అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో రౌడీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫైటర్ సినిమా లో నటిస్తున్నాడు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా… బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఇక పాన్ ఇండియా కేటగిరీలో నాలుగు ప్రధాన భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది కాబట్టి యూనివర్సల్ గా ఈ సినిమాకి ఫైటర్ అన్న టైటిల్ ని ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.
అయితే ఇది కన్ఫర్మ్ కాలేదు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఎంత మాస్ గా.. ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. పూరి హీరో కి ఒక మానరిజం ఉంటుంది. దాని కోసమే హీరోలందరు ఆయన సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు కమర్షియల్ హీరోగా మంచి ఇమేజ్ ని సంపాదించుకుంటారు.
మాస్ డైరెక్టర్ – మాస్ హీరో కలిస్తే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఉండే అంచనాలు వేరే. ఆ అంచనాలని అందుకోవాలని పూరి-విజయ్ భావిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ముంబైలో షూటింగ్ మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇటీవలే హైదరాబాద్ లో సెట్ వేసి ఇక్కడే సినిమా ఫినిష్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవలే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యకు పాల్పడి చనిపోయిన విషయం తెలిసిందే. సుశాంత్ డెత్ వెనుక పలువురు ప్రముఖులు కారణం అంటూ.. అందులో ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పేరు ప్రముఖంగా వినిపిచింది. అయితే సుశాంత్ మరణానికి కరణ్ కారణం అయ్యాడని ఆయన నిర్మించిన ‘సడక్-2’ సినిమా ట్రైలర్ విపరీతంగా నెగటివ్ టాక్ తో పాటు యూట్యూబ్ లో డిస్ లైక్స్ వచ్చాయి.
అంతేకాదు కరణ్ జోహార్ నిర్మించిన గుంజన్ సక్సేనా, సడక్-2 సినిమాలకి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నిర్మిస్తున్న ఫైటర్ మూవీకి కూడా కరణ్ జోహార్ ఎఫెక్ట్ ప్రభావం పడే అవకాశాలున్నాయని మాట్లాడుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవ్వాలన్న ప్లాన్స్ కి సుశాంత్ డెత్ ఎఫెక్ట్ బాగా పడబోతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో పూరి ఏంచేస్తారో చూడాలి.
This post was last modified on August 18, 2020 3:59 pm
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More
Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More
OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More
T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More
Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More
Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More
Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More
ఏపీ సీఎం జగన్‌పై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్న ఒకప్పటి వైసీపీ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా… Read More