కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని చెబుతున్నారు.
ఇక శ్రీ రాపాక తో వర్మ తీసిన ‘నగ్నం‘ చిత్రానికి అయిన ఖర్చు అక్షరాలా రెండు వేల రూపాయలు అని వర్మ వెల్లడించడం సంచలనం. ఈ చిత్రం మొదటి రోజే…. మొదటి రోజు కూడా కాదు కేవలం 12 గంటల లోపల 70 లక్షల వరకు వసూలు సాధించగా దీనికి కూడా ‘పే పర్ వ్యూ‘ పద్ధతిని అవలంబించారు. అయితే వర్మ ఈ చిత్రానికి అయిన ఖర్చుగా ఆ చిత్రంలో పనివాడి పాత్రలో నటించిన అతని ప్రయాణానికి అవసరమైన రెండు వేల రూపాయలు మాత్రమే అని చెప్పడం గమనార్హం. కెమెరా, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ మొత్తం తన ఆధ్వర్యంలోనే జరిగిందని దానికి పైసా కూడా తన ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదని చెప్తే అందరూ నోరెళ్లబెట్టారు. ఇలా రెండు వేల రూపాయలతో సినిమా తీసి కోట్ల రూపాయలు కొల్లగొట్టడం ఒక్క వర్మకే చెల్లింది.
ఇప్పుడు ‘పవర్ స్టార్‘ అనే పేరుతో పవన్ కళ్యాణ్ పైన సినిమా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని రీతిలో తొలిసారిగా ట్రైలర్ చూడడానికి కూడా టిక్కెట్ ను పెట్టబోతున్నాడు. నేను ఏం తీసినా జనాలు చూస్తారు అన్న ధైర్యమో.. లేKఅ కొంత మంది చూసిన తన పెట్టుబడి తిరిగి వస్తుందన్న ఆశో తెలియదుగానీ 50 రూపాయలు పెడితే తప్ప ఈ సినిమాట్రైలర్ చూడలేరని వర్మ చెబుతున్నాడు. సినిమాలు చూస్తారో లేదో అన్నది పక్కన పెడితే…. అయితే అతను పవర్ స్టార్ గురించి ఏం చెప్పబోతున్నాడా అని ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రజల్లో ఉంటుంది. దానికోసం కచ్చితంగా ట్రైలర్ చూస్తారు.. దానినే వర్మ క్యాష్ చేసుకోబోతున్నాడు. వర్మ ఈనెల 16న ‘పవర్ స్టార్’ ట్రైలర్ రిలీజ్ చేస్తుండగా…. జూలై 24న సినిమాని విడుదల చేయబోతున్నాం అని చెప్పాడు వర్మ. ఆ రోజు ‘తొలిప్రేమ‘ రిలీజ్ డేట్ కాబట్టి పవన్ ఫ్యాన్స్ అంతా ఆయనపై పీకల వరకు కోపంతో ఉన్నారు. అయితే అవేమీ పట్టించుకోని వర్మ చిత్రానికి మాత్రం కనీసం 200 రూపాయలు టిక్కెట్ గా విధించాలని ఫిక్సయ్యాడని టాక్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందా లేదా మరో వివాదం రేపుతుందా అన్నది వేచి చూడాలి కానీ వేలు, లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు కొల్లగొట్టడం అంటే రామ్ గోపాల్ వర్మకి తప్ప ఎవరికి సాధ్యం చెప్పండి.
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More
Anasuya Bharadwaj: స్టార్ యాంకర్, నటి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెలబ్రేట్… Read More
Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జరిగింది.… Read More
ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, ఎవరికి వారు అన్నట్టుగా నాయకులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వరకు మార్మోగిన… Read More
రాష్ట్రంలో ఎన్నికలు ఏరేంజ్‌లో జరిగాయో అందరికీ తెలిసిందే. పెను తుఫాను వచ్చిందా? సునామీ కది లి వచ్చిందా? అన్నట్టుగా ఈ… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు.. ఇతర నియోజకవ ర్గాలతో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య పోరు జోరుగా సాగిన విషయం తెలిసిం దే. ఒకరిపై… Read More
Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More
Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More
May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More