Silk Smitha: విజయలక్ష్మి వడ్లపాటి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ సిల్క్ స్మిత అంటే మాత్రం తెలియని వారు ఉండరు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన సిల్క్ స్మితకు 15 ఏళ్లకే తల్లిదండ్రులు వివాహం చేశారు. అత్తింటి వేధింపులు భరించలేక పెళ్లి జరిగిన కొంత కాలానికి సిల్క్ స్మిత మద్రాసు పారిపోయింది. సినీ ఇండస్ట్రీలోకి వెళ్లి హీరోయిన్ కావాలని ఆశపడింది. ఎన్నో కష్టాలు, అవమానాలు, తిరస్కరణల అనంతరం సిల్క్ టచప్ ఆర్టిస్ట్‌గా కొన్నాళ్లు పనిచేసింది. ఆ తర్వాత చిన్న, చిన్న పాత్రలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
80వ దశకంలో వెండితెరపై శృంగార తారగా సిల్క్ స్మిత ఓ వెలుగు వెలిగింది. మత్తెక్కించే కళ్ళు, మైమరిపించే అందంతో సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది. తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన సిల్క్ స్మిత.. ఆ తరువాత తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో 450 కి పైగా చిత్రాల్లో నటించింది మరియు నర్తించింది. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. అగ్ర హీరోలు సైతం తన డేట్స్ కోసం ఎదురు చూసేలా చేసింది. ఒకానొక సమయంలో స్టార్ హీరో హీరోయిన్లను మించి రెమ్యునరేషన్ తీసుకుని లేడీ సూపర్ స్టార్‌గా అవతరించింది.
అప్పట్లో ప్రతి సినిమాలో సిల్క్ స్మిత చేత స్పెషల్ సాంగ్ చేయించేవారు. అసలు సిల్క్ లేకపోతే సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్ సైతం ముందుకు వచ్చేవారు కాదు. ఆ రేంజ్ లో సిల్క్ స్మిత క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో సిల్క్ స్మితకు అభిమానుల కన్నా ఆమెను ఆరాధించే భక్తులు ఎక్కువగా ఉండేవారు. కేవలం సిల్క్ స్మితను చూడటం కోసమే థియేటర్స్ కు వచ్చేవారు. అటువంటి సిల్క్ స్మిత 36 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రేమించిన వాడు మోసం చేయడం, కుటుంబ సభ్యులు అండగా లేకపోవడం, ఒంటరితనం బాధించడంతో ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించింది. సిల్క్ స్మిత చనిపోయి దాదాపు రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఆమె గురించి ఏదో ఒక విషయం తెరపైకి వస్తూనే ఉంది.
అయితే ఒకప్పుడు సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ వేలంపాటలో అమ్ముడైందన్న మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే. 1984 లో ఒక సినిమా షూటింగ్ లో బిజీ ఉన్న సిల్క్ స్మిత విరామ సమయంలో ఒక యాపిల్ తినబోయింది. సగం కొరికి తింటూ ఉండగా షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట. దాంతో సిల్క్ యాపిల్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అది గమనించిన సిల్క్ స్మిత మేకప్ మ్యాన్ అక్కడికక్కడే ఆ యాపిల్ ను తీసుకుని వేలం వేశాడు. సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ వేలంపాటలో ఏకంగా ఓ వ్యక్తి రూ. 26 వేలకు కొనుక్కున్నాడట. 80వ దశకంలో రూ. 26 వేలంటే మామూలు విషయం కాదు. అందువల్ల ఈ విషయం అప్పట్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఏదేమైనా సిల్క్ స్మిత క్రేజ్ కు ఇదొక నిదర్శనం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More
Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ… Read More
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More