Brahmamudi December 30 2023 Episode 292: కళ్యాణ్ ని ప్రేమిస్తున్నానని అందరి ముందు ఒప్పుకున్న అప్పు.. కళ్యాణ్ పెళ్లి ఎవరితో??

Published by
bharani jella

Brahmamudi December 30 2023 Episode 292: అప్పు అందరి ముందు కళ్యాణ్ ని హాగ్ చేసుకుని ఐ లవ్ యు కళ్యాణ్ అని చెబుతుంది, అప్పు మరోసారి ఐ లవ్ యు కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. అప్పు మాట విన్న కళ్యాణ్ షాక్ అవుతాడు. అక్కడున్న వాళ్లంతా కూడా షాక్ అవుతారు. ఏయ్ అప్పు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడవు అని అనామిక వాళ్ళ అమ్మ రంగంలోకి దిగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ ఛాన్స్ దొరుకుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి అప్పు అందరి ముందు కళ్యాణ్ కి ఐ లవ్ యూ చెప్పి అడ్డంగా దొరికిపోయింది. అనామిక వాళ్ళమ్మ అప్పుని నోటికొచ్చినట్లు చడమడ వాయిస్తుంది. అసలు స్నేహం ముసుగులో ఇంతకాలం నీ ప్రేమను దాచుకొని ఇప్పుడు ఇదే అవకాశం గా తీసుకొని ఈ విషయాన్ని చెబుతున్నావా.. నా కూతురు జీవితాన్ని అన్యాయం చేయాలని అనుకుంటున్నావా, కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను అని ఇప్పుడు అందరి ముందు చెప్పడంలో నీ ఉద్దేశం ఏంటి.. ఈ పెళ్లి ఆపేయాలని అనుకుంటున్నావా అని అనామిక వాళ్ళ అమ్మ అప్పుని తిడుతుంది.

Brahmamudi Today Episode December 30 2023 Episode 292 Highlights

అప్పుడే కావ్య వచ్చి ఆపండి మీరు మా అప్పు గురించి ఏం మాట్లాడుతున్నారు అని అనామిక వాళ్ళ అమ్మకి సమాధానం చెప్పబోతుంటే.. ఇక ఇదే అదునుగా తీసుకుని రుద్రాణి కూడా వాయిస్ రైస్ చేస్తుంది. ఈ కనకం ముగ్గురు కూతుర్లను కానీ దుగ్గిరాల ఫ్యామిలీ మీదకి వదిలింది. ఇప్పటికే ఇద్దరు కూతుర్లు కి పెళ్లి చేసి సక్సెస్ అయింది. ఇక మూడో కూతుర్ని కూడా ఈ ఇంటికి అంటగట్టి తన బాధ్యతని తీర్చుకోవాలని అనుకుంటుంది అని రుద్రాణి అంటుంది. కనకం అలాంటిది ఏమీ లేదు అని అందరి ముందు సర్ది చెబుతుంది. అయినా రుద్రాణి అనామిక వాళ్ళ అమ్మ ఇద్దరూ అప్పు వాళ్ళ అమ్మపై రెచ్చిపోతూ ఉంటారు.

Brahmamudi Today Episode December 30 2023 Episode 292 Highlights

అప్పుడు కళ్యాణ్ కోపంగా అందరూ కాస్త ఆపుతారా బ్రో కి నాకు ఇప్పటినుంచి కాదు స్నేహం రాజ్ అన్నయ్య పెళ్లి అయినప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఐ లవ్ యు అనే పదాన్ని కేవలం ప్రేమికులే కాదు, స్నేహితులు కూడా చెప్పుకుంటున్నారు ఒక అమ్మ కి కొడుకు చెపుతాడు. ఒక కొడుకుకి ఒక తండ్రి చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పదాన్ని పట్టుకొని అంత రచ్చ చేయనవసరం లేదు అని కళ్యాణ్ అంటాడు. అయినా నువ్వు చూస్తూ ఉన్నావంటి అనామిక మన ఇద్దరినీ కలిపింది ఎవరు బ్రో కాదా.. తనకే అలాంటి ఉద్దేశం ఉంటే మన ఇద్దరినీ ఎందుకు కలుపుతుంది. నువ్వు ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని కళ్యాణ్ అనామికపై రివర్స్ అవుతాడు. ఇక అప్పుడే రాజ్ వాళ్ళ నాన్నమ్మ చిట్టి మాట్లాడుతుంది. ఈ విషయం గురించి అంత పెద్దగా ఆలోచించలేని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ గురించి మీరు ఆలోచించకండి. వాళ్ళ స్నేహం గురించి ఇక్కడ అందరికీ తెలుసు దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు అని చిట్టి చెబుతుంది. అప్పుడే విక్కీ వాళ్ళ బాబాయ్ సరదాగా సంగీత్ ఈవెంట్ జరుగుతుంటే ఇప్పుడు మీరందరూ కావాలని గొడవ చేస్తారని దిగిపోండి. నా కొడుకు నా కోడలు ఇద్దరు వచ్చి డాన్స్ చేస్తారు అని ఆయన పెద్దగా అరవడంతో.. స్టేజ్ మీద నుంచి అప్పు వాళ్ళు దిగేస్తారు. ఇక అను తన భర్తతో కలిసి అదిరిపోయే సాంగ్ కి స్టెప్పులు వేస్తారు. ఆ తరువాత నెక్స్ట్ పర్ఫామెన్స్ ఎవరు చేయాలో నేను చెబుతాను అని రాజ్, కావ్య పేర్లు అనౌన్స్ చేస్తారు. రాజ్ కావ్యను వాళ్ళిద్దరూ కలిసి తారా సితరా అందం తన ఊరా అనే సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ అలరిస్తారు. ఆ తరువాత విక్కి, పద్మావతి ఏదో జరిగింది అనే పాటకు కపుల్ డ్యాన్స్ చేస్తారు. ఆ తరువాత అందరూ కలిసి దిస్ ఇస్ ది ఫ్యామిలీ పార్టీ అనే పాటకు డాన్స్ చేసి సంగీత్ ఈవెంట్ ను సక్సెస్ఫుల్గా ముగిస్తారు.

Brahmamudi Today Episode December 30 2023 Episode 292 Highlights

పెళ్లికి కావలసిన వన్నీ కూడా పెళ్లి మండపంపై అరేంజ్ చేస్తూ ఉంటారు అప్పుడే స్వప్న అరవింద్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఇప్పుడెందుకే అరవింద్ దగ్గరికి అని అడుగుతుంది. అరవింద్ ను మనం కట్టేసిన రూము ఈ పెళ్లి మండపం నుంచి చాలా దూరం పద్దాక అక్కడికి వెళ్లి చూసి రావాలంటే చాలా టైం పడుతుంది అందుకని ఇప్పుడే చూసి వస్తాను అని స్వప్న కనకంతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను చాటుగా మురళి వింటాడు. సరే పదా అని స్వప్న, కనకం ఆ రూమ్ దగ్గరికి వెళ్లాడు. అప్పుడు మురళి వాళ్ళని చాటుగా ఫాలో అయ్యి అరవింద్ ని ఎక్కడికి మారుస్తున్నారో చాటుగా నిలబడి చూస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియక అక్కడ రుద్రాణి వాళ్ళు అరవింద్ వస్తాడు మా జీవితాన్ని మార్చేస్తాడు అని అనుకుంటున్నారు. వెంటనే ఈ విషయాన్ని ఆ రుద్రాణి వాళ్ళకి చెప్పాలి అని మురళి అనుకుంటాడు. స్వప్న కనకం ఇద్దరు అరవింద్ కట్టేసి జాగ్రత్తగా అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతారు. ఇదంతా ఫణి చాటుగా నిలబడే వీడియో తీస్తూ ఉంటాడు.

Brahmamudi Today Episode December 30 2023 Episode 292 Highlights

మురళి కళ్యాణ మండపం దగ్గరకు వెళ్లి అనామిక కళ్యాణ్ ఇద్దరు పూజ చేస్తూ ఉండగా రుద్రాణి రాహుల్ నిలబడి చూస్తూ ఉంటారు. కాసేపట్లో ఆ స్వప్న నీ గురించి మొత్తం బయట పెట్టనుంది అని చెబుతాడు. ఇక ఈ విషయాన్ని పక్కకి వెళ్లి మాట్లాడుకుందాం అని రుద్రాణి అంటుంది. మీరు ప్లాన్లో ఉన్నారని అనుకుంటున్నారు కానీ, ఆ స్వప్న అరవింద్ ని దాచి పెట్టింది. రండి త్వరగా చూపిస్తాను అని ఆ గదికి రుద్రాణిని రాహుల్ ని తీసుకువెళ్లి మురళి చూపిస్తాడు. వాడు 24 గంటల నుంచి స్పృహలో లేనట్టున్నాడు. ముందు మిమ్మల్ని గుర్తుపడతాడో లేదో చూడండి అని మురళి అంటాడు. అన్నయ్య నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు లైఫ్ లో నిన్ను ఎప్పటికీ మర్చిపోను అని రాహుల్ అంటుండగా.. ముందు జరగాల్సింది చూడండి అని మురళి అంటాడు. ఇక రాహుల్ నీళ్లు కొట్టి మురళిని లేపుతాడు. సర్ మీరు వచ్చారా మీరు రారేమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అరవిందగా చాల్లే చచ్చు మాటలు మాట్లాడకు అని రుద్రాణి అరుస్తుంది. ఇదంతా ఫణి చాటుగా నిలబడే వీడియో తీస్తూ ఉంటాడు. ఇక వెంటనే మన ప్లాన్ ని చేంజ్ చేద్దాం అని రుద్రాణి అంటుంది. వీడికి దానికి సంబంధం ఉంది కాబట్టి స్వప్న ఇదంతా చేసింది అని మనం అందర్నీ నమ్మిద్దం అని రుద్రాణి అంటుంది. స్వప్న విడిన్ని కిడ్నాప్ చేసింది అని మనం ఎలా నమ్మిస్తాం అని అంటాడు. అప్పుడు రుద్రాణి ఇదంతా వీడియో తీస్తున్న ఫణిని గమనిస్తుంది. ఇక వాడిని పట్టుకొని ఎందుకు వీడియో తీస్తున్నావు. నువ్వు స్వప్న మనిషివా అనే అంటే అప్పుడు అరవింద్ వీడొక తాగుబోతు చూస్తేనే అర్థమవుతుంది కదా అని అంటాడు. మీ వీడియో తీసి ఆ వీడియోను యూట్యూబ్లో పెడితే కోట్లకు కోట్లు డబ్బులు వస్తాయి ఫణి అని చెబుతాడు. రాహుల్ ఆ వీడియోలను డిలీట్ చేయమని రుద్రాణి అంటుంది. అప్పుడే పని తీసిన వీడియోలలో స్వప్న అరవింద్ ని కట్టేస్తుంటే కనకం హెల్ప్ చేస్తున్న వీడియోను రుద్రానికి రాహుల్ చూపిస్తాడు ఈ ఒక్క వీడియో చాలు స్వప్నని మనం అడ్డంగా బుక్ చేయడానికి ఇప్పుడు అరవింద్ ని ఈ రిసార్ట్ నుంచి జాగ్రత్తగా పంపించేసే ఇక మిగతా కథను నేను నడిపిస్తాను అని రుద్రాణి అంటుంది. ఇక ఫణి నా వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అంటే రాహుల్ 110 రూపాయలు పని చేతిలో పెడతాడు. ఇక అరవింద్ జాగ్రత్తగా పంపించేసి రుద్రాణి వాళ్ళు కళ్యాణ మండపంలోకి వస్తారు. స్వప్న ఎన్ని రోజులు నుంచి నన్ను ఎంత టార్చర్ పెట్టావో ఇప్పుడు నీకు డబల్ టార్చర్ ని నేను ఇస్తాను అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.

Brahmamudi Today Episode December 30 2023 Episode 292 Highlights

రుద్రాణి కళ్యాణ్, అనామికలు పూజ చేస్తుండగా.. ఒక్క నిమిషం పంతులుగారు పూజకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించండి అని కనకం చెయ్యి పట్టుకుని పక్కకు లాగి అబద్ధాలు మాత్రమే చెబుతావు అనుకున్నా, ఇప్పుడు నువ్వు నీ కూతురు కలిసి ఒక మగాడిని కిడ్నాప్ చేస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది మీ నిజ స్వరూపం అని రుద్రాణి తన చేతిలో ఉన్న ఫోన్ ఓపెన్ చేసి వీడియో అందరి ముందు చూపిస్తుంది. చూడండి అని అరవింద్ ని కనకం, స్వప్న కట్టేస్తున్న వీడియో ని అందరూ చూసి షాక్ అవుతారు. అరవింద్ అంటే వీడే, వీడే స్వప్న మాజీ ప్రియుడు. ఇప్పుడు వీడి బిడ్డనే స్వప్న కడుపులో మోస్తుంది. ఇప్పుడు ఆ నిజాన్ని వాడు బయట పెడతాను అని అంటే వాడిని అమ్మ, కూతురు కట్టేశారు. ఇప్పుడు ఇక్కడ పెద్దలు, వయో వృద్దులు, పూజ్యులు అందరూ ఉన్నారు కదా అని ఇప్పుడు నిజానిజాలు తెలుసుకున్నారు కదా అసలైన తీర్పు ఇప్పుడు ఇవ్వండి అని అంటుంది. అసలు అరవింద్ మేమెందుకు కిడ్నాప్ చేసామో మీకు తెలియదు అని స్వప్న అంటుంది ఓకే ఇప్పుడు మళ్లీ ప్లేట్ మార్చావని రుద్రాణి అంటుంది అప్పుడు కావ్య మీరు కొండను తవ్వి ఎలుకను బయటికి తీశారు అని అంటుంది ఓకే ఇందులో నీ హస్తం కూడా ఉందా.. అంటే ఈ విషయం మీకు కూడా తెలుసు అన్నమాట అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యారు అన్నమాట అని రుద్రాణి అంటుంది.‌ అయితే మనతోనే ఉంటూ గంటకో చీర కట్టుకొని మ్యాచింగ్ నగలు వేసుకుని అరవింద్ ని కట్టేసి ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు అని అంటుంది.

ఇక రుద్రాణి స్వప్నని చెడమడ వాయిస్తూ ఉండగా నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అంటుంది. అప్పుడు పద్మావతి సాక్ష్యం ఉంది అని తాను పట్టుకున్న అరవింద్ ని లాక్కొని ఈడ్చుకు వచ్చి స్వప్న ముందు పడేస్తుంది. రేయ్ ఇప్పుడు నువ్వు నిజం చెప్పు లేదంటే మా సార్ తో చెప్పించి నిన్ను కొట్టిస్తాను. ఇక జీవితంలో బ్రతకడానికి కూడా పనికిరావని పద్మావతి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే విక్కీ వచ్చి వాడిని చడమడ నాలుగు పీకుతాడు నిజం చెప్పమని చెబుతాడు. అరవింద్ రాహుల్ వైపు చూడకగా నిజం చెప్పొద్దు అని సరిగా చేస్తాడు. అప్పుడు అరవింద్ నేను స్వప్న కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్. నేను డాక్టర్ చదువుకున్నాను హాస్పిటల్ పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మేము ఇద్దరం క్లోజ్ గా దిగిన ఫోటోలు ఇప్పుడు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాను. అంతేకానీ స్వప్న కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రిని కాదు అని అరవింద్ చెబుతాడు. వెంటనే ఈ అరవింద్ ని పోలీసులకు అప్పచెబుదామని విక్కీ రాజ్ అనుకుంటారు. కానీ పెళ్లి మండపంలో ఇలాంటివి వద్దు అని సీతారామయ్య అనడంతో స్వప్న అరవింద్ ని నాకు కొట్టాలని అనిపిస్తుంది. అనడంతో నీకు నచ్చింది చేసుకో అని చెప్పి రాజ్ స్వప్న దగ్గరికి అరవింద్ విసిరేస్తాడు. అప్పుడు స్వప్న అరవింద్ చంప పగలకొట్టకుండా రాహుల్ చంప పగలగొడుతుంది. చదువుకున్నావు కదా సంస్కారం ఉంది కదా, భార్యను ఎలా ట్రీట్ చేయాలో కూడా నీకు తెలియదా.. ఇన్ని రోజుల నుంచి నేను చెడిపోయిన దాన్ని అందరి ముందు నన్ను హేళన చేస్తూ మాట్లాడారు ఇప్పుడు ఏమైంది అని స్వప్న రాహుల్ కి గడ్డి పెడుతుంది ఒక ఆడదానివై ఉండి మరో ఆడదానికి అన్యాయం చేయాలనుకున్నావు. నువ్వు ఒక అత్తగారివేనా అని రుద్రానికి గడ్డి పెడుతుంది స్వప్న. అప్పుడు చిట్టి అందరి ముందు కనకం మెచ్చుకుంటుంది. కూతురి జీవితం ఇలా అయిపోయినందుకు నువ్వు బాధపడకుండా ధైర్యంగా నిలబడ్డావు. నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండిపోతున్నాను కనకం అని చిట్టి కనకాన్ని అభినందిస్తుంది. మబ్బులన్నీ చెరిగిపోయాయి నా కూతురి మీద పడ్డ నిండా తొలగిపోయింది. పంతులుగారు ఇక పూజ మొదలుపెట్టండి అని కృష్ణమూర్తి అంటాడు.

వేసుకున్న ప్లాన్ అంతా పోయింది అని రుద్రాణి గింజుకుంటూ ఉంటుంది. రాహుల్ కూడా ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని అమాయకంగా వాళ్ళ అమ్మని అడుగుతాడు ఇదంతా నీ వల్లే జరిగింది అసలు అరవింద్ బయటకు వెళ్లిందాకా నేను నిన్ను ఉండమని చెప్పాను కదా.. ఇంతలోనే నువ్వు ఎందుకు అరవిందుని వదిలేసి వచ్చావు అని రాహుల్ కి క్లాస్ పీకుతుంది నువ్వు స్వప్నని ఎలా బయటికి గెంటేస్తావా అని ఈగరుగా వెయిట్ చేస్తున్న నేను ఆ సీన్ వచ్చేసరికి అక్కడ ఉండాలని చెప్పి గబగబా వచ్చేసాను మమ్మీ.. అంతేకానీ నేను కావాలని చేయలేదు అని రాహుల్ అంటాడు. నేను ఎంత బాధలో ఉన్నా కూడా ఒక్కరు కూడా నన్ను పట్టించుకోకుండా సంతోషంగా కళ్యాణ్ పెళ్లి చేయాలని చూస్తున్నారు స్వప్నను గెంటేసి ఆ వంకతో ఈ పెళ్లి ఆపేయాలని అనుకున్నాను ఆ అవకాశం కాస్త చేజారిపోయింది. ఇప్పుడు ఒకే ఒక్క అవకాశం దొరకాలి ఎలాగైనా ఆపేస్తాను అని రుద్రాణి అంటుంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న రుద్రానికి అవకాశం దొరుకుతుంది అది కాస్త సద్వినియోగం చేసుకుంటుంది. అప్పు కళ్యాణి ప్రేమిస్తుందా అని లెటర్ ద్వారా తెలుసుకున్న రుద్రాణి ఆ లెటర్ ని దాన్ని లక్ష్మికి చూపించి పెద్ద గొడవ చేయాలని కళ్యాణమండపం దగ్గరకు వెళుతుంది. అప్పుడు అప్పు నిజం ఒప్పుకుంటుంది.

అప్పు పక్కనే ఉండే ఆ అబ్బాయి వస్తాడు. ఏంట్రా నువ్వు ఇలా వచ్చావు అని కనకం అంటుంది. అప్పు అక్క కళ్యాణ్ ప్రేమించింది ఇప్పుడు ఆ విషయం కళ్యాణ్ కి చెబుతాను అని అంటున్న మాటలను అటుగా వెళ్తున్న పద్మావతి, కావ్య వింటారు. ఏంటమ్మా వీడు ఏం మాట్లాడుతున్నాడు అప్పు కళ్యాణ్ ని ప్రేమించడం ఏంటి అని కావ్య అడుగుతుంది. అవును వాడు చెప్పింది నిజమే అప్పు కళ్యాణ్ ని ప్రేమించింది అని కనకం కావ్య తో చెబుతుంది. అంతేకాదు అప్పు కళ్యాణ్ ని ప్రేమించిందన్న సంగతి ఒక లెటర్లలో రాసి కళ్యాణ్ బాబు గదిలో పెట్టి వచ్చాను అని అతను చెబుతాడు.

ఇప్పుడు అదే లెటర్ ను రుద్రాణి తీసుకొని ఆ లెటర్ ను ధన్యాలక్ష్మి కి చూపిస్తుంది. ధన్యాలక్ష్మి ఆ లెటర్ ను పట్టుకొని ఈ పెళ్లి ఆపేయడానికి అప్పు కనకం ఇద్దరు కలిసి అప్పు కళ్యాణి లవ్ చేస్తుందని నాటకాన్ని క్రియేట్ చేశారు అని ధన్యాలక్ష్మి పెద్దగా అంటుంది. ఆంటీ అది నాటకం కాదు నేను నిజంగానే కవి గారిని ప్రేమిస్తున్నాను అని అప్పు అందరి ముందు ఒప్పుకుంటుంది. అప్పు కళ్యాణ్ ని ప్రేమిస్తుంది అని తెలుసుకున్న కళ్యాణ్ ఈ పెళ్లిని ఆపేస్తాడా లేదంటే అనామికతో కళ్యాణ్ పెళ్లి జరుగుతుందా అనేది చూడాలి.

This post was last modified on December 30, 2023 9:06 am

bharani jella

Recent Posts

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024