AP New Districts: 13 కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రారంభించిన సీఎం జగన్

Published by
sharma somaraju

AP New Districts: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కొత్త జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా.. 13 జిల్లాలు కాస్త 26గా మార్పు చేసిన నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పరిపాలనను సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ గా ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను జగన్ ప్రారంభించారు. దీంతో ఏపీలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయ్యాయి. ఈ సందర్భంలో కొత్తపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి తక్షణం చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

CM YS Jagan Inaugurated AP New Districts

AP New Districts: మాజీ ముఖ్యమంత్రి వినతి, ప్రజల ఆకాంక్ష మేరకు కుప్పంలో రెవెన్యూ డివిజన్

జిల్లాల పునర్వ్యవస్థీకకరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలను సీఎం జగన్ వివరించారు. ఇతర రాష్ట్రాల్లో జిల్లాల జనాభా, మన రాష్ట్రంలోని జిల్లాల జనాభాను వివరిస్తూ ఇప్పటి వరకూ ఒక్కో జిల్లాలో 38 లక్షలకుపైగా జనాభా ఉన్నారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కో జిల్లాలో 19 లక్షలకు జనాభా తగ్గుతుందన్నారు. జిల్లాల పెంపు వల్ల ప్రజలకు ప్రభుత్వ పరిపాలన దగ్గర అవుతుందన్నారు. ప్రజల అభ్యంతరాలను పరిశీలన మేరకు రెవెన్యూ డివిజన్ లు ఏర్పాటు చేశామన్నారు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు చంద్రబాబు అభ్యర్థన, ప్రజల ఆకాంక్ష మేరకు కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయడం జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు. కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ మంత్రులకు సీఎం జగన్ సూచించారు. ఈ సందర్భంగా 26 జిల్లాల సమగ్ర సమాచార పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.

 

కాగా కొత్త జిల్లాల ఏర్పాటు దృష్ట్యా కలక్టరేట్ లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫై చేసిన చోట్ల నుంచి కలెక్టరేట్‌లు పనిచేస్తాయని ఆదేశాలలో సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్ చిరునామా కొత్తపేట జంక్షన్‌గా నోటిఫై చేసిన ప్రభుత్వం, విజయనగరం కలెక్టరేట్ చిరునామా కంటోన్‌మెంట్‌గా, విశాఖ కలెక్టరేట్ చిరునామా మహారాణిపేటగా, మన్యం జిల్లా కలెక్టరేట్‌ పార్వతీపురం గిరిజన సంక్షేమ భవనంగా, అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ శంకరం గ్రామ పంచాయతీ భవనంగా, అల్లూరి సీతారామరాజు కలెక్టరేట్‌ పాడేరు నుంచి, కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ పాత కాకినాడ కలెక్టరేట్ గా, కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ అమలాపురం నుంచి, తూ.గో. కలెక్టరేట్ రాజమహేంద్రవరం నుంచి, ఏలూరు కలెక్టరేట్ ఏలూరులోని పాత కలెక్టర్ భవనం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ భీమవరం లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కలశాల భవనం నుండి, కృష్ణా జిల్లా కలెక్టరేట్ మచిలీపట్నంలోని పాత కలెక్టరేట్ భవనం నుండి, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి, గుంటూరు జిల్లా కలెక్టరేట్ గుంటూరులోని నగరంపాలెం కలెక్టర్ కార్యాలయం నుంచి, బాపట్ల జిల్లా కలెక్టరేట్ బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రం భవనం నుంచి, పలనాడు జిల్లా కలెక్టరేట్ నరసరావుపేట లోని జలవనరుల శాఖ కార్యాలయ భవనం నుండి, ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఒంగోలులోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి, నెల్లూరు జిల్లా నెల్లూరులోని పాత కలెక్టరేట్ కార్యాలయం నుండి, తిరుపతి జిల్లా కలెక్టరేట్ తిరుపతిలోని పద్మావతి నిలయం భవనం నుంచి, చిత్తూరు జిల్లా కలెక్టరేట్ చిత్తూరు లోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి, అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ రాయచోటి లోని రాజీవ్ స్వగృహ భవనాల సమీపంలో ని ప్రభుత్వ భవనం నుండి, కడప జిల్లా కలెక్టరేట్ కడప లోని కొత్త కలెక్టర్ కార్యాలయం సి బ్లాక్ నుండి, అనంతపురం జిల్లా కలెక్టరేట్ అనంతపూర్ లోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి, సత్యసాయి జిల్లా కలెక్టరేట్ పుట్టపర్తి లోని సత్య సాయి మిర్పూర్ సంగీత కళాశాల భవనం నుండి, కర్నూలు జిల్లా కలెక్టరేట్ కర్నూలు లోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి, నంద్యాల జిల్లా కలెక్టరేట్ నంద్యాల లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన భవనం నుండి పరిపాలనా కార్యకలాపాలు సాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024