తమిళనాడులో స్టాలిన్‎కు ఈసారైనా పీఠం దక్కేనా?

Published by
DEVELOPING STORY

అమ్మా లేదు… అయ్యా లేడు…

పేరేంటి… కొంచెం తేడాగా ఉందనుకుంటున్నారా… అవునండీ పేరును బట్టి ఐటెమ్ ఓపెన్ చేస్తున్నారు కదా… అందుకే మంచి ఇంటరెస్టింగ్ న్యూస్ అందించేందుకు ఈ టైటిల్ పెట్టాం… తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయ్. తమిళనాడు గోల మనకెందుకు అనుకుంటున్నారా… మన దగ్గర కూడా అసెంబ్లీ రద్దు చేయండి ఎన్నికలకు వెళ్తామంటూ పచ్చ పార్టీ ప్రకటనలు చేస్తోంది కదా… ఆ విషయం పక్కనబెడితే… తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు సంథింగ్ స్పెషల్… ఎందుకంటే అమ్మగా కొలిచే జయలలిత లేదు.. అయ్యగా ఆరాధించే కరుణానిధి లేడు. దుమ్మురేపుతామన్న తలైవ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏం చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఇద్దరు అగ్ర హీరోలు రంగం సిద్ధం చేసుకుంటుంటే… అసలేం జరగబోతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు దేశ వ్యాప్తంగా నెలకొంది.

 

karunanidhi, jayalalita file photo

అంతా శశికళే చేసింది…

తంతే గారెల బుట్టలో పడినట్టు పడ్డారు తమిళనాడు సీఎం పళనిస్వామి. పన్నీర్ సెల్వంను సాగనంపి తమిళనాడును ఎలాలనుకున్న జయ నెచ్చెలి శశికళ… ఆస్తుల కేసులో బెంగళూరులో శిక్ష అనుభవిస్తుండటంతో… తమిళనాడులో సరికొత్త రాజకీయం ఆవిష్కృతమయ్యింది. వాస్తవానికి తమిళనాడు విషయంలో బీజేపీ అంతగా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది కాదు. కానీ శశికళ కేంద్రాన్ని సవాలు చేయడంతో… మోదీని మోదాలనుకోవడంతో సీన్ మారిపోయింది. తనకు ఎమ్మెల్యేల మద్దతుందన్న అహంకారంతో భవిష్యత్ చూసుకోకుండా శశి చేసిన ఓవరాక్షన్ ఆమెను జైలుకు పంపించింది. ఆమె జైలు నుంచి వచ్చి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. అది ఎంత వరకు సాధ్యమే ఢిల్లీ పెద్దలకే తెలియాలి. ఎందుకంటే ఆ కేసు కాకుంటే ఇంకో కేసు బనాయించేందుకు ఇబ్బందేం ఉంటుంది.

 

narendra modi, sasikala (jayalalita death file photo)

బొంగులో హిందీ

ఇప్పుడు తమిళనాడులో అరమ్ ఓవరాక్షన్ హిందీపై మొదలయ్యింది. హిందీని వ్యతిరేకించే తంబీలు ఇప్పుడు మరోసారి అదే అస్త్రంతో ఎన్నికల బరిలో దిగాలన్న ఆలోచనతో ఉంది. కరుణానిధి మరణం తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో నడిపిస్తున్న స్టాలిన్… తమిళనాడు సీఎం కావడానికి అన్ని సమకూర్చుకుంటున్నారు. అయితే అక్కడ గ్రౌండ్ అంత తేలిగ్గా కన్పించడం లేదు. వాస్తవానికి తమిళనాడులో ఏ ప్రభుత్వమైనా ఐదేళ్ల తర్వాత బిచానా ఎత్తేయాల్సిందే. కానీ జయలలిత అనూహ్యంగా విజయం సాధించారు. కానీ ఆమె సీఎంగా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే మరణించడంతో తమిళనాడులో తంబీలే అధికారం చెలాయిస్తూ వచ్చారు. తాజాగా అక్కడ హిందీ వ్యతిరేక ఉద్యమానికి కరుణ తనయ కనిమొళి నేతృత్వం వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే రెచ్చగొట్టడానికి ఒక అస్త్రం దొరికింది కదా…

 

tamilnadu hindi agitation

లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే జయభేరి

అయితే ఏడాదిన్నర క్రితం జరిగిన లోక్‎సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకొంది. 39 స్థానాల్లో 38 గెలుచుకొని అన్నాడీఎంకేకు వెన్నులో వణుకు పుట్టించింది. బీజేపీ ఇతర చిన్నా చితక పార్టీలతో కూటమి గట్టిన అన్నాడీఎంకే కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ కూటమిలో చేరిన పాపానికి బీజేపీ చిత్తయ్యింది. సొంతంగా డీఎంకే 24 స్థానాల్లో విజయం సాధించి ఔరా అన్పించుకుంది. తమిళనాడులో చాన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకోవడం విశేషం. దేశ వ్యాప్తంగా 52 స్థానాల్లోనే విజయం సాధించిన ఆ పార్టీ స్టాలిన్ అండతో 8 సీట్లను గెలుచుకోగలిగింది. తమిళనాడులో అధికారం చేపట్టాలంటే 117 స్థానాల్లో గెలవాలి. లోక్ సభ ఎన్నికలు రిపీట్ అయితే స్టాలిన్ కు విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా…

 

dmk alliance wins tamil nadu 2019 loksabha elections

ఎలక్షన్ ఇయర్

ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండటంతో అక్కడ ఏ పాచిక విసిరితే అధికారం సాధ్యమన్నదానిపై ఇప్పుడు డీఎంకే, అన్నాడీఎంకే రెండూ కూడా దృష్టిపెట్టాయ్. రజనీకాంత్ పార్టీ పెట్టినా ఆయన ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి వేస్తున్నారు. కమల్ హాసన్ పార్టీ గురించి అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదు. తమిళనాడులో ఇంపాక్ట్ చూపించే వ్యక్తుల్లో విజయ్ థళపతి ఒకరు. ఆయన ఐదేళ్లుగా అన్నాడీఎంకే ఓవరాక్షన్ ను భరిస్తా వస్తున్నారు. రాజకీయాలపై ఎక్కువగా సినిమాలు తీసే విజయ్… ఈసారి తమిళనాడు ఎన్నికల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ఆయన డీఎంకేకు మద్దతిస్తారా… లేక వేరు కుంపటి పెడతారా.. లేక అసలు రాజకీయాల్లోకి రారా అన్నది త్వరలోనే తేలనుంది. మొత్తంగా తమిళనాడులో సవరం ఎవరికో తెలుసుకోవాలంటే మరింత విశ్లేషణకు న్యూస్ ఆర్బిట్ వెబ్ సైట్ బ్రౌజ్ చేస్తూనే ఉండండి. తెలుగులో స్టఫ్ ఉన్న ఆర్టికల్స్‎కు పెట్టింది పేరైన… న్యూస్ ఆర్బిట్ మరిన్ని ప్రత్యేక కథనాలతో తమిళ రాజకీయాన్ని మీకు రసవత్తరంగా అందిస్తుంది.

This post was last modified on August 15, 2020 7:36 pm

DEVELOPING STORY

Recent Posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More

May 19, 2024

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More

May 19, 2024

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More

May 19, 2024

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More

May 19, 2024

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024