France Violence: ఆందోళనలతో అట్టుడికిపోతున్న ఫ్రాన్ .. పోలీసులతో ఘర్షణలు .. తీవ్ర రూపం దాల్చిన హింస

Published by
sharma somaraju

France Violence:  దేశ వ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. భారీ ఎత్తున భద్రాతా బలగాలను మోహరించినప్పటికీ నిరసనకారులను అదుపు చేయడం కష్టంగా మారింది. 17 ఏళ్ల నహేల్ అనే యువకుడిని ట్రాఫిక్ తనిఖీల సమయంలో పోలీసులు కాల్చడం వల్ల దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. వరుసగా నాల్గో రోజు హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి.  పోలీసులు, యువత మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. అల్లర్ల నేపథ్యంలో 875 మందికిపైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. నహేల్ ను కాల్చి చంపిన నాన్ టెర్రేలో సాయుధ బలగాల వాహనాలను తగులబెట్టారు. ఈ హింస క్రమంగ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వరకూ విస్తరించింది. అక్కడక్కడా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. క్లిచి – సౌస్ – బోయిస్ లో సిటీ హాల్, అబర్ విల్లియర్స్ లో బస్ డిపోకు నిప్పు పెట్టారు. భద్రతా దళాలపై టపాసులు ప్రయోగించారు.

France protests violence and lootings reported at many places

 

ట్వెల్త్ జిల్లాలో పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. రివోలిస్ట్రీట్, లౌవ్రే మ్యూజియం, ప్యారిస్ అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరమ్ డెస్ హోలెస్ లో దుకాణాలను ఆందోళనకారులు లూటీ చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు బాష్పవాయువు, జల ఫిరంగులు, స్టన్ గ్రనేడ్లను ప్రయోగించారు. 40వేల మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. పట్టపగలే కొందరు తీవ్ర స్థాయిలో హింసను పాల్పడుతున్నారు. పారిస్ సహా అనేక ప్రాంతాల్లో దుకాణాలను లూటీ చేస్తున్నారు. శుక్రవారం స్ట్రాస్ బర్గ్ లోని యాపిల్ స్టోర్ లోపలకు నిరసనకారులు చొరబడి అక్కడి సామాగ్రిని దోచుకెళ్లారు. ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

France protests violence and lootings reported at many places

 

ఈ ఆందోళనకు సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మాక్రాన్ ఆరోపిస్తూ.. అల్లర్లకు తమ పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలని కోరారు. అల్లర్లను అణచడానికి సోషల్ మీడియాపై ఆంక్షలను ప్రతిపాదించారు అధ్యక్షుడు మాక్రాన్. హింసాకాండకు ఆజ్యం పోయడంలో స్నాప్ చాట్, టిక్ టాక్ వంటి సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషించాయని ఆయన ఆరోపించారు. సమస్యాత్మక కంటెంట్ ను తొలగించడానికి నిబంధనలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. అల్లర్లలో పాల్గొని అరెస్టు అయిన వారిలో మూడింట ఒకవంతు యువకులేనని అధ్యక్షుడు వెల్లడించారు. ఫ్రాన్స్ లో అత్యవసర స్థితితో పాటు శాంతి పునరుద్దరణకు చేపట్టాల్సిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు ఫ్రెంచ్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ తెలిపారు.

ఫ్రాన్స్ లో ఇలా ట్రాఫిక్ తనిఖీల సమయంలో కాల్చిచంపడం కొత్తేమీ కాదని ఆందోళనలు చేస్తున్నారు. 2022 ఒక్క సంవత్సరంలోనే 13 మందిని తనిఖీల సమయంలో పోలీసులు కాల్చి చంపారని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది నహెల్ అనే యువకుడిని కాల్చి చంపడానికి ముందు మరో ముగ్గురిని ఇలాగే కాల్చి చంపారని ఆందోళనకారులు ఆరోపించారు. వచ్చే సంవత్సరం ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు ఆ దేశాన్ని కలవానికి గురి చేస్తున్నాయి.

అమరావతి భూస్కామ్ లో చంద్రబాబు, పొంగూరు నారాయణ లు ఇలా దొరికేశారు(గా)..!

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024