కొత్త జిల్లాలు రాకముందే జగన్ కు కొత్త తలనొప్పులు..!!

Published by
sharma somaraju

ఏపీలో జిల్లాల విభజన కు ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ప్రాథమికంగా కొన్ని ప్రకటనలు మాత్రమే వచ్చాయి. చూచాయగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఓ సమావేశంలో పార్లమెంట్ నియోజక వర్గాలను జిల్లాలుగా మారుస్తామన్నారు. ఇది పట్టుకొని వైసిపి నాయకులు టిడిపి నాయకులు కొంత మంది హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల డిమాండ్ లు కొన్ని పుట్టు కొస్తున్నాయి. పాత జిల్లాలను విభజించవద్దని డిమాండ్ లు పుట్టుకొస్తున్నాయి. ఇవి చిలికి చిలికి వివాదాస్పదం గా మరే అవకాశాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు అనే ఆలోచన నుంచే జగన్ కొత్త పుట్టుకొస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త జిల్లాల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఒక సూచన చేశారు.

2026 తర్వాత మారితే ఏమిచేస్తారు..?

2026 లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దులు మారిపోతాయి. అంటే అప్పటికి జిల్లాల విభజన పూర్తి అయితే ఆ నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా జిల్లాలను మారుస్తారా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. ఇది నిజానికి జగన్ ఆలోచించాల్సిన విషయమే. పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలని అనుకునే ఆలోచననే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మేధావి వర్గం కావచ్చు, ఐఎఎస్ వర్గం కావచ్చు, రాజకీయ నాయకుల్లో సీనియర్లు కూడా పార్లమెంటు ను జిల్లాగా చేయడం ఏ మాత్రం అంగీకరించడం లేదు. పార్లమెంటు స్థానం అనేది కేవలం ఎన్నికలు, ఓటర్ల దృష్టిలో పెట్టుకుని చేసింది. ఓటర్లు ఓట్లు వేయాలంటే పార్లమెంటు స్థానం కేంద్రానికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎవరు ఎవరి ఊళ్ళో పోలింగ్ బూత్ కు వెళ్లి ఓట్లు చేసుకోవచ్చు. కానీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా గా మార్చడం వలన నియోజకవర్గ కేంద్రం అంటే జిల్లా కేంద్రానికి ప్రజలు తరచు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దూరాభారం ఎక్కువగా ఉంటుంది. అరకు పార్లమెంట్ ను తీసుకుంటే ఈ పార్లమెంట్ పరిధిలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా నుంచి మొదలుకొని విజయనగరం, శ్రీకాకుళం తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు 250 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దాన్ని జిల్లాగా మారిస్తే ఈ 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి రావడం కంటే హైదరాబాద్ వెళ్లి రావడం నయం అన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అలాగే ప్రకాశం జిల్లా లోనూ, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకే సి ఎం జగన్ దీనిపై పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోని నాయకులు నుంచి కూడా జిల్లాల విషయంలో కొన్ని సూచనలు భిన్న వాదనలు వస్తున్నాయి. తాజాగా స్పీకర్ తమ్మినేని కూడా ఈ విషయంపై స్పందించారు.

స్పీకర్ తమ్మినేని ఏమన్నారంటే..

శ్రీకాకుళం జిల్లాను అసలు విభజించాల్సిన అవసరం లేదని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల కిందట శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా తమ్మినేని కూడా శ్రీకాకుళం జిల్లాను విధించాల్సిన అవసరం లేదంటూ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఈ రెండు విస్తీర్ణం పరంగా కూడా చిన్న జిల్లాలు. వీటిని విభజిస్తే సాంకేతికంగా జిల్లా కేంద్రం విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇది కొత్త పాయింట్ యే. జగన్ ఆలోచించాల్సిన పాయింటే. రాష్ట్రంలో జిల్లాల విభజనకు వెళ్లాల్సి వస్తీ పెద్ద జిల్లాలుగా ఉన్న విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు అనంతపురం కర్నూలు వంటి జిల్లాలపై సి ఏం జగన్ ముఖ్యంగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ జిల్లా లను రెండు లేదా మూడు జిల్లా లుగా విభజించి మిగిలినవి భౌగోళిక పరంగా స్థానికుల అభిప్రాయం దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా కొత్త జిల్లాలు అనే ఆలోచనలోనే కొత్తగా పుట్టుకొస్తున్న వివాదాలు సమస్యలపై వైఎస్ జగన్మోహన రెడ్డి ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024