పవన్ కళ్యాణ్ కు మరో లేఖ సంధించిన ముద్రగడ .. ఈ సారి మరింత ఘాటుగా..

Published by
sharma somaraju

ఏపిలో జనసేన వర్సెస్ ముద్రగడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. పెద్ద ఎత్తున జనసైనికులు, అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. సభల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేయడంతో పాటు ఇతర వర్గాలతో పాటు కాపుల సంక్షేమం గురించి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలో పవన్ మాట్లాడుతున్న భాషపై మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఒక సారి పవన్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు. ముద్రగడ బహిరంగ లేఖపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ముద్రగడకు విమర్శలు గుప్పించారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ముద్రగడ పద్మనాభం తాజాగా మరో లేఖ రాశారు.

Mudragada

మరో మూడు పేజీల లేఖలో 30 ప్రశ్నలను సంధిస్తూ.. వాటికి సమాధానం చెప్పాలో వద్దో నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ కే వదిలివేస్తున్నట్లు పేర్కొన్నారు. కాకినాడ నుండి కాకుంటే ఫిఠాపురం నుండి పోటీ చేయగలరా.. చేస్తే తనను పోటీకి రమ్మని సవాల్ చేయగలరా అని ముద్రగడ ప్రశ్నించారు.  కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు తనను కూడా తిట్టించడంపై ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. మీ అభిమానుల చేత బండ బూతులతో మెస్సేజ్ లు పెట్టిస్తున్నారు. ఆ మెస్సేజ్ లకు భయపడిపోయి నేను లొంగుబాటుకు వస్తానని అనుకుంటున్నారేమో అది ఈ జన్మకు జరగదు. అలా పెట్టించడం వల్ల మీరు పెద్ద హీరో అనుకుంటున్నారు. సినిమాలో హీరో తప్ప రాజకీయాల్లలో హీరో కాదన్నది గ్రహించాలన్నారు. తన అభిప్రాయాలు చెప్పకుండా పవన్ కు తొత్తుగా ఉండాలా అంటూ ముద్రగడ ప్రశ్నలు సంధించారు.

తాజాగా లేఖలో పవన్ కు ముద్రగడ సంధించిన ప్రశ్నలు ఇవే

  • నన్ను మీరు, మీ అభిమానులు ఎందుకు తిడుతున్నారు..?
  • నేను మీ దగ్గర నౌకరునా?
  • నేను మీకు తొత్తులుగా ఉండాలా?
  • నాకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా?
  • మీరు ఏమన్నా పడతానన్న గర్వమా?
  • వంగవీటి రంగా హత్య అనంతరం ఎంతో మంది అమాయకులను జైలులో పెట్టారు వారిని పలకరించారా?
  • వాళ్ల కుటుంబాలను ఏ రోజైనా పలకరించారా?
  • జైలులో ఉన్న వాళ్లకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించారా?
  • 1988 నాటి కాపు కేసులపై అప్పటి సీఎంతో మాట్లాడారా?
  • 1993 లో కాపులను చావబాదిన వ్యవహారంపై స్పందించారా?
  • 1994 లో కాపు ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరారా?
  • 2016 తుని ఘటన బాధితులను పరామర్శించారా?
  • తుని ఘటన కేసులను జగన్ ఎత్తివేసినట్లు మీకు తెలీదా?
  • కాపు కులాన్ని నేను స్వార్దం కోసం వాడుకుంటున్నానా?
  • గోచీ మొలతాడు లేని వాళ్లతో తిట్టిస్తే ఏం లాభం?
  • కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా?
  • జిల్లాకు అంబేద్కర్ పేరు విషయమై కాపులపై కేసులు లేవా?
  • నిత్యం మిమ్మల్నే స్మరించేవారి కోసం మీ రెందుకు వెళ్లరు?
  • మీ కోసం అందరూ రోడ్డు మీదికి రావాలా?
  • రోడ్డు మీదకు వచ్చినవారికి ఆపదొస్తే పట్టించుకోరా?
  • మీ సినిమాలు విడుదలైతే ఫ్యాన్స్ కు వేలాది రూపాయల ఖర్చెందుకు?
  • నన్ను పోలీసులు బూటుకాళ్లతో తన్నినప్పుడు మీరెక్కడ?
  • మీ బాంచెన్ దొర అనకపోతే నన్ను తిడతారా?
  • నా ఫ్యామిలీని బూతులు తిడితే మీరేమైపోయారు?
  • కాకినాడ ఎమ్మెల్యేతో కలిపి నన్నెందుకు తిట్టారు?

మీ వాళ్లతో తిట్టించి నన్ను పోటీకి లాగుతున్నారా..? అంటూ పలు ప్రశ్నలను సంధించారు ముద్రగడ. అయితే ముద్రగడ లేఖపై పవన్ కళ్యాణ్ స్పందించి సమాధానాలు ఇస్తారా లేక మరో బహిరంగ సభలోనే ఈ అంశంపై మరిన్ని విమర్శలు చేస్తారా అనేది వేచి చూడాలి.

ఏపి సర్కార్ ప్రవేశపెట్టిన మరో బృహత్తర కార్యక్రమం జగనన్న సురక్ష .. జూలై 1 నుండి ప్రత్యేక క్యాంపులు

ముద్రగడ లేఖ: Namaste Andi, Mudragada Padmanabham 3

 

This post was last modified on June 23, 2023 1:44 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024