Ram sethu : రామ్ సేతు.. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా. స్టార్ హీరో అక్షయ్ కుమార్ గత నాలుగేళ్ళుగా వరసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. ఒక్కో సినిమాకి ఎంతో వేరియేషన్ ఉన్న కథని ఎంచుకుంటున్న అక్షయ్ కుమార్..ఖచ్చితంగా ఆ కథలో సామాజిక అంశం ఉండేలా సమాజానికి మెసేజ్ ఉండేల జాగ్రత్త తీసుకుంటున్నాడు. వీలైనంత తక్కువ బడ్జెట్ లో సినిమా నిర్మాణం ఉండాలని నిర్మాతకి కండీషన్ పెడుతూ అదే నిర్మాతకి భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాడు. ఇలా అక్షయ్ నిర్మాతగా హీరోగా మారి సినిమా తర్వాత సినిమా చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.
కాగా తాజాగా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రామ్ సేతు టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో ‘పరమాణు’ సినిమాని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అభిషేక్ శర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చంద్ర ప్రకాష్ ద్వివేది సమర్పణలో కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ – అబండంటియా ఎంటర్టైన్మెంట్ – లైకా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చేరుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక మార్చి 18న అయోధ్య రామ జన్మభూమిలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సీమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘రామ్ సేతు’ నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ సేతు’ సినిమాలో అక్షయ్ కుమార్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. కాగా భారతదేశం – శ్రీలంకలను కలిపే రామ సేతు వంతెన నేపథ్యంలో భారతీయ సంస్కృతి మరియు చారిత్రక వారసత్వ మూలాల ఆధారంగా యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ‘రామ్ సేతు’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలంకన్ బ్యూటి జాక్వలైన్ ఫెర్నాండెజ్ – నుష్రాత్ భరుచ్ఛా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
This post was last modified on March 30, 2021 9:28 pm
Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More
Anasuya Bharadwaj: స్టార్ యాంకర్, నటి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెలబ్రేట్… Read More
Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More