బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తదితరులు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
కెమెరా: సుజిత్ సారంగ్
ఎడిటింగ్, డి.ఐ: శ్రీజిత్ సారంగ్
డైలాగ్స్: జె కృష్ణ
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు
సాహిత్యం: చైతన్య ప్రసాద్, రహమాన్, కృష్ణకాంత్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ
సెన్సార్: యు/ఎ
వ్యవథి: 169.57 నిమిషాలు
కలలు కనడం కంటే వాటిని సాధించుకోవడం కోసం చేసే పోరాటం గొప్పది.. పోరాటంలో మనకు తోడుగా నిలిచేవాడిని కామేడ్ర్ అంటాం. అలాంటి ఓ కామ్రేడ్ కథే `డియర్ కామ్రేడ్`. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న విజయ్‌దేవరకొండ, రష్మిక జోడిగా నటించిన రెండో చిత్రమిది. ఓ కాలేజ్ యూత్ లీడర్, లిల్లీ అనే లేడీ క్రికెటర్ల ప్రయాణమే ఈ చిత్రం. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో విజయ్ దేరవకొండ చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలించింది? సక్సెస్ అయ్యిందా? లేదా? అని తెలుసుకోవాలంటే డియర్ కామ్రేడ్ కథేంటో తెలుసుకోవాల్సిందే
కథ:
చైతన్య అలియాస్ బాబీ(విజయ్ దేవరకొండ) వైజాగ్‌లో కాలేజ్ స్టూడెంట్. మార్కిస్ట్ భావాలుండే యువకుడు. కోపం ఎక్కువ కావడంతో గొడవలు పడుతుంటాడు. హైదరాబాద్ నుండి పెళ్లి చూడటానికి వచ్చిన అపర్ణా దేవి అలియాస్ లిల్లీ(రష్మిక మందన్న)తో ప్రేమలో పడతాడు. ఆమెను కూడా తన పరేమలో పడేలా చేసుకుంటాడు. అప్పటికే అన్నయ్య కాలేజ్ గొడవల్లో చనిపోయి ఉండటంతో లిల్లీకి గొడవలంటే భయం. ఆ కారణంగా, బాబీకి కూడా గొడవలు పడొద్దని చెబుతుంది. అయితే ఆమె మాటలను లెక్క చేయకుండా మళ్లీ గొడవ పడతాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో లిల్లీ బాబీకి కనపడకుండా వెళ్లిపోతుంది. లవర్ కనపడకపోవడంతో, బాబీ ఏం చేయాలో అర్థం కాక పిచ్చోడిలా మారుతాడు. ఇక తాతయ్య(చారుహాసన్) ఇచ్చిన సలహాతో ఇండియా టూర్ వెళతాడు. క్రమంగా తనలో మార్పు వస్తుంది. అనుకోకుండా హైదరాబాద్‌లో లిల్లీని కలుస్తాడు. ఆమె మానసిక పరిస్థితి బావుండదు. అప్పుడు బాబీ ఏం చేస్తాడు? లిల్లీకి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
నటీనటులు పరంగా కాలేజ్ స్టూడెంట్, లవర్బోయగా, ప్రేమ కోసం, ప్రేయసి కోసం తాపత్రయ పడే యువకుడిగా విజయ్‌దేవరకొండ పెర్ఫామెన్స్ ఔట్ స్టాండింగ్‌గా ఉంది. డిఫరెంట్ షేడ్స్‌ను తను క్యారీ చేసిన తీరు బావుంది. ఇక రష్మిక లేడీ క్రికెటర్‌గా కనపడటానికి బాగానే కష్టపడిందని మనకు అర్థమవుతుంది. చాలా ఈజ్‌తో చేసింది. అయితే సినిమాలో ప్రధాన సమస్య దర్శకుడిదే. ఎందుకంటే మంచి పాయింట్‌ను ఎంచుకున్న డైరెక్టర్ భరత్ కమ్మ సన్నివేశాలను గ్రిప్పింగ్‌గా రాసుకోలేకపోయాడు. ప్రస్తుత సమాజానికి రిలేటెడ్‌గా ఉండే సమస్యను ఓ ఎమోషనల్ వేలో తీసుకెళ్లడంలో దర్శకుడు డ్రాప్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా గొడవలు, రెండు, మూడు ప్రేమ సన్నివేశాలు.. ఒకట్రెండు లిప్ లాక్లతోనే సరిపోయింది. ఇక సెకండాఫ్ అయితే మరి డ్రాగింగ్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కథే ఉండదు. ప్రీ క్లైమాక్స్ నుండి అసలు కథను దర్శకుడు ఎలివేట్ చేశాడు. అయితే క్లైమాక్స్ సన్నివేశం అంత అద్భుతంగా వర్కవుట్ కాలేదు. ఇన్టెన్సిటీ తగ్గిపోయింది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే, మూడు పాటలు బావున్నాయి. సుజిత్ సారంగ్ కెమెరా వర్క్ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: డియర్ కామ్రేడ్ …నిరాశ పరిచాడు
రేటింగ్ :2/5
This post was last modified on July 26, 2019 3:57 pm
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More
Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ… Read More
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More
Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More