Hyderabad Gang Rape Case: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో న్యూ ట్విస్ట్…! వీడియో లీక్ చేసిన వ్యక్తి అరెస్టు .. బీజేపి ఎమ్మెల్యే రఘునందనరావుపై కేసు..?

Published by
sharma somaraju

Hyderabad Gang Rape Case: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి నిందితుల ఫోటోలు, వీడియోలు బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కు అవి ఎలా చేరాయి అనే దానిపై ఆరా తీస్తున్న పోలీసులు తాజాగా, ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన పాత బస్తీకి చెందిన సుభాన్ ను అరెస్టు చేశారు. రేప్ కేసు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలన్న సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తుంగలోకి తొక్కి ఫోటోలు, వీడియోలను బయటపెట్టారనీ, ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘునందనరావు పై కేసు నమోదు చేసే అంశంపై పోలీసులు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Hyderabad Gang Rape Case raghunandan rao

Hyderabad Gang Rape Case: శాస్త్రీయ ఆధారాల సేకరణ

ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నా పోలీసులు మాత్రం దృవీకరించలేదు. ఈ కేసులో అరెస్టు చేసిన మైనర్ లను జువైనల్ హోమ్ కు తరలించారు. ఇప్పటికే నిందితుల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు నిందితులను పోలీస్ కస్టడీ విచారణ కొరకు కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలుస్తొంది. నిందితులు ఉపయోగించిన బెంజ్, ఇన్నోవా కార్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా శాస్త్రీయ అధారాల కోసం ఫొరెన్సిక్ నిపుణులు వాటిని పరిశీలించారు. బెంజ్ కారులో బాధితురాలి చెప్పు, వెంట్రుకలు, చెవి రింగ్ క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. అదే విధంగా యువకులు అత్యాచారం చేసిన ఇన్నోవా కారులో ఫింగర్ ఫ్రింట్స్ ను సేకరించింది.

రాజకీయ నేతల కుమారులు కావడంతో…

ఇదే క్రమంలో ఎమ్మెల్యే రఘునందనరావు విడుదల చేసిన ఆధారాల్లో ఎమ్మెల్యే కుమారుడి వీడియో ను పోలీసులు పరిశీలించారు. నిందితులపై నేరం నిరూపించేందుకు అవసరమైన సాక్షాధారాల సేకరణలో భాగంగా వారి సెల్ ఫోన్, వాట్సాప్ డేటాను పరిశీలన చేస్తున్న సమాచారం. ఈ కేసులో నిందితులు అందరూ రాజకీయ నేతల కుమారులు కావడంతో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తొంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే డిమాండ్ చేశారు. ఆయన సీఎంకు దీనిపై లేఖ రాశారు. ఆ పార్టీ నేతలు డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. మరో పక్క గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఈ కేసుపై ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలను ఆదేశించారు.

 

sharma somaraju

Recent Posts

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024