BJP Janasena: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాష్ట్రంలో అధికార వైసీపీ తాము ఒంటరిగా పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసింది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీతో జనసేన జత కట్టింది. ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న జనసేన .. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.
రాష్ట్రంలో టీడీపీ – జనసేన ఉమ్మడి గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామ్యం అని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా ఎక్కడా పెద్ద ప్రభావ వంతంగా ఓట్లు రాబట్టుకోలేకపోయారు. ఇక ఏపీలో బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ కలిసింది లేదు .. మాట్లాడింది లేదు. కానీ తాము జనసేనతో కలిసే ఉన్నామని, జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ చెబుతోంది.
పొత్తుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మరో సారి మాట్లాడారు. ఏపీలో తమ పొత్తులను బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని పురందేశ్వరి అన్నారు. ప్రస్తుతానికి జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని, తమతో తెగదెంపులు చేసుకున్నట్లుగా జనసేన ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఎన్నికైన తొలి నాళ్లలో పురందేశ్వరి త్వరలో తమ మిత్ర పక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం అవుతామని చెప్పారు. కానీ ఇరు పార్టీల నేతలు ఇంత వరకూ భేటీ కాలేదు.
మరో పక్క పొత్తుల విషయాన్ని బీజేపీ ఏదో ఒకటి తేల్చేస్తే .. టీడీపీ – జనసేన కూటమిలో కలుద్దామన్న ఆలోచనలో వామపక్షాలు ఉన్నాయి. ఇప్పటికే సీపీఐ నాయకులు ఆ విషయాన్ని వెల్లడించారు. బీజేపీతో టీడీపీ పొత్తు లేకపోతే ఆ కూటమితో తాము కలుస్తామని వెల్లడించారు. ఓ పక్క రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపిక పై దృష్టి పెట్టాయి.
ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి వలసలు జరుగుతున్నాయి. కానీ బీజేపీ విషయంలో టీడీపీ – జనసేన ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నట్లుగా కనబడుతోంది. బీజేపీ అధిష్టానం ఏపీ విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది..? జనసేనను పక్కన పెట్టి ఒంటరిగా పోటీ చేస్తుందా..? లేక టీడీపీ, జనసేన కూటమిలో కలుస్తుందా..? అనేది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
YSRCP: వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత .. ఆ నియోజకవర్గంలో పెద్ద దెబ్బే(గా)
OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More
T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More
Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More
Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More
Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More
ఏపీ సీఎం జగన్‌పై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్న ఒకప్పటి వైసీపీ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా… Read More
Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More
ఏపీలో ఎన్నికల అనంతర పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More
రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జరిగింది? అని ఆలోచించుకునేలోగానే సమయం కదిలి పోతుంది. అలా జరిగి ఉండాల్సింది… Read More
ప్రస్తుత ఎన్నికలకు ప్రతి ఒక్క నాయకుడికి కూడా అగ్ని పరీక్షగా మారాయి. మరీ ముఖ్యంగా కొందరు నేతలకు అయితే.. ఈ… Read More
ఏదైనా ఒక విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే.. దాని ఫలితం కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఇ ది… Read More
Nuvvu Nenu Prema May 20 Episode 628: విక్కీ పద్మావతి ఇద్దరు అరవింద ఇంటికి వెళ్లి అరవిందతో మాట్లాడుతూ… Read More
Krishna Mukunda Murari May 20 Episode 474: ముకుంద కనిపించట్లేదని ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉంటారు తను… Read More