నాయిని కోసం కేసీఆర్ ఎందుకు ఏడ్చారో తెలుసా..!?

Published by
Muraliak

బుల్లెట్ కిక్ కొట్టాడంటే.. ఆ సౌండ్ తాలూకు శబ్దం బండి సైలెన్సర్ లో కాదు.. అతని ముఖంలో కనబడేది. అన్నా.. కష్టంలో ఉన్నామంటూ కార్మికులు అంటే.. తమ్ముడు నేనున్నా అంటూ ఆసరా ఇచ్చేవాడు.. 50 ఏళ్ల క్రితం ఎంతటి ధీరత్వం ఉందో 86 ఏళ్ల వయసులోనూ అదే ధీరత్వం. ఆ మీసం ఎప్పుడూ కిందికి దిగలేదు. ఆయనే.. నాయిని నరసింహారెడ్డి. కార్మిక నాయకుడిగా కార్మికుల ఆశాజ్యోతిగా బతికిన నాయిని ఇప్పుడు లేరు. అనారోగ్యంతో పోరాడి 86 ఏళ్ల వయసులో తన వాళ్లను, కార్మికులను, పార్టీని వదిలివెళ్లిపోయారు. గంభీరమైన ఆయన ముఖం.. పైకి మెలితిప్పి ఉండే ఆయన మీసం.. ఒక యోధుడి పౌరుషం ఒక చరిత్రగా మిగిలిపోయింది.

cm kcr emotion about naini narasimha reddy

కార్మిక నాయకుడిగా.. సమస్యలకు బాసటగా..

1934లో నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియాలో నేరేడుగొమ్ములో సాధారణ రైతు కుటుంబంలో నాయిని జన్మించారు. హెచ్ ఎస్సీ వరకూ చదువుకున్నారు. కార్మిక నాయకుడిగా ఎదిగారు. లేబర్ సమస్యలే తన అజెండాగా తిరిగారు నాయిని. అప్పట్లో హైదరాబాద్ లో కార్మికుల తరపున మాట్లాడేది, వారి సమస్యలపై గళమెత్తింది నాయిని మాత్రమే. 50 ఏళ్ల క్రితం వీఎస్టీ ఇండస్ట్రీస్ లో కార్మిక నాయకుడిగా ఆయన ఎలా ఉన్నారో.. మంత్రిగానూ ఆయన గొంతు అలానే వినిపించారు. కార్మిక వాసననే ఊపిరిగా బతకడమంటే మామూలు విషయం కాదు.

అందుకే కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు..

1969 నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు సాధించలేనిది మలి తెలంగాణ ఉద్యమంలో సాధించాలని కేసీఆర్ కు వెన్నంటి నడిచారు. టీఆర్ఎస్ జెండా మోసారు. రాష్ట్రం సాధించారు. తొలి ప్రభుత్వంలో హోంమంత్రి అయ్యారు.. కష్టపడిన పార్టీలో కొన్నాళ్లుగా కాస్త అసంతృప్తి. అల్లుడికి ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోలేక పోవడం.. పార్టీనే వదిలి వెళ్లిపోతారని వ్యాఖ్యలు.. ఇలా పలు రకాలుగా సాగింది ఆయన చివరి రాజకీయ దశ. కానీ.. నాయిని త్యాగాలను సీఎం కేసీఆర్ మర్చిపోలేదు. తనను నమ్మి నడిచిన నాయిని పరిస్థితికి చలించిపోయారు. కార్మికుల కోసం తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం కేసీఆర్ కు తెలుసు. అందుకే కేసీఆర్ కంట కన్నీరు. ఏదేమైనా.. కార్మికలోకంలో.. టీఆర్ఎస్ లో.. మొత్తంగా తెలంగాణలో నాయిని ఓ వెలుగు దివ్వె..!

 

 

 

 

Muraliak

Recent Posts

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ కెరీర్ పరంగా ఫుల్… Read More

May 16, 2024

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు పడింది. ఆయన పై వేటు వేస్తూ శాసనమండలి… Read More

May 16, 2024

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి… Read More

May 16, 2024

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్తితి క‌నిపించింది. ప్ర‌స్తుతం పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చేందుకు జూన్ 4వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం… Read More

May 16, 2024

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింది.. 1956లో.. అప్ప‌టి నుంచి జ‌రిగిన అనేక ఎన్నిక‌ల్లో చోటు చేసుకోని అనేకానేక ఘ‌ట‌నలు.. తాజాగా జ‌రిగిన 2024… Read More

May 16, 2024

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయ‌కులు.. నేడు మ‌రో పార్టీలో ఉన్నారు.… Read More

May 16, 2024

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

ఏపీలో జ‌రిగిన 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తాయి. సాధార‌ణంగా.. ఎన్నిక‌లంటే.. ఒక‌వైపు తాము ఏం… Read More

May 16, 2024

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి వాతావార‌ణం అయితే.. కూట‌మి పార్టీల్లో ఉన్న‌దో.. ఇప్పుడు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా.. అదే… Read More

May 16, 2024

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

Brahmamudi:కావ్య మాయా అడ్రస్ ని తెలుసుకొని, ఆమె కోసం ఒక చిన్న గల్లీలోకి వెళుతుంది. అక్కడ కావ్య ని చూసి… Read More

May 16, 2024

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

Krishna Mukunda Murari:కృష్ణా, మురారి ఆదర్శ్ తో ముకుంద పెళ్లి జరగాలని భవానీ దేవి నిర్ణయించుకోవడంతో, భవానీకి ఏం చెప్పాలో… Read More

May 16, 2024

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

Nuvvu Nenu Prema:విక్కీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడడంతో, ఆకలితో ఉన్న ఫ్యామిలీకి అను పద్మావతి ఇద్దరూ, గుడిలో… Read More

May 16, 2024

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024