Corona Virus : కోరలు చాస్తున్న కరోనా ! సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ను లైట్ తీసుకోవద్దు ఎవరైనా!

Published by
Yandamuri

Corona Virus : ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు. జాగ్రత్తగా ఉండకపోతే కరోనా కాటేయడం ఖాయం. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు అనే స్టేజ్‌ దాటిపోయింది. మే నెల గడిచేసరికి మరో పాతిక లక్షల మందికి కరోనా సోకడం ఖాయం. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా అధ్యయనం చెబుతున్న వాస్తవాలివి. ఎండాకాలం వచ్చేస్తోంది కాబట్టి ఇక కరోనా తగ్గుముఖం పట్టొచ్చు అనుకున్నారు. కాని, ఎండ పెరిగి ఇప్పుడిప్పుడే వడగాలులు వీస్తున్న సమయంలోనే వైరస్‌ మరింత విజృంభిస్తోంది.

Don’t take the second wave effect light anyone!

గత సెప్టెంబర్ 11న 97వేల కేసులు నమోదయ్యాయి. చలికాలం ప్రారంభమైన తరువాత వైరస్ వేగం తగ్గింది. మొన్న జనవరి 25న అతి తక్కువగా 9వేల కేసులే నమోదయ్యాయి. 97వేలకి 9వేలకి ఎక్కడా పోలికే లేదు. కాని, చలి తగ్గి ఎండ పెరుగుతున్న కొద్దీ వైరస్‌ విజృంభిస్తోంది. ఇక ఏప్రిల్, మే నెలలో అయితే కరోనా కట్టలు తెంచుకోవడం ఖాయం అంటున్నాయి అధ్యయనాలు. సో, ఎండాకాలంలో కరోనా వైరస్‌ ఏమీ చేయదు అనుకునే వారికి ఇదొక హెచ్చరిక అంటున్నారు వైద్య నిపుణులు.

Corona Virus: తెలంగాణలో కరోనా ఉధృతి!

మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. కాని, పక్కనున్న మహారాష్ట్ర, కర్నాటకలో వైరస్‌ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి వచ్చే వాళ్ల కారణంగానూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మనవాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తుండడం, వాళ్లు మన రాష్ట్రాల్లోకి వస్తుండడం, అంతర్జాతీయ రాకపోకలు పెరగడం, కరోనా నిబంధనలను సీరియస్‌గా పాటించకపోవడంతో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది.

ఈనెల మొదట్లో వంద, 150 ఉన్న కేసులు ఇప్పుడు 500లకు చేరువయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పది రోజుల క్రితం వరకు 29 పాజిటివ్‌లే నమోదయ్యాయి. ఇప్పుడు 138కి చేరాయి. గత వారంరోజుల్లో దాదాపు 70 శాతం కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ సహా రంగారెడ్డి, మల్కాజిగిరి, ఆదిలాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.

ముందున్నది ముసళ్ళ పండగ!

వచ్చే రెండు మూడు నెలల్లో కొత్తగా పాతిక లక్షల కేసులు నమోదవుతాయనడం మామూలు విషయం కాదు. అందుకే, మాస్కులు పెట్టుకోవడం, దూరం పాటించడం మినహా కరోనాను కట్టడి చేసే మరో మార్గం లేదంటున్నారు. ముఖ్యంగా సిటీల్లో ఉండే వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా విజృంభిస్తుండడంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూల్ నడుస్తోంది. బెంగళూరులోకి ఇతర రాష్ట్రాల వాళ్లు రావాలంటే కరోనా నెగటివ్ రిపోర్ట్‌ చేతిలో ఉండాల్సిందే. ఇక మహారాష్ట్రలో అయితే ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ నడుస్తోంది. చాలా రాష్ట్రాల్లో రాత్రిళ్లు కర్ఫ్యూ పెడుతున్నారు.

This post was last modified on March 28, 2021 11:51 am

Yandamuri

Share
Published by
Yandamuri

Recent Posts

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More

May 19, 2024

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More

May 19, 2024

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More

May 19, 2024

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More

May 19, 2024

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024