Categories: Telugu TV Serials

హిమ చేసిన పనికి జ్వాల మనసు కరుగుతుందా..?లేక అగ్నిగొళంలా మండుతుందా..??

Published by
Deepak Rajula

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో జ్వాల హిమని బయటికి గెంటేసి తలుపు వేస్తుంది. ఆ తర్వాత హిమ ఎన్ని సార్లు తలుపు కొట్టినా జ్వాల తలుపు తియ్యదు.సీన్ కట్ చేస్తే జ్వాల.. చంద్రమ్మ ఒడిలో పడుకుని జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఆ పక్కనే కూర్చుని ఉన్న ఇంద్రడు అమ్మా.. జ్వాల అని పిలిచి వెంటనే ఆగిపోయి ఇప్పుడు నిన్ను ఎలా పిలవాలమ్మా? జ్వాల అనా లేక?’ అంటూ ఆగుతాడు.

ఇక నుండి జ్వాలను ఏమని పిలవాలి..?

వెంటనే పైకి లేచిన సౌర్య నన్ను ‘జ్వాల అని పిలువు బాబాయ్.. నేను ఎప్పటికీ మీ జ్వాలనే అంటుంది.‘అది కాదురా.. ఇంతకాలం పేదరికంలోనే పెరిగావ్ కానీ ఇప్పుడు నువ్వు గొప్పింటి బిడ్డవని తెలిసింది. ఇప్పుడైనా ఆ ఇంటికి వెళ్తే గొప్పగా ఉండొచ్చు కదమ్మా’ అంటుంది చంద్రమ్మ ప్రేమగా..ఏంటి పిన్ని మీరు కూడా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? నేను ఎవరినో తెలియకుండానే నన్ను చేరదీసి ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మీరు వెళ్లమన్నాసరే నేను వెళ్లను.. మీతోనే ఉంటాను అని అంటుంది.

హిమను ఎలా అయినా బతికించుకుంటాను అంటున్న నిరూపమ్ :

సీన్ కట్ చేస్తే నిరుపమ్ స్వప్న దగ్గరకు వచ్చి మమ్మీ మా పెళ్లి బాగా జరగాలి అంటూ ఎంతో సంబరపడిపోతూ అంటాడు.స్వప్న కాస్త అసహనంతో కోపంగా చూస్తుంది. ‘ఏంటి మమ్మీ హిమకి ఏదైనా అవుతుందని బాధపడుతున్నావా?ఏమి కాదు అలా హిమకి పెద్ద ట్రీట్మెంట్ ఇప్పించి ఎలాగైనా కాపాడుకుంటాను.తనంటే నాకు చాలా ప్రేమ మమ్మీ అనేసి వెళ్లిపోతాడు. దాంతో స్వప్నలో భయం మొదలై నిజంగానే హిమకు ఏం కాకుంటే జీవితాంతం నా కోడలుగా ఉంటుంది.ఆమ్మో అలా జరగకుండా ఏదొకటి చెయ్యాలి అని అనుకుంటుంది.

హిమ కోసం తాతయ్య -నానమ్మ ఎదురుచూపులు :

మరోవైపు ఆనందరావుకి టాబ్లెట్స్ తెచ్చి ఇస్తుంది సౌందర్య. ‘వర్షం వస్తోంది.. హిమ ఇంకా ఇంటికి రాలేదు చాలా లేట్ అయ్యింది కదా ఒకసారి ఫోన్ చెయ్యాల్సింది’ అంటాడు ఆనందరావు. ‘చేస్తూనే ఉన్నానండి.. స్విచ్ ఆఫ్ వస్తోంది అంటుంది సౌందర్య.సీన్ కట్ చేస్తే జ్వాల మనసేం బాలేదు కాసేపు అలా బయటికి వెళ్లి వస్తాను అని పిన్నికి చెప్పి బయటకి వస్తుంది.తలుపు తీసేసరికి హిమ వర్షంలో తడిసి వణుకుతూ నిలబడి ఉంటుంది.హిమను చూసిన జ్వాల ఏంటి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా?’అంటుంది.అవును అంటుంది హిమ.ఇలా చేస్తే జాలి పడిపోతానని అనుకుంటున్నావా?’ అని అరుస్తుంది జ్వాల.

వర్షంలో తడుస్తూ జ్వాల ఇంటిముందు ఉన్న హిమ :

హిమ చలికి వణికిపోతు ప్లీజ్ సౌర్యా లోపలికి వెళ్లి కూర్చుందాం.చాలా చలి పెడుతుంది అంటుంది.. ప్లీజ్ నా మీద కోపం పోవాలంటే నేనేం చెయ్యాలో చెప్పు’ అంటుంది.నీతో నాకు మాటలేంటీ? పదా మీ ఇంటి దగ్గర దించేస్తా అంటూ హిమని కారు దగ్గరకు తీసుకుని వెళ్తుంది. హిమ చేతిలోంచి కారు తాళం తీసుకుని డోర్ ఓపెన్ చేసి మీ ఇల్లు ఎక్కడో చెప్పు దింపేసి వస్తాను’ అంటుంది సౌర్య. హిమ కూర్చోకుండా అలానే నిలబడుతుంటే ‘కూర్చుంటావా లేక నా పద్దతిలో కూర్చోబెట్టనా అని జ్వాల అంటే వెంటనే హిమ వణుకుతూ వెళ్లి డ్రైవర్ సీట్ పక్కనే కూర్చుంటుంది. జ్వాల డ్రైవర్ సీట్లో కూర్చుని చూడు నీ ఇంటి ‘అడ్రస్ మాత్రమే చెప్పు.. ఇంకేం మాట్లాడినా కారు ఆపి నేను వెళ్లిపోతాను అంటుంది.

శోభకు అసలు విషయం చెప్పిన స్వప్న :

సీన్ కట్ చేస్తే స్వప్న,శోభ ఒకచోట కలుస్తారు. నిరూపమ్ అన్నా మాటలు శోభకు చెప్తుంది స్వప్న. ‘మీరు చెప్పింది వింటే నాకేం అర్థం కావట్లేదు.. నిరుపమ్ అలా ఎలా నమ్మకంగా ఉన్నాడు ఆంటీ?’ అంటుంది శోభ. ఏం చేసి అయినా హిమని బతికించుకుంటాను అంటున్నాడు అని అయోమయంతో చెబుతుంది స్వప్న. ‘బతికించుకోవడం ఏంటీ? అది బతుకుతుంది.. దానికి ఏ జబ్బులేదు.ఈ విషయం మీకు చెప్పలేను.పైగా దానికి క్యాన్సర్ లేదని చెబితే నిరుపమ్, హిమలు మరింత దగ్గర అయిపోతారు’ అని మనసులోనే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శోభ.

హిమ మాట విని సౌర్య ఇంట్లో అడుగు పెడుతుందా.?

ఇక సౌందర్య ఇంటి ముందు కారు ఆగుతుంది. హిమ, సౌర్యలు దిగుతారు. ‘నీ మీద జాలితోనో ప్రేమతోనో నిన్ను మీ ఇంటికి తీసుకుని రాలేదు. నా ఇంటి ముందు దిష్టిబొమ్మలా వర్షంలో నువ్వు నిలబడితే అది చూసి అందరూ నన్ను అడుగుతారు అందుకే తీసుకొచ్చాను అంటుంది జ్వాల. లోపలికి వెళ్ళు అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతున్న జ్వాలను వెంటనే హిమ సౌర్య చేతులు పట్టుకుని ఆపేస్తుంది హిమ‘నువ్వు లోపలికి రాలేదంటే నేను ఇక్కడే నిల్చుని తడుస్తూ ఉంటాను అంటుంది కోపంగా. ‘నిన్ను’ అని జ్వాల చేయి లేపుతుంది కొట్టడానికి వెంటనే ఆగిపోయి నువ్వుఏదైనా చేసుకో నన్ను బెదిరించకు అనేసి అక్కడ నుంచి జ్వాల వెళ్లిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More

May 19, 2024

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More

May 19, 2024

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

OTT:  ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More

May 19, 2024

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More

May 19, 2024

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More

May 19, 2024

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More

May 19, 2024

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More

May 19, 2024

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More

May 19, 2024

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024