Categories: వ్యాఖ్య

నా కలల కాశ్మీరం!

Published by
Siva Prasad

కాశ్మీరంటే నాకు అమితానందం. ఆ పేరు వింటే చాలు అక్కడి చినార్ చెట్లు నాలోంచి బయటకొచ్చి పొడవాటి నీడల్లా నా ముందే పరచుకుంటాయి. పైన్ చెట్లు నన్ను పిలుస్తున్నట్టు నిటారుగా నిలబడి మబ్బుల ఆకాశాన్ని నా మీదకు పలకరింపుగా వొంపుతుంటాయి. తులిప్ పూలు నా కళ్ళను తాకి నా కలలను పలకరిస్తుంటాయి. దాల్ లేక్‌లో నా ఊహలు షికారాలెక్కి షికార్లు కొడుతుంటాయి.

కానీ ఈ మధ్య కాశ్మీర్ గుర్తుకొచ్చినప్పుడు నాకు భయం కూడా వెన్నుపూసలో జర్రున పాకుతుంటుంది. ఆ ఆందాల లోయ నుంచి భయంకర శబ్దాలేవో వినిపిస్తూ వుంటాయి. ఆ భూతల స్వర్గంలో భూతాలేవో సంచరిస్తున్నట్టు ఒకటే పీడకలలు పీడిస్తూ వుంటాయి. ఏ జవాను ప్రాణం గాల్లో కలిసి పోతుందో..ఏ యువకుడు అర్ధాంతరంగా అంతర్థానమవుతాడో..ఏ పిల్లల మొహాలు పెల్లెట్ల గాయాలతో ఛిద్రమవుతాయో.. ఏ వీధి ఉన్నట్టు నిర్మానుష్యమవుతుందో..ఏ గల్లీ అకస్మాత్తుగా జనసమూహాల హాహాకారాలతో దద్దరిల్లిపోతుందో..ఎక్కడ బాంబులు మోగుతాయో..ఎక్కడ తూటాలు పేలుతాయో.. ఇనప టోపీల మీద ఎక్కడ రాళ్ళ వాన కురుస్తుందో.. మిలటరీ బూట్ల చప్పుళ్ళకు భయపడి పక్షలన్నీ ఎటు పారిపోతాయో..సైరన్ మోతలు మోయలేక నింగిని తాకే చెట్లు మొహాలెక్కడ వేళ్ళాడ వేస్తాయో..ఎక్కడ నేల బద్దలవుతుందో..ఎక్కడ ఆకాశం కుప్ప కూలుతుందో అంతా అయోమయం.

పుల్వామా దాడి తర్వాత నాకు ఇవే ఆలోచనలు.ఇవే భయాలు. ఇవే కలలు. అన్నింటినీ మించి ఒకటే ప్రశ్నలు. అక్కడ జరిగేది యుద్ధమా? అల్లర్లా? దాడులా? స్వతంత్ర పోరాటమా? టెర్రరిస్టులకూ సైనికులకూ మధ్య సంఘర్షణా? ఎవరిని అడగాలో తెలీక పుల్వామా పుల్వామా అని పలవరిస్తున్నాను. దాడి చేసింది ఎవరు? ఇరవయ్యొక్క సంవత్సరాల నూనూగు మీసాల యువకుడు. అతనెక్కడి నుంచి వచ్చాడు? కశ్మీరు నుంచే వచ్చాడు. నవయవ్వనంలో ఎవరైనా ఏం కలలు కంటారు? ఇతనెందుకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించాడు? కాశ్మీరు కోసం కాశ్మీరీ  యువకుడే కాశ్మీరులోనే ఎందుకింత అల్లకల్లోలం సృష్టించాడు? అసలు వందల మంది సీఆర్పీయఫ్ జవాన్లు నడిచే కాన్వాయ్‌కి ఎదురుగా ఒక చిన్నపాటి కారులో ఈ యువకుడు అంత యధేచ్ఛగా దూసుకుంటూ వెళ్ళి దాడి ఎలా చేయగలిగాడు? ఒక మామూలు మంత్రికే వెళ్ళే దారిలో సెక్యూరిటీ రెక్కీలు నిర్వహిస్తారు కదా? ఇంతమంది జవాన్లు వెళుతున్న మార్గంలో ఎందుకు సెక్యూరిటీ ఏర్పాట్లు బలంగా జరగలేదు? పుల్వామా చెప్పమ్మా అని నాలో నేనే అడుగుతుంటాను. బయటి దేశం నుంచి మిలిటెంట్లు పుట్టడం లేదు. మిలటరీలో చేరే యువకుల కంటె..కొత్త ఉద్యోగాల్లో చేరే యువకుల కంటె..వివాహాలకు అలంకరించుకునే యువకుల కంటె కాశ్మీరులో  మిలిటెంట్లుగా మారుతున్న యువకులే ఎక్కువ అని లెక్కలు చెప్తున్నాయి.  ఎందుకిలా? పుల్వామా జవాబివ్వగలవా? గత 20 ఏళ్ళలో ఎనిమిది వేల మంది  కాశ్మీరీ యువకులు అదృశ్యమయ్యారని వివరాలు వెక్కిరిస్తున్నాయి. వాళ్ళంతా ఏమయ్యారు? ఊరూ పేరూ లేని సమాధులు వేలాదిగా కాశ్మీరు నిండా విస్తరిస్తున్నాయట. వాటి మీద తలబాదుకుంటున్న కాలాన్ని ఎవరు ఓదారుస్తారు? ఉన్నట్టుండి వార్తలొస్తాయి. ఎన్ కౌంటర్ జరిగినట్టు నలుగురో అయిదుగురో..పదిమందో పాతికో మిలిటెంట్లు హతం. ఎవరు వాళ్లంతా గ్రామాలకు గ్రామాలే వాళ్ళను గుర్తుపట్టడానికి కుంటుకుంటూ ముక్కుకుంటూ మూలుగుతూ వెళతాయి. హహాకారాలు మిన్నంటుతాయి. శవయాత్రలు ప్రారంభం. ఆ అంతిమ యాత్రలు అంతిమంగా రెండు వర్గాల మధ్య యుద్ధంగా మారతాయి. కొందరికి పిల్లెట్లు శరీరాలను తూట్లు పొడుస్తాయి. కొందరిని బుల్లెట్లు పరామర్శిస్తాయి. చెల్లాచెదురైన సమూహాలను చూసి కాశ్మీరు లోయ కడుపు నిండా కన్నీరు నింపుకుంటుంది. తెల్లారితేనే వార్త ఎవరో యువకుడు మాయమైనట్టు. మిలిటెంట్ అయ్యాడా? మిలటరీకి చిక్కాడా? జవాబు దొరకదు.

ఎందుకిదంతా? ఎవరి మీద ఎవరు యుద్ధం చేస్తున్నారు?ఒకే మట్టిలో పుట్టిన అన్నదమ్ములే ఆగర్భ శత్రువులుగా ఎందుకు మారిపోతున్నారు? మా ఖర్మకు మమ్మల్ని వదిలేయండి. అంటూ అటు పాకిస్తాన్‌ని, ఇటు హిందుస్తాన్‌ని రెండు చేతులెత్తి వేడుకుంటున్న కాశ్మీరీ సగటు గుండె చప్పుడు వినలేమా?  ఎటు చూసినా కళ్ళకు పచ్చదనం అంటాల్సిన చోట నెత్తురు మరకలే ఎందుకు అడ్డు తగులుతున్నాయి? అర్థం చేసుకోలేమా?  తుపాకులతో తూటాలతో స్వేచ్ఛా స్వాతంత్ర్య కాంక్షా జ్వాలల్ని ఆర్పలేమని చరిత్ర చెప్పడం లేదా? ఆఫ్ఘనిస్తాన్ కొరివితో తలగోక్కున్న పాపానికి పశ్చాత్తాపంతో తలంటుపోసుకుంటున్న అమెరికా రష్యా లాంటి అగ్రరాజ్యాలను చూసి ఏమీ తెలుసుకోలేమా?ఇలాగే ఈ యుద్ధం కాని యుద్ధం కొనసాగుతూనే వుండాలా? పుల్వామా చెప్పవే తల్లీ చెప్పు. ఇలాగే కొనసాగితే కడాఖరుకి కాశ్మీరీ గ్రామాలు పిల్లలూ ముసలివాళ్లూ ఆడవాళ్ళే తప్ప యువకులు లేని జవసత్వాలు లేని అవిటివైపోవా? చివరకు నిర్మానుష్యమైన ఆ భూతల స్వర్గం దేవతల బదులు సైనికులతో నిండిపోతుందేమో. ప్రముఖ హిందీ కవి గుల్జార్ కాశ్మీరు లోయ మీద రాసిన కవిత గుర్తుకొస్తోంది:

‘’ ముందుగా ఎవరు తల పైకెత్తుతారో ఆ తల తెగిపడుతుందన్న భయంతో సంకోచంగా చెట్లు పెరుగుతున్నాయి.

మెడలు వాల్చి నిర్బలంగా మబ్బులు తిరుగాడుతున్నాయి. నెత్తుటి మరకల్ని కడిగే శక్తి తమకు లేదని వాటికి తెలుసు- బుల్లెట్ల వానలో తడిసిన నేల ఇంకా పచ్చిగానే వుంది. వస్తూ పోతూ వుండే వలస పక్షులు  గాయపడ్డ గాలిని చూసి బెంబేలుపడి వచ్చిన దారినే ఎగిరిపోతున్నాయి.”

ఏమిటిదంతా? ఎవరికోసం? ఏ స్మశాన సౌందర్యంతో ఏ సార్వభౌమత్వం పండగ చేసుకుంటుంది? అసలే ఎన్నికల కాలం. నెత్తుటి కాశ్మీరు గుమ్మానికి ఏ రాజకీయ తోరణాలు వేలాడతాయో తెలీదు. ఏ బ్యాలెట్ పేపర్ మీద ఎవరి ఆత్మ ఏ గుర్తులో మెరుస్తుందో తెలీదు.  పుల్వామా ఘటన తర్వాత నేనిలా రాసుకున్నాను.

                 “ నాలో ఒక లోయ వుంది.  అది ఆకుపచ్చని స్వర్గం. / అక్కడ చెట్టు చెట్టునా పూచిన  ఆకు ఆకుపైనా పక్షులు  పాటలు రాస్తాయి/ నేనెంత ప్రేమిస్తాను వాటిని..! ప్రేమ కాదు..స్వేచ్ఛ కావాలంటాయి. / నాలో వుంటూ నన్నే ధిక్కరిస్తాయి /నా సార్వభౌమాధికారాన్నే వెక్కిరిస్తాయి- /నాలోంచి మొలిచిన చెట్ల చుట్టూ నాలోంచి పెరిగిన పిట్టల చుట్టూ తుపాకులతో నిషిద్ధ రేఖలు గీశాను  /నా లోయ ఇప్పుడు నెత్తురు కక్కుతోంది/ గరికపోచల మీదా..మంచు పెళ్ళల మీదా నా పేగుల్లో కవాతు చేసిన విహంగాల రెక్కల ముద్రలు- /నాలో నిరంతర రుధిర వర్షం/ నాలో లోయ వుంది..నాలో యుద్ధం వుంది . ఇప్పుడు యుద్ధమే స్వర్గం.

నేను గెలిచానో..ఓడానో

నా స్వర్గం నిండా విస్తరిస్తున్న అనామక సమాధుల మీద

నా విజయ దుందుభుల విషాద ప్రభలు “

ప్రసాదమూర్తి

8499866699

Siva Prasad

Share
Published by
Siva Prasad

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024