Categories: వ్యాఖ్య

కొత్తగా పొడిచిన పొత్తు కథ!

Published by
Siva Prasad

పొలిటికల్ మిర్రర్

జెండాలు కలిసి నడుస్తాయి. కానీ ఆంద్రప్రదేశ్‌లో ఎన్నికలకు చాలా ముందు దీర్ఘకాలిక లక్ష్యాలతో పొత్తు పొడిచింది. దీనిలో ఎవరి ఎజెండా వారిది. ఎవరి అవసరం వారిది. ఒకరికేమో అధికారం అండ కావాలి. మరొకరికి క్షేత్రంలో దండలు వేసే జనాలు కావాలి. ఇద్దరివీ వేర్వేరు అవసరాలు. మరి సుదీర్ఘ కాపురానికి సిద్ధమవుతున్న ఈ ఇరువురూ సవాళ్ళను ఎదుర్కోగలరా? క్షేత్రస్థాయిలో బలపడాలన్న బిజెపి లక్ష్యం నెరవేరుతుందా? రాజకీయంగా తన మార్కు చూపించాలానుకుంటున్న పవన్ ఆశ నెరవేరుతుందా? జగన్, చంద్రబాబుల పార్టీలకు ప్రత్యామ్నాయం చూపించాలన్న పాచిక పారుతుందా…?

పవన్ రాజకీయం అటూ… ఇటూ…!

గడిచిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అనుకున్నది జరగక చతికిలపడ్డారు. తన అంచనల్లో కనీసం 10 శాతం కూడా చేరుకోలేకపోయారు. రాజకీయంగా దెబ్బతిన్నారు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత పలు సందర్భాల్లో ‘నేను పోరాటం చేయడం చూసారు. ఇకపై రాజకీయం చేయడం చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు. బలమైన అధికార పార్టీని ఢీ కొనాలంటే తనకు కూడా రాజకీయంగా అండదండలు ఉండాలని బిజెపితో దోస్తీకి దిగారు.

2014 ఎన్నికల్లో ఆయన బిజెపి, టిడిపితో పొత్తు పెట్టుకున్నా… కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో నేరుగా రంగంలోకి దిగి మింగుడుపడని ఫలితాన్ని చవిచూశారు. 2014-2019 మధ్య అధికార పార్టీ అండలు ఉన్నా రాజకీయంగా పెద్దగా ఎదిగే ప్రయత్నం చేయలేదు.  తాను బలవంతుడినేనన్న భ్రమలో ఉన్నట్లున్నారు. దీనికి కారణం క్షేత్ర రాజకీయాలలో ప్రవేశం లేకపోవడం కావచ్చు. 2019లో నేరుగా దిగిన తర్వాత రాజకీయం లోతు తెలిసింది. ఇక తాను ఎదగాలంటే అధికారం అండ తప్పనిసరి అని గుర్తించి బిజెపి వైపు కదిలారు. ఇప్పుడు ఆయన లక్ష్యం కేవలం రాజకీయమే. తాను రాజకీయంగా ఎదగడం, క్షేత్రంలో తిరగడం, ఒంటరిగా సాధించలేనిది కేంద్రం అండతో అయినా వచ్చే ఎన్నికల నాటికి సాధించడం.

సామాజిక వర్గాల అండ లక్ష్యం!

బిజెపి కేంద్రంలో అధికారం ఉంది. ఇక్కడ నోరెత్తి అనర్గళంగా మాట్లాడగల నాయకులు ఉన్నారు. పేరుమోసిన నాయకులకు లోటే లేదు. కానీ బిజెపి పరిస్థితి రాష్ట్రంలో దారుణమే. “పేరుంది- నోరుంది. దండ వేసే అండే లేదు” అనే పరిస్థితి వారిది. నాయకులకు ప్రత్యేక కోటరీలు ఉన్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు. అందుకే వారికి క్యాడర్ కావాలి. సామాజిక వర్గాల అండ ఉండాలి. సామాజికంగా అత్యంత చైతన్యం ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మూడు బలమైన సామాజిక వర్గాలున్నాయి. ఓ వర్గానికి చంద్రబాబునాయుడు, మరో వర్గానికి జగన్మోహన్ రెడ్డి హీరోలుగా వెలుగొందుతున్నారు. మిగిలిన మూడవ పక్షానికి కీలక కేంద్రంగా ఉండగలిగిన వారు కనిపించడం లేదు. వస్తూ పోతున్న వారే తప్ప దీర్ఘకాలం అండగా ఉండేవారు కరువయ్యారు. అందుకే వారికి ఆ లోటు తీర్చి, వారి అండతో పాగా వేయాలన్నది బిజెపి వ్యూహం. మూడో వర్గానికి తాము అండగా ఉంటే…, వారి అండతో అధికారానికి అర్హత పొందే వీలుందన్నది ఆ పార్టీ వ్యూహం కావచ్చు. ఆ దిశగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రణాళికలు పడుతున్నాయి. దానిలో భాగమే పవన్‌ని కలుపుకోవడం.

అవసరాలు… ఆయుధాలుగా…!

అవసరాన్ని అవకాశంగా మార్చుకుని  ఆయుధంగా ప్రయోగించడమే రాజకీయం. ఇక్కడ ఈ రెండు పార్టీలు చేస్తున్నది అదే. పరస్పరం రాజకీయ అవసరాలు తీర్చుకునే దీర్ఘకాలికమైన ముందుచూపుతో కలిసి కాపురం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి ఆయుధాలు నూరుతున్నారు. రాజధాని అంశంపై ఇరు పార్టీల ఉమ్మడి కార్యక్రమం ఆరంభమవుతుంది. నిజానికి ఈ రెండు పార్టీల క్షేత్ర కలయిక కూడా పెద్దగా సమస్య కాబోదు. జనసేన ఆవిర్భావ ఎన్నికల్లోనే బిజెపితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. జనసేన కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో వైసిపి లేదా టిడిపి కార్యకర్తలతో విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ కార్యకర్తలు బాగా తక్కువగా ఉన్న బిజెపితో క్షేత్రస్థాయిలో కలయిక ఇబ్బందేమి లేదు. అందుకే వీరి పొత్తుకు  ప్రస్తుతానికి చిక్కేమీ ఉండబోదు. కానీ రానున్న రోజుల్లో మరికొందరు నాయకులను బిజెపి తెరపైకి తీసుకువచ్చే వీలుందని ప్రచారం జరుగుతుంది. ఆ సామాజిక వర్గంలో కీలకమైన వంగవీటి రాధ, ముద్రగడ వంటివారిని తమతో కలుపుకోవాలని బిజెపి యోచిస్తోంది. వారి ప్రయత్నాలు ఫలిస్తే భవిష్యత్తులో కొన్ని ఫలితాలు ఆశించవచ్చు. అదే సందర్భంలో అనూహ్యమైన ఫలితాలు వచ్చినా రావచ్చు.

శ్రీనివాస్ మానెం

This post was last modified on January 19, 2020 9:59 am

Siva Prasad

Recent Posts

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More

May 17, 2024

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సూప‌ర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More

May 17, 2024

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024