Karthika Deepam 2 May 7th 2024 Episode: దీప అనసూయ మాటలు తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి.. శౌర్యని తీసుకుని ఊరు వెళ్ళలేను. ఆ ఇంటి వాళ్ళ మీద ఆధారపడలేను. నాలాంటి బతుకు నా కూతురికి ఉండకూడదు. అలా జరగాలంటే ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటుంది దీప. దీప ఏడుస్తుంటే అక్కడ ఒక వ్యక్తి వచ్చి పలకరిస్తాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావని అడుగుతాడు. నువ్వు ఇక్కడ బతకడానికి వచ్చావా అని అంటాడు. రావడానికి వేరొక కారణం ఉంది కానీ ఇక ఇక్కడే బ్రతకాలని అనుకుంటున్నాట్లు చెబుతుంది దీప. ఇక దీప కూడా అతని వివరాలు అడుగుతుంది. బతకడం కోసం పట్నం వచ్చాను కానీ బతకలేనని చెప్పి వెళ్ళిపోవాలని అనుకుంటూ చెప్తాడు. నా పేరు కడియం. ఇక్కడికి దగ్గరలోనే ఒక స్థలం అద్దెకు తీసుకుని హాస్టల్ పెట్టాను.
కరోనా తరువాత జనం రావడం మానేశారు. ఈ మధ్యలో చుట్టుపక్కల హాస్టల్స్ ఎక్కువ కావడంతో గిరాకీ తగ్గిపోయింది. అద్దె కట్టలేని పరిస్థితి ఏర్పడింది. నాలుగు నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టుకోలేకపోతున్నా. అందుకే ఇక్కడ ఉండలేక దూరంగా పారిపోతున్నానని అతని కష్టం చెబుతాడు. కష్టాలు చూసి భయపడి పారిపోవద్దు మీకు మీ హాస్టల్ బాగుండడం కావాలి. నాకు హాస్టల్ కి సంబంధించి అన్ని పనులు వచ్చు. నాకోసం దేవుడే మిమ్మల్ని పంపించినట్టు ఉన్నాడు. నాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతుంది దీప. కార్తీ, శౌర్య ఆడుకోవడం చూసి జ్యోత్స్న, పారు రగిలిపోతూ ఉంటారు. అమ్మ ఇంకా రాలేదు భయంగా ఉందని శౌర్య కార్తీక్ తో అంటుంది. అమ్మ రాకపోతే తన గురించే భయం. షాపింగ్ మాల్ లో కనిపించిన బూచోడు మళ్ళీ అమ్మకి ఎదురుపడితే అని భయపడుతుంది.
కార్తీక్ ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళమని పారు జ్యోత్స్న కి చెప్తుంది. తనని అర్జెంట్‌గా బయటకు తీసుకుని వెళ్ళమని జ్యోత్స్న కార్తీక్ ని అడుగుతుంది. ఆ మాట ఈ మాట చెప్పి కార్తీక్ ని బయటకు తీసుకుని వెళు. పారు జాగ్రత్త అంటే నేనేమీ శౌర్యని అననులే అంటుంది. నువ్వు కాదు అది నిన్ను అంటు. జో వెళ్లిపోతూ మనం ప్లాన్ వర్కౌట్ అయిందని కన్ను కొట్టుకుని సాయిగా చేస్తుంది. అలా ఎందుకు చేశారని శౌర్య అడుగుతుంది. దీప కడియంతో కలిసి అతడు హోటల్ నడిపే దగ్గరకు వెళుతుంది. జ్యోత్స్న నీ ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతాడు కార్తీక్. సరదాగా ఏదైనా కాఫీ కి వెళ్లి కాఫీ తాగుదామని అంటుంది. ఎప్పుడు కాఫీ ఏనా రోడ్డు మీద కాక హోటల్లో టి తాగుదామని అంటాడు కార్తీక్. అప్పుడే కడియం హాస్టల్ లో టీ పెడుతుంది.
దారిలో ఏదైనా టీఆప్తాను అక్కడే టీ తాగుదామని చెబుతాడు కార్తీ. సరిగ్గా కార్తీక్ వాళ్ళ టీ తాగడం కోసం కారు అక్కడే ఆపుతారు. టీ తాగడానికి రమ్మంటే జ్యోత్స్న రానని అంటుంది. కార్తీక్ కారు దిగి అక్కడ దీప ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. దీప కార్తీక్ కి టి ఇస్తుంది. దీప వైపు కార్తీక్ కోపంగా చూస్తాడు. టీ ఎలా ఉందని కడియం అంటే బాగుంది చాలా బాగుంది కొత్తగా ఉందని అంటాడు కార్తీక్. టి మా దీపమా పెట్టి. ఇవాలే ఓపెన్ చేసాం రేపటి నుంచి అన్ని ఉంటాయి. రమ్మని అంటాడు. మీరు ఇక్కడ పని చేస్తున్నట్టు ఇంట్లో తెలుసా అని దీపని అడుగుతాడు కార్తీక్. తెలుసు మా తాతగారి ఇంట్లో ఉంటుందని చెప్తాడు. ఇంత గొప్ప వాళ్ళ ఇంట్లో ఉంటూ పనికి వచ్చావు ఏంటని కడియం అడుగుతాడు. నా కాళ్ళ మీద నేను నిలబడడానికి అని చెబుతుంది దీప.
టీ తాగి రావడానికి ఎంత టైం ఏంటని జ్యోత్స్న కార్తీక్ ని పిలుద్దామని వెనక్కి తిరిగి చూస్తుంది. దీప కార్తీక్ ని చూసి ఆశ్చర్య పోతుంది. నీకు టీ తాగాలని అనిపించడానికి కారణం ఇదా. కారులో నన్ను కూర్చోబెట్టి దీపతో టీ తాగుతూ కబుర్లు చెబుతున్నా? నేనంటే ఇంత నిర్లక్ష్యమా దీపకు ఉన్న విలువ కూడా నాకు నీ దగ్గర లేదా అని మండిపడుతుంది. ఇంటిదగ్గర శౌర్య ఎదురు చూస్తుందని రమ్మని కార్తీక్ అడుగుతాడు. తరువాత వస్తానని అంటే రౌడీ భయపడుతుందని చెబుతాడు. నేను వెళ్ళిపోతున్నానని రాను అనుకోవద్దు తప్పకుండా వస్తాను అని ఈరోజు నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నానని దీప కడియం బాబాయ్ కి హామీ ఇస్తుంది. కార్తీక్ కారు దగ్గరకు వచ్చి చూసేసరికి కారులో జ్యోత్స్న ఉండదు. కార్తీక్ జో కోసం వెతుకుతాడు. అలా అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More
YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More
Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్‌బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More