Papua New Guinea: భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాదాభివందనం చేసి మరీ స్వాగతించిన ఆ దేశ ప్రధాని

Published by
sharma somaraju

Papua New Guinea:  పావువా న్యూ గినియో దేశంలో జరిగే ఫోరం ఫర్ ఇండియా – పసిపిక్ ఐలాండ్స్ కోఆపరేష్ (ఎఐపీఐసీ) సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఆ దేశం వెళ్లారు. పపువా న్యూగినియా చేరుకున్న ప్రధాని మోడీకి ఈ దేశంలో ఘన స్వాగతం లభించింది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. ప్రధాని జేమ్స్ మరాపే .. ఆయన కాళ్లకు మొక్కి మరీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మొదట ఇరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోడీకి పాదాభివందనం చేశారు న్యూ గినియో దేశ ప్రధాని. వాస్తవానికి సూర్యాస్తమయం తరువాత ఆ దేశంలో ప్రవేశించే ఇతర దేశాల నేతలకు సాధారణ ఉత్సవంగా స్వాగతం పలకరు.

papua new guinea pm touches India prime minister modi feet

 

కానీ ఆదివారం సాయంత్రం మోడీ విషయంలో ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టి మరీ ఘనంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని మోడీకి ప్రత్యేక మినహాయింపును ఇచ్చారు. పపువా న్యూ గినియాను ఒక భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలి సారి. గతంలో భారత ప్రధానులు ఎవరూ ఆ దేశాన్ని సందర్శించలేదు. ఈ దేశాన్ని ఆయన చేరగానే అక్కడి భారతీయులు కూడా ఆయనను సాదరంగా స్వాగతించారు. ప్రధాని జేమ్స్ మరాపేతో కలిసి సోమవారం జరిగే ‘ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్’ మూడవ సమ్మిట్ లో మోడీ పాల్గొంటారు.

ఈ రోజు వరకూ జపాన్ లోని హిరోషిమాలో జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ .. అది ముగించుకున్న అనంతరం ఇక్కడికి చేరుకున్నారు. ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోడీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. సమ్మిట్ లో పాల్గొనేందుకు 14 పసిఫిక్ ఐలాండ్ దేశాలూ అంగీకరించడం పట్ల మేడీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదివారం ఉదయం ప్రకటన చేశారు.  దీన్ని ఆయన అతి ముఖ్యమైన సమావేశంగా పేర్కొన్నారు.

మోడీ 2014 లో ఫిజీ పర్యటన సందర్భంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. పసిఫిక్ దీవుల సహకారంలో కుక్ దీవులు, పిజి కిరిబాటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావు, పావువా న్యూ గినియో, నమోవా, సోలమన్ దీవులు, టోంగా, తువాలు, వనాటు ఉన్నాయి. ప్రధాని మరాపేతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపడమే గాక.. గవర్నర్ బాబ్ దడాయేతోనూ భేటీ కానున్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం

This post was last modified on May 21, 2023 11:08 pm

sharma somaraju

Recent Posts

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024