CM YS Jagan: సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి  – జలవనరుల సంరక్షణపై అంతర్జాతీయ సద్సస్సులో సీఎం జగన్

Published by
sharma somaraju

CM YS Jagan: విశాఖ రుషికొండలోని రాడిసన్ హోటల్ నందు జలవనరుల సంరక్షణపై వారం రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు (25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ) కాంగ్రెస్ ప్లీనరీ)ని కేంద్ర జలశక్తి మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం అనే థీమ్ తో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఐసీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు విడతల రజిని, గుడివాడ అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు భారత్ నుండి 300 మంది, అస్ట్రేలియా, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయిల్, జపాన్, కొరియా, మలేషియా, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం ఇలా 74 దేశాల నుండి 900 మందికిపైగా ప్రతినిధులు హజరయ్యారు.

ఈ సందర్భంగా  ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ నీటి పారుదల రంగంపై అంతర్జాతీయ  సదస్సు ఇక్కడ జరగడం శుభపరిణామం అని అన్నారు. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో ప్రభుత్వం సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యమన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరుచూ కరువు వస్తొందన్నారు. వర్షం కురిసేది తక్కువ కాలమేనని, ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలని అన్నారు. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని సీం జగన్ పేర్కొన్నారు.  

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ నీటి పారుదల రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఇరిగేషన్ పై ప్రత్యేకంగా పోకస్ పెడుతున్నామని వివరించారు. ప్రపంచ దేశాలకు భారత్ అతి పెద్ద ఎగుమతిదారుడుగా వృద్ది చెందుతోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తామని చెపారు. మోడీ నేతృత్వంలో రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నామని వివరించారు. భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్తు తరాలకు ఉపయోగమన్నారు. వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నామన్నారు.

తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు షెకావత్. 2019 లో మోడీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించామని చెప్పారు. జలశక్తి అభియాన్ తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. నదుల అనుసంధానం ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్, మద్య ప్రదేశ్ లో ఉన్న నదులను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. డ్యామ్ సెఫ్టీ యాక్ట్ ల ద్వారా డ్యామ్ ల పరిరక్షణ జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డ్యామ్ లను పరిరక్షిస్తున్నామని వివరించారు. ప్రపంచ బ్యాంక్ సహకారంతో డ్యామ్ ల పరిరక్షణ జరుగుతోందని షెకావత్ తెలిపారు.

IT Rides: హైదరాబాద్ లో మరో సారి ఐటీ సోదాల కలకలం .. కాంగ్రెస్ నేతల్లో గుబులు

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More

May 19, 2024

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Chandu: త్రినయని సీరియల్ లో నటించిన చందు మన అందరికీ సుపరిచితమే. ప్రజెంట్ చందు రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం బంటి… Read More

May 18, 2024

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Big Boss: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బిగ్ బాస్ అంటే… Read More

May 18, 2024

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Trinayani: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు… Read More

May 18, 2024

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Bigg Boss Ashwini: అనేకమంది నటీనటులు బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. గతంలో వారు ఎవరో ప్రేక్షకులకు… Read More

May 18, 2024

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Anchor Varshini: చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాకి దగ్గరగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉంటారు. మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ… Read More

May 18, 2024

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Tollywood: ప్రస్తుతం ఉన్న సీరియల్ తారలు సినిమా తారలు కంటే ఎక్కువ హాట్ గా కనిపిస్తున్నారు. సినిమాలు ఏ రేంజ్… Read More

May 18, 2024

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Manasu Mamatha: ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ మొత్తం వేడాకుల వ్యవహారాలతో వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు విడాకులు తీసుకుంటూ… Read More

May 18, 2024

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?

Arvind Kejrival: లోక్ సభ ఎన్నికల తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుస ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేతల అరెస్టు… Read More

May 18, 2024

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్… Read More

May 18, 2024

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని… Read More

May 18, 2024

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

Telangana EAPCET: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్… Read More

May 18, 2024

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More

May 18, 2024

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More

May 18, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More

May 18, 2024