Cm Kcr : సీఎం కేసీఆర్ Cm Kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వోద్యోగులకు భారీ పీఆర్సీ ప్రకటించారు. ఏకంగా 9లక్షల 15వేల 797 మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో లబ్ది పొందబోతున్నారు. దీంతో ఉద్యోగులు హ్యాపీ. అదే విధంగా వారి రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచారు. ఇది కూడా వారిని సంతోషపెట్టే విషయమే. ఇలా ఒక్కసారిగా ఉద్యోగులపై ప్రేమ చూపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ సమయంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది కాబట్టి వారి సేవలకు ఇదొక గుర్తింపు అన్నారు. ఇది కూడా బాగానే ఉంది. అయితే.. వీటిలో ఒక నిర్ణయంతో తెలంగాణలోని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచడమే నిరుద్యోగులు తట్టుకోలేకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, పలు యూనివర్శిటీల్లోని విద్యార్ధులు భగ్గు మంటున్నారు. కేసీఆర్ చిత్రపటాలను తగులబెట్టారు. వరంగల్ కేయూ విద్యార్ధులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. నిజామాబాద్ లోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీలో తెలంగాణ విద్యార్ధి ఉద్యమ వేదిక ఏకంగా సీఎం చిత్రపటానికి సారాతో అభిషేకం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని అంటున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడమంటే నిరుద్యోగులకు కొత్త నోటిఫికేషన్లు మరో మూడేళ్లపాటు ఉండవనేది వారి వాదన. ఇదే జరిగితే వారికి మరింత నిరీక్షణ తప్పదు. అందుకే నిరుద్యోగుల్లో సీఎం నిర్ణయం ఆగ్రహం తెప్పించింది. అయితే..
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంత ఉన్నా.. యూనివర్శిటీ స్టూడెంట్స్, నిరుద్యోగుల పాత్ర మరింత ఉందనే చెప్పాలి. 2009లో కేసీఆర్ దీక్ష సమయంలో ఉస్మానియా విద్యార్ధుల చూపిన పట్టుదలే కేసీఆర్ దీక్షపై మరింత ప్రభావం చూపి ఆ సెగ కేంద్రానికి తగిలేలా చేసింది. రాష్ట్రం కోసం యువత ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి పాత్రను అసలేమాత్రం తక్కువ చేయలేనిది. ప్రభుత్వం కూడా కొత్త నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తోంది. కానీ.. ప్రస్తుతమున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే మరో మూడేళ్లు వారికి నిరాశ తప్పదు. ఇదే వారికి నిరాశను తెప్పిస్తోంది. మరి.. సీఎం కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి..!
This post was last modified on March 23, 2021 12:28 pm
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More
Anasuya Bharadwaj: స్టార్ యాంకర్, నటి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెలబ్రేట్… Read More
Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జరిగింది.… Read More
ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, ఎవరికి వారు అన్నట్టుగా నాయకులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వరకు మార్మోగిన… Read More
రాష్ట్రంలో ఎన్నికలు ఏరేంజ్‌లో జరిగాయో అందరికీ తెలిసిందే. పెను తుఫాను వచ్చిందా? సునామీ కది లి వచ్చిందా? అన్నట్టుగా ఈ… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు.. ఇతర నియోజకవ ర్గాలతో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య పోరు జోరుగా సాగిన విషయం తెలిసిం దే. ఒకరిపై… Read More
Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More
Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More
May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More