అన్న కాంగ్రెస్ లో.. తమ్ముడు బీజేపీలో!

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి కుటుంబంలో చీలిక వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వెంకటస్వామి కుమారులు ఇద్దరు రాజకీయంగా చెరో దారిలో ఉన్నారు. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండే యత్నాలు చేసినా అనంతరం వేర్వేరు దారుల్లో వెళ్లారు. ప్రస్తుతం మాజీ ఎంపీ వివేక్ బిజెపిలో కొనసాగుతుండగా, ఆయన సోదరుడు మాజీ మంత్రి వినోద్ కాంగ్రెస్ లోకి తిరిగి ప్రవేశించారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ కుంతియా సమక్షంలో ఆయన శనివారం (జనవరి 11) కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వినోద్ సోదరుడు వివేక్ బీజేపీలో కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఈ సోదరులిద్దరికీ సరైన ఆదరణ లభించకపోవడంతో తిరిగి పార్టీ ఫిరాయించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి జి వినోద్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయాలని భావించిన వినోద్‌.. టికెట్‌ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ స్థానం నుంచి బాల్క సుమన్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో వినోద్‌ తీవ్ర నిరాశ చెందారు. బాల్క సుమన్‌పై రెబల్‌గా పోటీ చేసి ఓటమి చవిచూశారు.

కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలకనేతగా వెలుగొందారు వెంకటస్వామి. కాంగ్రెస్ కు నమ్మినబంటుగా సుదీర్ఘకాలం కొనసాగారు. తండ్రి బాటలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన అన్నదమ్ములు వినోద్, వివేక్.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్‌ ను వీడి.. తొలుత 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2014 మార్చి 31న బ్రదర్స్‌ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్, చెన్నూరు అసెంబ్లీకి వినోద్‌ పోటీచేసి ఓడిపోయారు. అనంతరం రాజకీయ పునరేకీకరణ పేరుతో టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్‌లో 2016లో మరోసారి వీరిద్దరు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వివేక్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా లభించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా సోదరులిద్దరికీ టిక్కెట్లు ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ మొండిచేయి చూపించింది. దీంతో వినోద్‌ ఒంటరిగా చెన్నూరు నుంచి పోటీ చేయగా.. వివేక్‌ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. ఇప్పుడు వినోద్‌ తిరిగి సొంతగూటికి చేరారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ముందు ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే పరిణామం ఇది. మాజీ పార్లమెంటు సభ్యుడు, వినోద్ సోదరుడు వివేక్ కూడా కాంగ్రెసులో పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినా ఆయన బిజెపిలోనే కొనసాగుతున్నారు. దీంతో ఎప్పుడూ ఒకే పార్టీలో కొనసాగిన అన్నదమ్ములిద్దరు ఇప్పుడు వేరువేరు పార్టీల్లో పనిచేయడానికి సిద్దమయ్యారు. దీంతో వెంకటస్వామి కుటుంబుంలో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో కాంగ్రెస్‌ పార్టీని వీడటం అపరిపక్వ నిర్ణయని, కొన్ని పొరపాట్ల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని వినోద్ అన్నారు. తనకు 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని, కాంగ్రెస్ తమ సొంత పార్టీ అని పేర్కొన్నారు. తన తండ్రి వెంకటస్వామి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని వినోద్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద అన్నదమ్ములిద్దరు వేర్వేరు దారుల్లో వెళ్లడం తెలంగాణలో చర్చనీయాంశమైంది.

దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామిగా తన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే గడిపారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా మరో వైపు చూడలేదు. కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకమైన నేతగా ఉన్నారు. అలాంటి గడ్డం వెంకటస్వామి మరణించిన తర్వాత ఆయన కుమారులు వేసే రాజకీయ తప్పటడుగులు వారి పొలిటికల్ లైఫ్ ను ఇబ్బంది పెట్టాయి. గడ్డం వెంకటస్వామి పెద్ద కుమారుడు వినోద్ గతంలో కాంగ్రెస్ లో ఉండగా మంత్రి పదవిని నిర్వహించారు. మరో కుమారుడు గడ్డం వివేక్ 2009 ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం పోరాడారు. మొత్తానికి ఇంతకాలం కలిసి సాగిన అన్నదమ్ముల రాజకీయ ప్రయాణం ఇప్పుడు వేరు అయ్యింది.

This post was last modified on January 12, 2020 2:33 pm

Mahesh

Recent Posts

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Web Series: బిల్ గేట్స్ తన పనుల్లో ఎంతో బిజీగా ఉంటాడు. అటువంటి మనిషే ఖాళీగా ఉన్న సమయంలో ఓటిటిలో… Read More

May 28, 2024

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Popular Pette Serial: తెలుగులో కామెడీ కథ అంశంతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాస్ ను తెరకెక్కించాడు దర్శకుడు జంధ్యాల.… Read More

May 28, 2024

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

36 Days Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సోనీ… Read More

May 28, 2024

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Aa Okkati Adakku OTT: అల్లరి నరేష్ హీరోగా నటించిన కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు మే మూడవ… Read More

May 28, 2024

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

YSRCP: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో సడలింపు నిబంధనలపై వైసీపీ అభ్యంతరం తెలియజేసింది. వైసీపీ నేతలు పేర్ని నాని, మేరుగు… Read More

May 28, 2024

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

Chiranjeevi: చలన చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు పెళ్లై… Read More

May 28, 2024

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

Praja Bhavan: హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కలకలాన్ని రేపింది. ప్రజా భవన్ లో బాంబు పెట్టినట్లు… Read More

May 28, 2024

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

Fahadh Faasil: మలయాళ ఇండ‌స్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఫహద్ ఫాసిల్ ఒక‌రు.… Read More

May 28, 2024

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

Varsham: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీరలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో వర్షం ఒకటి. ప్రభాస్ కు ఫస్ట్ బ్లాక్… Read More

May 28, 2024

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

Namitha: ఈమధ్య విడాకుల వార్తలు బాగా పెరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత సెట్ అవ్వక విడిపోవడం సెలబ్రిటీలకు… Read More

May 28, 2024

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Karthika Deepam 2 May 28th 2024: దీప ఒంటరిగా కూర్చుని ఉంటే సుమిత్ర వచ్చి పలకరిస్తుంది. ఒకరి లోపాన్ని,… Read More

May 28, 2024

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ నుంచి గత ఏడాది వచ్చిన చిత్రాల్లో `టైగర్ నాగేశ్వరరావు` ఒకటి. పీరియడ్ యాక్షన్… Read More

May 28, 2024

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

AP High Court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్… Read More

May 28, 2024

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. సినీ రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా దుబాయ్… Read More

May 28, 2024