ఇద్దరు సీఎంలపై బీజేపీకి కోపం..! బండి సంజయ్ అలా.., సోము ఇలా..!!

Published by
sharma somaraju

ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్మోహన రెడ్డిల వ్యవహార శైలి కొన్ని విషయాల్లో భిన్నంగా, కొన్ని విషయాల్లో సారూప్యంగా ఉంటాయి. సంక్షేమ పథకాల అమలులో ఎవరి స్టైల్ వారిదే. ప్రభుత్వంలో ఆర్ టి సి విలీనం చేయడం మంచి నిర్ణయం కాదన్నది కెసిఆర్ అభిప్రాయం కాగా ఆంధ్ర ప్రదేశ్ లో సిఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. అయితే ప్రధాన ప్రతిపక్షాలను దెబ్బ తీసే విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని కెసిఆర్ చావు దెబ్బ తీయగా, ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్షం హోదా తొలగించే పనిలో జగన్ ఉన్నారు. ఎన్ డీఏ లో లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదితో ఇద్దరు సిఎం లు కేసీఆర్, జగన్ ఘర్షణ పూరితంగా, దూరంగా    అయితే లేరు. వివిధ అంశాలలో కేంద్రానికి అటు కెసిఆర్, ఇటు జగన్ మద్దతు ఇస్తూనే ఉన్నారు. విషయం లోకి వెళితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వినాయక చవితి వేడుకల నిర్వహణకు ఆంక్షలు విధించడం హింధూత్వ అజండా మోస్తున్న బిజేపి నేతలకు ఆగ్రహం కల్గిస్తోంది.

Kcr, jagan

 

వివాహాలు, ఇతర వేడుకలకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చిన మాదిరిగానే వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వాలని అటు తెలంగాణలో బిజెపి చీఫ్ బండి సంజయ్, ఇటు ఆంధ్రాలో బిజెపి చీఫ్ సోము వీర్రాజులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా అటు కెసిఆర్ గానీ ఇటు జగన్ గానీ పట్టించుకోలేదు. దీనితో కమల దళాలు అటు కెసిఆర్ సర్కార్ పై, ఇటు జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపిలో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి వారం రోజుల నుండి చేసిన ట్వీట్ లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ వినాయక చవితి మండపాలు ఏర్పాటుకు అవకాశఁ కల్పించాలని బిజెపి నేతలు అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో విజ్ఞప్తి చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వినాయక చవితి వేడుకలు సంబంధంచి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు, పూజలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా ప్రవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా విగ్రహం ఎత్తు రెండు అడుగులు మించి ఉండకూడదని పేర్కొన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన రోజునే నిమజ్జనం చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే బిజెపి నేతలు మాత్రం ఈ నిర్ణయాలను తప్పుబడు తున్నారు. ముస్లింల మోహరం పండుగకు ఇచ్చినవెసులు బాటు హింధువుల పండుగకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మద్యం షాపులకు లేని ఆంక్షలు వినాయక చవితి వేడుకలకు ఎందుకని విష్ణఉవర్థన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరో తెలంగాణలో అయితే అక్కడి బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయంలో ప్రభుత్వంపై గొడవ పడటానికే సిద్ధం అయ్యారు. వినాయక చవితి మండపాల నిర్వహణకు పోలీసులు అడ్డుకుంటేసహించేది లేదని బండి హెచ్చరించారు. నిమిజ్జన వేడుకలకు ఇబ్బందులు సృష్టిస్తే కేసిఆర్ ఇంటి ముందే విగ్రహాల నిమజ్జనం చేస్తామని కూడా హెచ్చరించారు బండి సంజయ్.

సాధారణంగా దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. పట్టణం, నగరం, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వాడవాడలా చలువ పందిళ్లు వేసి ఆకర్షనీయమైన వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. హింధువుల అతి పెద్ద పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఇప్పటి వరకూ వినాయక చవితి వేడుకలను ప్రభుత్వాలు అడ్డుకున్న సందర్భాలు ఇంత వరకూ లేదు. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు వినాయక వేడుకలపై ఆంక్షలను విధించింది. గణేష్ నవరాత్రి వేడుకలను నిర్వహించాలన్న పట్టుదలతో బిజెపి ఉంది. సెంటిమెంట్ తో ముడిపడిన ఈ అంశంలో వ్యవహారం ఎటు దారితీస్తుందోే వేచి చూడాలి.

This post was last modified on August 21, 2020 10:15 pm

sharma somaraju

Recent Posts

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024