KCR: బీఆర్ఎస్ అధేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మూడు నెలల విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజా ప్రతినిధులతో మాట్లాడిన కేసిఆర్ .. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై సమీక్షించారు.
అనంతరం కేసిఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ కు ముఖ్యమని అన్నారు. కృష్ణాబోర్డు(కేఆర్ఎంబీ) పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. చివరకు డ్యామ్ కు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. బీఆర్ఎస్ కు పోరాటం చేయడం కొత్త కాదని అన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించవద్దనే తమ పోరాటం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివిలేదని విమర్శించారు.
ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు. నల్లొండ జిల్లాలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేస్తామన్నారు. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ఎంతకైనా పోరాడుతామన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని మరో ప్రజా ఉద్యమంతో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుతామని అన్నారు కేసిఆర్.
ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు కేసిఆర్. ‘నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు. నన్ను .. నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు.. నీ కంటే హెమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది. . రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపుడుకున్నం.. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు.. తెలంగాణ కోసం కేసిఆర్ ఏనాడూ వెనక్కు పోడు.. ఉడుత బెదిరింపులకు భయపడను.. ముందు ముందు ఏంతో చూద్దాం.. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు కేసిఆర్.
AP Elections: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి సెలవుపై వెళ్లారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు,… Read More
YS Sharmila: ఏలూరు జిల్లాలో ఏడో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.… Read More
ఇల్లుకాలిపోయి.. ఒకళ్లు ఏడుస్తుంటే.. మరొకరు.. చుట్టకి నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసిట్టుగా ఉంది.. మాచర్ల పరిస్థితి. ఒకవైపు...ఇక్కడ అల్లర్లు జరిగాయి.… Read More
వచ్చే ఎన్నికల ఫలితం.. ఎలా ఉన్నా.. సాధారణంగా ప్రజల్లో ఉన్న ఆసక్తి వేరుగా ఉంటుంది. ఎవరు గెలు స్తారు? ఎవరు… Read More
ఔను.. వైసీపీ నాయకులు జగన్ను నమ్మడం లేదా? పార్టీ బాస్ చెప్పిన విషయంపైనే వారికి ఆశలు లేవా? ఇదీ.. ఇప్పుడు… Read More
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యం వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత… Read More
Cyclone Remal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుఫాను గా మారే అవకాశం ఉందని విశాఖ… Read More
Manam Movie: పదేళ్ల కిందట అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.… Read More
X Movie Review: ఓటిటిలోకి అనేక సినిమాలు వచ్చి పడుతున్నాయి. మరీ ముఖ్యంగా క్రైమ్, హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఓటిటి… Read More
Prodapt, the largest and fastest growing specialized company focused on the Connectedness industry, has announced… Read More
Punarnavi: ఉయ్యాల జంపాల సినిమాతో పలువురు కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రాజ్ తరుణ్, అవికా గోడ్ హీరో… Read More
Keerthi Bhat: సీరియల్ నాటిగా మంచి గుర్తింపును సంపాదించుకునే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన బ్యూటీ కీర్తి. తెలుగులో… Read More
Biggest Flop Movie: ప్రస్తుతం అంటే ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ అంటే 1000 కోట్ల వరకు ఉంది.… Read More
Tollywood Actress: నాలుగు పదుల వయసులోనూ తన అందాలతో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు చిత్రంతో ఆమె… Read More
Laapataa Ladies: కంటెంట్ ఉంటే పెద్ద పెద్ద స్టార్లే నటించాల్సిన పని లేదు. ప్రమోషన్స్ అవసరం లేదు. కేవలం మౌత్… Read More