Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Published by
kavya N

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు రాజ‌కీయ నాయ‌కుడు చంద్రశేఖర్ రెడ్డి కుమర్తె స్నేహ రెడ్డిని ఓ నైట్ క్ల‌బ్ పార్టీ లో అల్లు అర్జున్ తొలిసారి చూశాడు. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అన్న‌ట్లుగా తొలి చూపులో స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆ త‌ర్వాత ఓ కామ‌న్ ఫ్రెండ్ పెళ్లి వేడుక‌లో అల్లు అర్జున్‌, స్నేహ రెడ్డి మీట్ అయ్యారు. అలా ఏర్ప‌డిన వీరి ప‌రిచ‌యం స్నేహంగా, ఆపై ప్రేమ‌గా మారింది.

కొన్నాళ్లు డేటింగ్ అనంత‌రం ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే అల్లు అర్జున్‌, స్నేహ రెడ్డి పెళ్లికి మొద‌ట ఇరుకుటుంబాల నుంచి అభ్యంతరాలు వ‌చ్చాయి. ముఖ్యంగా స్నేహ తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కూతురి ప్రేమ‌ను ఏమాత్రం అంగీక‌రించ‌లేదు. సినీ నేపథ్యం ఉన్న అబ్బాయిని అల్లుడిని చేసుకోన‌ని ఆయ‌న చెప్పేశారు. అయినా స‌రే అల్లు అర్జున్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఏది ఏమైనా స్నేహ‌తోనే త‌న లైఫ్ అని ఫిక్స్ అయ్యారు. ఫైన‌ల్ గా పెద్దల‌ను ఒప్పించి స్నేహ మెడ‌లో మూడు ముళ్లు వేశాడు.

2011 మార్చి 6న హైదరాబాద్ లో అల్లు అర్జున్‌, స్నేహల‌ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. 2014లో వీరికి అయాన్ అనే కుమారుడు, 2016లో అర్హ అనే కూతురు జ‌న్మించారు. అల్లు అర్జున్ త‌న ఫ్రొఫెష‌న‌ల్ లైఫ్ కు ఎంత‌టి ప్రాధాన్య‌త ఇస్తాడో.. అంత‌కంటే ఎక్కువ ప్రాధాన్యత ఫ్యామిలీకి ఇస్తాడు. ఏ మాత్రం ఖాళీ స‌మ‌యం దొరికినా భార్య‌, పిల్ల‌ల‌తో అల్లు అర్జున్ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. త‌ర‌చూ ఫ్యామిలీతో వెకేష‌న్స్ కు వెళ్తుంటాడు.

స్నేహ రెడ్డి ఇండ‌స్ట్రీకి చెందిన అమ్మాయి కాన‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియా ద్వారా హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. అటువంటి స్నేహ రెడ్డి గురించి తాజాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఆర్య విడుదలై ఇర‌వై ఏళ్లు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి ఆర్య మూవీ 20 ఇయ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్ ను నిర్వ‌హించారు.

వ‌న్ సైడ్‌ ల‌వ్ కాన్సెప్ట్ తో ఆర్య మూవీని తెర‌కెక్కించారు. ఈ నేప‌థ్యంలోనే ఆర్య 20 ఇయ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్ వేడుక‌లో స్టేజ్ పై ఉన్న అల్లు అర్జున్ ను `మీ రియ‌ల్ లైఫ్ లో వన్ సైడ్ లవ్ గురించి చెప్పండి` అంటూ యాంకర్ ప్ర‌శ్నించింది. అందుకు అల్లు అర్జున్ బ‌దులిస్తూ `స్నేహతో ఇప్పటికీ నాది వన్ సైడ్ లవ్వే. మనం ప్రేమించడం తప్పితే అటు నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండదు` అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ న‌వ్వుతూనే ఈ వ్యాఖ్య‌లు చేశాడు. కానీ నెటిజ‌న్లు మాత్రం పెడ‌ర్థాలు తీస్తున్నారు. స్నేహారెడ్డికి త‌న‌ పట్ల ప్రేమ లేద‌ని ప‌రోక్షంగా చెప్పి అందరి ముందు భార్య ప‌రువును అల్లు అర్జున్ తీసేశాడ‌ని చ‌ర్చించుకుంటున్నారు.

kavya N

Recent Posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024