‘అసెంబ్లీ ఇష్టారాజ్యమైపోయింది’

Published by
sharma somaraju

అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు, మైక్ ఇచ్చినా మధ్యలో కట్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. సభా సాంప్రదాయాలు పాటించడం లేదని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై 12రోజులు అయిపోయాయి, ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నాయని చంద్రబాబు అన్నారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసిపి వారు దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టిడిపి కార్యకర్తలపై 285 దాడులు జరిగాయనీ, 65 ఆస్తులు ధ్వంసంచేశారనీ, 11 భూకబ్జాలు చేశారనీ, 24చోట్ల కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారనీ, ఏడు హత్యలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల్లో అయితే ఊళ్లోకి రావద్దని కూడా చెప్పారనీ, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశామని చంద్రబాబు అన్నారు. వైసిపి శ్రేణులు దౌర్జన్యాలు, దాడులు చేయడం ద్వారా సమాజంలో అభద్రతాభావం తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ నాయకులకే కాదు సామాన్య ప్రజలకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని అన్నారు. టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటామనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల పెట్టుబడులు పెట్టే వారు కూడా రావడం లేదని చంద్రబాబు అన్నారు. ప్రతి రోజు అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మవరంలో చేనేత కార్మికుడిని దారుణంగా హత్య చేశారని చంద్రబాబు అన్నారు. వైసిపి శ్రేణులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారనీ, చిన్న చిన్న ఉద్యోగులపైనా దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 70ఏళ్ల వయసున్న వారిపైనా అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ఎవరు తప్పు చేసినా పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. వైసిపి శ్రేణుల దౌర్జన్యాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలనీ,  లేదంటే చట్టం ముందు దోషులుగా నిలబడతారని చంద్రబాబు హెచ్చరించారు.

This post was last modified on July 26, 2019 5:56 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More

May 20, 2024

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024