బాగ్దాదీని వెంటాడిన జాగిలం ఇదే!

Published by
Mahesh

వాషింగ్టన్: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు, కరడు గట్టిన ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ హతం కావడంలో ఓ శునకం పాత్ర కూడా ఉంది. ఓవైపు అమెరికా దళాలు తమ తుపాకులు ఎక్కుపెట్టి వెంటాడుతుండగా..మరోవైపు ఆ దళాలతో బాటు ఆమెరికా సైన్యానికి చెందిన ఓ శునకం కూడా అతడి వెంటాడి.. వేటాడింది. దీంతో చేసేది లేక తన ముగ్గురు పిల్లలతో ఓ టన్నెల్ లోకి పారిపోయిన బాగ్దాదీ.. బిక్కచచ్చిపోయాడు. అటు సైనికులు, ఇటు సింహంలా దూసుకొస్తున్న ఈ జాగిలాన్ని చూసి భయపడిపోయిన బాగ్దాదీ.. తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో తమ దేశ కమెండోలకు ఎంతగానో సాయపడిన ఈ శునకం తాలూకు చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఐసిస్ అధినేత బాగ్దాదీని హతమార్చడంలో గొప్ప పాత్ర పోషించిన అద్భుతమైన ఈ జాగిలానికి సంబంధించిన చిత్రాన్ని బహిర్గతం చేస్తున్నాం.. అయితే దీని పేరు మాత్రం వెల్లడించలేం’ అని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే బాగ్దాదీ తనను తాను పేల్చేసుకుంటుండగా ఈ శునకం గాయపడింది. కానీ దాన్ని తిరిగి తెచ్చుకున్నామని, సురక్షితంగా ఉందని అయన తెలిపాడు. అమెరికా దళాలు విధుల్లో తమకు సాయంగా బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన శునకాలను వినియోగించుకుంటూ ఉంటాయి. 2011 లో ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన ఆపరేషన్ లో అమెరికా బలగాలు ‘ కైరో ‘ పేరుగల బెల్జియం మాలినోయిస్ జాతి కుక్కను ఉపయోగించుకున్నాయి. బాంబు పేలుడు వంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు కారకులైనవారి పట్టివేతకుఇలాంటి మేలుజాతి శునకాలను వినియోగిస్తుంటారు.

భయానకమైన టెరరిస్టు కార్యకలాపాలతో కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఐఎస్ఐఎస్ నేత అబూబకర్ ఆల్ బాగ్దాదీ మరణించాడని ఆదివారం అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రత్యేక దళాలు సిరియాలోని ఒక ప్రాంతంలో బాగ్దాదీ తలదాచుకున్న కాంపౌండ్‌పై దాడి చేశాయి. రెండు గంటల పాటు జరిగిన ఈ సైనికచర్యలో బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కాంపౌండ్‌లో ఉన్న భూగర్భ సొరంగంలో తలదాచుకున్న బాగ్దాదీ అమెరికా సైనిక జవాన్లకు పట్టుబడకుండా ఉండేందుకు ఆత్యహత్య చేసుకున్నాడు. తాను ధరించిన పేలుడు పదార్ధాలతో తయారు చేసిన జాకెట్‌ను పేల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతి చెందింది బాగ్దాదీయేనని తర్వాత డిఎన్‌ఎ పరీక్ష ద్వారా నిర్ధారించుకున్నారు. అతనితో పాటు అక్కడ ఉన్న ముగ్గురు పిల్లలు కూడా ఈ పేలుడులో చనిపోయారు. ఈ దాడి మొత్తాన్నీ తాను వైట్‌హౌస్‌నుంచి ప్రత్యక్షప్రసారం ద్వారా చూశానని ట్రంప్ చెప్పారు. బాగ్దాదీ కుక్కచావు చచ్చాడు ఇని ఆయన అన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో అమెరికా వైపున ప్రాణనష్టం లేదని ఆయన పేర్కొన్నారు.

 

This post was last modified on October 29, 2019 2:46 pm

Mahesh

Recent Posts

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

BrahmaMudi:మాయా కావాలని ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. సుభాషిని బెదిరించి మీరు నన్ను ఎప్పటికీ ఏమీ చేయలేరు అని నా గురించి… Read More

May 25, 2024

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిసి ప‌దిరోజులు అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ మాచ‌ర్ల‌, తాడిప‌త్రి, పుంగ‌నూరు వంటి నియోజ‌క‌వ‌ర్గాలు మాత్రం ఇంకాటెన్ష‌న్ టెన్ష‌న్‌గానే ఉన్నాయి.… Read More

May 25, 2024

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఏ పార్టీ లెక్క‌లు ఆ పార్టీ లెక్క‌లు ఆ పార్టీ వేసుకుంటోంది. మొత్తంగా 175 త‌మవేన‌ని… Read More

May 25, 2024

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్థానంలో పార్టీ ప‌గ్గాలు ఎవ‌రు చేప‌డ‌తారనే మీమాంస‌కు తెర‌ప‌డింది. ఈయ‌న వార‌సుడిగా .. నారా లోకేష్… Read More

May 25, 2024

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

ఏపీలో చంద్ర‌బాబు వ‌స్తే.. ఈరాష్ట్రానికి తెలంగాణ నుంచి సంపూర్ణ స‌హ‌కారం ఉంటుంద‌ని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లు.. కేంద్రం… Read More

May 25, 2024

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

Krishna Mukunda Murari:కృష్ణ తన ఇంట్లో ఉంటుంది ముకుందే అన్న విషయం తెలుసుకొని, రెండు రోజులు పుట్టింటికి వెళ్లాలి అని… Read More

May 25, 2024

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

Nuvvu Nenu Prema:అరవింద హాస్పిటల్ నుంచి కృష్ణ అన్న మాటలు విని అక్కడి నుంచి పారిపోతుంది. విక్కీ పద్మావతి ఇద్దరూ… Read More

May 25, 2024

May 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 25: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 25: Daily Horoscope in Telugu మే 25 – వైశాఖ మాసం – శనివారం- రోజు వారి… Read More

May 25, 2024

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

Jaya Badiga: తెలుగు మహిళ జయ బాడిగ అమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్ కోర్టులో జడ్జిగా నియమితులైయ్యారు. ఇలాంటి అత్యున్నతి పదవి… Read More

May 24, 2024

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

AP Elections: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి సెలవుపై వెళ్లారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు,… Read More

May 24, 2024

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

YS Sharmila: ఏలూరు జిల్లాలో ఏడో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.… Read More

May 24, 2024

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

ఇల్లుకాలిపోయి.. ఒక‌ళ్లు ఏడుస్తుంటే.. మ‌రొక‌రు.. చుట్ట‌కి నిప్పు అంటించుకునే ప్ర‌య‌త్నం చేసిట్టుగా ఉంది.. మాచ‌ర్ల ప‌రిస్థితి. ఒక‌వైపు...ఇక్క‌డ అల్ల‌ర్లు జ‌రిగాయి.… Read More

May 24, 2024

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితం.. ఎలా ఉన్నా.. సాధార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఉన్న ఆసక్తి వేరుగా ఉంటుంది. ఎవరు గెలు స్తారు? ఎవ‌రు… Read More

May 24, 2024

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

ఔను.. వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌ను న‌మ్మ‌డం లేదా? పార్టీ బాస్ చెప్పిన విష‌యంపైనే వారికి ఆశ‌లు లేవా? ఇదీ.. ఇప్పుడు… Read More

May 24, 2024

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యం వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత… Read More

May 24, 2024