Karthika deepam : దీపకు మళ్ళీ పెళ్లి చేయనున్న సౌందర్య.. పెళ్లి కొడుకు ఎవరంటే..??

Published by
Deepak Rajula

Karthika deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎలాంటి సరికొత్త మలుపులతో ముందుకు సాగుతుందో తెలుసుకుందామా.కార్తీక్, దీప, పిల్లలు ఇంటికి రావడంతో ఇంట్లోని వారందరు చాలా సంతోషంగా ఉంటారు.ఈ విషయం తెలియని మోనిత లక్ష్మణ్ కి డబ్బులు డబ్బులిచ్చి తాడికొండ వెళ్లి వెతకమని పంపిస్తుంది. మరోపక్క హిమ,సౌర్యలు బాబుతో ఆడుకుంటూ ఉండగా ఉన్నటుండి సౌర్య ‘నాన్నమ్మా వీడు అచ్చం డాడీలానే ఉంటాడు కదా అనేస్తుంది. అప్పుడు అందరూ ఒకేసారి షాక్ అవుతారు. వెంటనే సౌందర్య, దీప అలా అనకూడదు అని సున్నితంగా చెప్తారు.

Karthika deepam : ఇంట్లోనే పార్టీ చేసుకుందాం అన్న సౌందర్య..కారణం ఏంటంటే..?

ఇక హిమ అయితే ‘మనం బయటికి వెళ్దాం నాన్నమ్మా’ అంటే ‘ఎక్కడికి వెళ్లేది లేదు.ఇంట్లోనే పార్టీ అంటుంది. పార్టీ ఏంటి అని ఆశ్చర్యంగా అంటే ‘మీరు రావడంతో అందరికీ పార్టీ ఇవ్వమని మీ డాడీ కాల్ చేసి మరీ చెప్పార్రా’ అంటుంది సౌందర్య.ఇక మోనిత, భారతి కారులో వెళ్తూ వెళ్తూ సౌందర్య వాళ్ళ ఇంటి వైపు కారు తిప్పుతుంది. భారతి ఏంటి ఇటు తీసుకోచ్చావ్ అంటే ఒకసారి మా అత్తగారి ఇంటికి వెళ్లి బయట నుంచి ఓ దన్నం పెట్టుకుని వెళ్దామని ఇటు తిప్పాను’ అంటుంది మోనిత.

కార్తీక్ ఇంటికి వచ్చిన మోనిత :

అయితే కార్తీక్ వాళ్ళ ఇల్లంతా లైటింగ్‌తో మిలమిల మెరిసిపోతుంది. ‘ఏంటి భారతి బాధలో చీకట్లో ఉంటారనుకుంటే ఇలా లైట్స్ తో వెలిగిపోతుందిదేంటి ఇల్లు?’ అంటుంది. ‘కార్తీక్ వచ్చాడేమోఅని భారతి అంటే అక్కడెక్కడో ఉన్న కార్తీక్ ఇప్పుడు ఎందకొస్తాడు అంటూ కారు తీస్తుంది మోనిత.ఇక హిమ, సౌర్యలు.. దీప, కార్తీక్‌లకు ‘పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ కార్డ్స్‌ తయారు చేస్తారు. ఇంతలో సౌందర్య రావడంతో నాన్నమ్మా.. అమ్మా నాన్నల పెళ్లి గురించి చెప్పు.. ఎలా చేశారు వాళ్ల పెళ్లి?’ అంటూ ఆరా తీస్తారు.

గతంలో సౌందర్య చేసిన తప్పు పిల్లలకు చెబుతుందా.?

దాంతో ఒక్కసారిగా దీప, కార్తీక్ పెళ్లి చేసుకుని వచ్చేయడం, తను తిట్టడం.అంతా గుర్తొస్తుంది సౌందర్యకు.మీ అమ్మా నాన్నల పెళ్లి మేము చూడలేదురా అంటూ చెబుతూనే ‘మీ అమ్మా నాన్నలకు పెళ్లి రోజు అన్న సంగతి గుర్తు లేదు కదా మీరు చెప్పకండి.. రేపు సర్‌ఫ్రైజ్ చేద్దాం సరేనా’ అంటూ ఒప్పిస్తుంది.మరునాడు అన్ని ఏర్పాట్లు చేయిస్తుంది సౌందర్య.కార్తీక్‌ కూడా రెడీ అయ్యి కిందకు రాగానే సౌందర్య కార్తీక్‌కి ముద్దుపెట్టి.. ‘పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దోడా..’ అంటుంది. ఒకరి తర్వాత ఒకరు శుభాకాంక్షలు చెబుతారు.ఇంకా ‘పెళ్లి కూతుర్ని తీసుకొస్తాను’ అని వెళ్తుంది. లోపలకిి వెళ్లేసరికి దీప కూడా రెడీ అయ్యి ఉంటుంది. దీపకు కూడా ముద్దు పెట్టుకుని.. వాళ్లు ఇల్లు వదిలి వెళ్లడంతో సౌందర్య పడిన ఆవేదన చెప్పి వెంటనే.. ‘దీపా నాకు మాటివ్వే.. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి పెట్టను అని మాటివ్వు’ అంటుంది. దాంతో దీప వెంటనే మాటిస్తుంది.

దీపకు మళ్ళీ పెళ్లా..?

ఇంతలో పిల్లలు వచ్చి.. ‘నాన్నమ్మా కింద పంతులుగారు అమ్మని తీసుకుని రమ్మంటున్నారు’ అంటారు. తల్లికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతారు హిమ, సౌర్యలు..ఇంకా మళ్ళీ సీన్ మోనిత ఇంట్లో ఓపెన్ అవుతుంది.మోనిత ఇంటి బయట పని చేస్తున్న లక్ష్మణ్ భార్య అరుణను చూసి ‘అక్కా నేను వచ్చేశాను’ అని చీరల చాటునుంచి ఎవరో వ్యక్తి అనడంతో వచ్చేశాడు తాగుబోతు సచ్చినోడు..’ అని తిట్టుకుంటుంది అరుణ.ఇంకా ఆ వ్యక్తి ఎవరో కాదు కార్తీక్ ను వెతకమని సౌందర్య తాడికొండకు పంపిన బిచ్చగాడు అలియాస్ మహేష్.

మోనిత ఇంట్లో బిచ్చగాడు :

అతను లక్ష్మణ్ భార్య తమ్ముడుగా ఎంట్రీ ఇస్తాడు. ఏదేదో మాట్లాడుతుంటే అరుణ పోరా సచ్చినోడా అంటూ మోనిత ఇంట్లోకి వెళ్తుంది. వెనుకే మహేష్ కూడా వెనుకే వెళ్లిపోతాడు. అక్కడ కూర్చీలో కూర్చున్న మోనిత మహేష్ ను చూసి ‘ఎవరు ఇతను అంటూ అసహ్యంగా చూస్తూ అడుగుతుంది.మా తమ్ముడు అమ్మా.. తాగుబోతు సచ్చినోడు’ అంటుంది అరుణ. ఇంతలో ఎదురుగా ఉన్న కార్తీక్, మోనితల ఫొటో చూసిన మహేష్.. ‘అక్కా ఈయన ఫొటో ఏంటి ఇక్కడుంది?’ అంటాడు. దాంతో మోనిత షాక్ అయిపోతూ పైకి లేస్తుంది.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.

This post was last modified on February 12, 2022 10:42 am

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల… Read More

May 21, 2024

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More

May 21, 2024

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More

May 21, 2024

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More

May 21, 2024

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More

May 21, 2024

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More

May 21, 2024

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More

May 21, 2024

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More

May 21, 2024

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More

May 21, 2024

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More

May 21, 2024

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More

May 21, 2024

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More

May 21, 2024

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More

May 21, 2024

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More

May 21, 2024