బజాజ్ వ్యాఖ్యలు గట్టిగానే తగిలినట్లున్నాయి!

Published by
Siva Prasad

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. ఎవరైనా గానీ తమ సొంత అభిప్రాయాలను వ్యాప్తి చేయడం కన్నా సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం మంచిదని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

శనివారం ఒక కార్యక్రమంలో రాహుల్ బజాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వంపై కార్పొరేట్ రంగంలో నమ్మకం సడలిందని అన్నారు. యుపిఎ – 2  హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎవరూ భయపడేవారు కాదనీ, ఇప్పుడు నరేంద్ర మోదీని విమర్శించేందుకు దడుస్తున్నారనీ కూడా ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బజాజ్ మాటలు వెంటనే వైరల్ అయ్యాయి.

దీనికి అమిత్ షా స్పందిస్తూ, దేశంలో ఒక రకమైన వాతావరణం ఉందని మీరు  అంటున్నారు. అలాంటప్పుడు దానిని  మార్చేందుకు ప్రయత్నించాల్సిందే అన్నారు. మూకదాడులపై తగిన విధంగా చర్యలు లేవని పేర్కొంటూ, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గాడ్సేని కీర్తించడాన్ని కూడా రాహుల్ బజాజ్  తన ప్రసంగంలో ఎత్తిచూపారు.

అమిత్ షా సమక్షంలోనే రాహుల్ బజాజ్ ఈ వ్యాఖ్యలు చేయడమే దేశంలో ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొన్నదో చెబుతున్నదని పౌర విమానయాన శాఖ మంత్రి హరదీప్ సింగ్ పురి వ్యాఖ్యానించారు. పీయూష్ గోయల్ కూడా ఇదే మాట అన్నారు.

రాహుల బజాజ్ మాటలకు మంత్రులు ఈ విధంగా స్పందిస్తే బిజెపి ఐటి విభాగం ఆయనను కాంగ్రెస్‌ మనిషిగా చిత్రించే యత్నం చేసింది. బిజెపి ఐటి విభాగం ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ రెండు వీడియోలు పోస్టు చేశారు. వాటిలో రాహుల్ బజాజ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనీ పొగుడుతున్నట్లు ఉంది. ఒక వీడియోను ట్యాగ్ చేస్తూ, రాహుల్ గాంధీనీ తప్ప ఎవరినీ నేను పొగడలేను అని రాహుల్ బజాజ్ చెబుతున్నారు. రాజకీయంగా మీరు ఎవరిపక్కనున్నారో బహిరంగంగా చెప్పుకోండి. అంతేకానీ దేశంలో ఏదో రకమైన వాతావరణం ఉందన్న మాటల వెనక దాక్కునేందుకు ప్రయత్నించకండి అని ట్వీట్ చేశారు.

 

This post was last modified on December 2, 2019 11:38 am

Siva Prasad

Recent Posts

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన… Read More

May 19, 2024

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ… Read More

May 19, 2024

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More

May 19, 2024

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More

May 19, 2024

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై… Read More

May 19, 2024

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More

May 19, 2024

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More

May 19, 2024