ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికల గురించి.. దేశ విదేశాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబా బు కేంద్రంగా కూటమి.. జగన్ వంటరిగా.. ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా హోరెత్తి పోతోంది. ఇక, ఎవరు గెలుస్తారు? ఎవరు గట్టెక్కుతారు? అనేది మాత్రం ఆసక్తిగానే మారింది. ఎవరూ ఎటు వైపు ఉన్నట్టుగా స్పష్టంగా లెక్కలు రావడం లేదు. సూపర్ సిక్స్‌తో ఉచితాలు దంచి కొడతామని.. చంద్రబాబు చెబుతున్నారు. ఉన్నదేదో అమలు చేస్తామని జగన్ అంటున్నారు.
ఇంకా పూర్తిస్థాయి మేనిఫెస్టోలపై క్లారిటీ రాలేదు. ఇక, అభ్యర్థుల బలాబలాలు చూస్తే.. చాలా వరకు ఇరు పక్షాల నుంచి అంటే.. కూటమి అభ్యర్థులు.. వైసీపీ అభ్యర్థులు కూడా.. ఆర్థికంగా బలంగానే ఉన్నారు. కానీ, ప్రజల్లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అదే స్తబ్దత కొనసాగుతోంది. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి వరకు చేసిన అనేక సర్వేల్లో వైసీపీ వర్సెస్ కూటమి మధ్య కేవలం 5 శాతం ఓటు బ్యాంకు తేడా కనిపిస్తోంది.
వీరిలోనూ తటస్థులు ఎక్కువగా ఉన్నారు. దీంతో వీరి ఓటు ఎటు పడితే.. వారే విన్నవుతారు. ఈ క్రమంలో వీరి నాడిని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నా.. ఇప్పటి వరకు.. వారు ఎటువైపు మొగ్గు చూపుతారనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఫలితంగా .. రాష్ట్రంలో జనాలు ఎటు మొగ్గుతున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నియోజకవర్గాల్లోనూ దాదాపు 52 నియోజకవర్గాల్లో పలితం దోబూచులాడుతోంది.
ఇక్కడి ప్రజలు తాము ఎటు మొగ్గుచూపుతామనే విషయంలో ఇంకా డిసైడ్ చేసుకోలేదు. వాస్తవానికి సంస్థాగతంగా ఉన్న ఓటు బ్యాంకు ఇరు పక్షాలకు ఉన్నా.. ఎన్నికలను డిసైడ్ చేసే మహిళా ఓటర్లు గుండుగుత్తగా వైసీపీకి ఉన్నారని. ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ తర్వాత.. ఇది కూడా మారుతున్నట్టు అంచనాలు వస్తున్నాయి. దీంతో ఎన్నికల వేళ ఎలాంటి ఫలితం వస్తుందనేది పార్టీలకు పరిశీలకులకూడా అంతుచిక్కని వ్యవహారంగా మారిందనే చెప్పాలి.
May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More
YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More
Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్‌బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More