Nindu Noorella Saavasam April 3 2024 Episode 201: అరుంధతి లాగా అందరికీ వడ్డిస్తున్న భాగమతి, అది చూసి షాక్ అయిపోతున్న అమరేంద్ర..

Published by
siddhu

Nindu Noorella Saavasam April 3 2024 Episode 201: అరుంధతి వెళ్లి భాగమతి ఒంట్లో ప్రవేశిస్తుంది. అరుంధతి భాగమతి ఒంట్లో ఉండి తన ఇంట్లోకి మొదటిసారి అడుగు పెట్టినట్టు లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఈ తాడు నా చేతికి కట్టు నీలా అని మనోహరి అంటుంది. ఎందుకు అమ్మగారు అని నీలా అడుగుతుంది. అమర్ నా మెడలో తాళి కట్టకుండా అరుంధతి ఆపుతుందని ఘోర చెప్పాడు అలా జరగకూడదు అమర్ కి భాగమతికి పెళ్లి అవుతుందని వాళ్ల పిన్ని చెప్పింది అరుంధతి మీద నేను గెలవాలి అంటే నేను వాళ్లకంటే పది అడుగులు ముందే ఉండాలి అందుకే ఈ తాడును నా చేతికి కట్టు ఇదే నాకు రక్ష అని ఘోర చెప్పాడు అని మనోహరి అంటుంది. పెళ్లిలో ఈ తాడు ఉంటే పంతులుగారు ఎందుకు ఇది కట్టుకున్నావ్ అని అడిగితే ఏం చెప్తావని నీలా అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode April 3 2024 Episode 201 highlights

అదంతా నేను చూసుకుంటాను నువ్వు కట్టు అని మనోహరి చేయి చాపుతుంది నీలా తనకి తాడుకడుతుంది.అక్క నా కంటికి కనిపించందు ఇక కంటికికనిపించే చెల్లి ఏం చేస్తుందో చూడాలి అమర్ తో నా పెళ్లి జరగకుండా ఎవరు ఆపుతారో చూడాలి అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే,అరుంధతి తన ఇంట్లోకి వెళ్లి కొత్తగాచూస్తుంది ఇల్లంతా తిరుగుతూ ఆనందంగా గంతులు వేస్తూ ఉండగా మనోహరి అక్కడికి వస్తుంది. భాగమతి తనను అలాగే చూస్తూ ఉంటుంది.ఏంటి నన్ను కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నావ్ అని మనోహరి అంటుంది. నిన్ను కొత్తగా చూస్తున్నాను కదా మను అని భాగమతి అంటుంది. ఏంటి అరుంధతి తప్ప నన్ను ఎవరు మను అని పిలువలేరు నువ్వు పిలుస్తున్నావేంటి అని మనోహరి అంటుంది. పిలవాలి అనిపించింది పిలిచాను ఏంటి భయపడుతున్నావా నువ్వు ఆయనని పెళ్లి చేసుకుని ఎలా ఆనందంగా ఉంటావో నేను చూస్తాను అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 3 2024 Episode 201 highlights

నన్ను డైరెక్టుగా ఏమీ చేయలేక ఇలా ఆరుల మాట్లాడి బెదిరిస్తున్నావా అని మనోహరి అంటుంది. నువ్వు స్నేహం పేరు చెప్పి మోసం  చేసిన బాధపడేదాన్ని కాదే నా కుటుంబం జోలికి వచ్చావు నిన్ను వదలను అని భాగమతి ఒంట్లో ఉన్నావు అరుంధతి అంటుంది. ఇంతలో అంజలి అక్కడికి వచ్చి ఏమైంది మిస్సమ్మ అని అడుగుతుంది. అంజు నా బంగారు తల్లి అని అంజలి ఎత్తుకొని ముద్దాడుతుంది భాగమతి. పిల్లలందరినీ దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఆ పిల్లల్ని అంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది అని నీలా అంటుంది. నాక్కూడా అదే అనిపిస్తుంది బహుశా ఓడిపోతానని ఇలా ప్రవర్తిస్తుందేమో అని మనోహరి అంటుంది. మిస్సమ్మ పిల్లల్ని కొత్తగా చూస్తున్నట్టు అంత ఎమోషనల్ అయిపోతున్నావు ఏంటి అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ రోజు మమ్మల్ని చూస్తున్నావుగా మరి ఈరోజు ఏంటి అంత ఎమోషనల్ అవుతున్నావ్ అని అంజలి అడుగుతుంది. మీరు క్యాంపుకు వెళ్తే మిమ్మల్ని చాలా రోజులు చూడలేకపోయేదాని కదా అది గుర్తుకు వచ్చి బాధేసింది అంజు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 3 2024 Episode 201 highlights

తల్లి నుంచి బిడ్డలను ఎవరైనా వేరు చేయగలరా అని శివరామ్ అంటాడు. అంకుల్ మిస్సమ్మ పిల్లలకు తల్లి ఏంటి అని మనోహరి అంటుంది. కేర్ టేకర్ అంటే తల్లి లాంటిదే కదమ్మా అందుకే అలా అన్నాను అని శివరామ్ అంటాడు. నాకు కడుపు మంటగా ఉంది ఆకలేస్తుంది తిందామా అని మనోహరి అంటుంది. కట్ చేస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అమరేంద్ర కూర్చుంటూ ఉండగా మీద ఖర్చు వేస్తుంది. అదేంటమ్మా తినకముందే ఇలా చేస్తున్నావ్ అని నీలా అడుగుతుంది. ఆయనకు ఇలాగే అలవాటు అని భాగమతి అంటుంది. మేము మర్చిపోయిన మా వాడి అలవాటు నీకెలా తెలుసు అని నిర్మల అడుగుతుంది. సార్ ఇలా ఒకసారి తినడం చూశాను అందుకే ఇలా చేశాను అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 3 2024 Episode 201 highlights

నీలా వడ్డించమని నీకు సపరేట్గా చెప్పాలా అని కోపంతో అంటుంది మనోహరి. మీ అందరికీ నా చేతులతో వడ్డించే అవకాశం దొరికింది మళ్లీ నాకు దొరుకుతుందో దొరకదో అని భాగమతి అంటుంది. మాతో ఉండేది ఒక్కరోజు అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అని అమరేంద్ర అంటాడు. మీ అందరికీ నా చేత్తో వడ్డించాలని ఉందండి అందుకే అన్నాను అని భాగమతి అందరికీ అన్నం వడ్డిస్తుంది. అంకుల్ మీకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇందులో ఆరోగ్యానికి సంబంధించినవి ఎక్కువగా ఉంటయి కాబట్టి తప్పకుండా తినాలి అని భాగమతి వడ్డిస్తుంది. ఆంటీ నీకు పప్పులో నంజుకోవడానికి ఆవకాయ ఒక పీస్ వేస్తున్నాను అని వేస్తుంది. అమ్ములు పాపకి ఇష్టమైన సాంబార్ దాంట్లోకి అప్పడం అని అమ్ములు కి వేస్తుంది. అంజలికి ప్రేమగా గోరుముద్దలు పెట్టి తినిపిస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode April 3 2024 Episode 201 highlights

ఆనంద్ పైన తినడానికి ఏమీ లేవు ఇక్కడే కడుపునిండా తిను అని భాగమతి అంటుంది. ఆకాష్ ఆకుకూర తప్పకుండా తినాలి తిను అని అని భాగమతి అంటుంది. ఏవండీ ఈరోజు కడుపునిండా తినండి మీకు ఇష్టమైన బెండకాయ ఫ్రై కూడా ఉంది అని భాగమతి అంటుంది.  అచ్చం మా కోడలు లాగే వడ్డిస్తున్నావమ్మా అని శివరామ్ అంటాడు. అనాధనేనా నన్ను ఇంట్లో ఒకరిని చేసుకున్నారు నేను చనిపోయాక కొన్నాళ్లు నన్ను మర్చిపోతారు అనుకున్నాను కానీ ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఇంత బాధ పడుతున్నారు అని మనసులో అనుకుంటుంది అరుంధతి మా అలవాట్లన్నీ నీకెలా తెలుసు మిస్సమ్మ అని నిర్మల అంటుంది. అవేలా మర్చిపోతాను అత్తయ్య అని భాగమతి అంటుంది. ఆంటీ నీకు అత్త ఏంటి అని మనోహరి అంటుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లొచ్చాను కదా అలవాటులో అలా పిలిచేసాను అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది

siddhu

Recent Posts

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More

May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More

May 20, 2024

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More

May 20, 2024

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More

May 20, 2024

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల‌రోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన ష‌ర్మిల గ‌ళం .. ఇప్పుడు వినిపించ‌డం లేదు. సొంత అన్న… Read More

May 20, 2024

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Murari: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే చిత్రాల్లో మురారి ఒకటి.… Read More

May 20, 2024

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

OTT Actress: ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కరోనా దెబ్బతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన… Read More

May 20, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న… Read More

May 20, 2024

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) పార్టీకి కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో… Read More

May 20, 2024

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024