కేటీఆరే నెక్ట్స్ సీఎం.. కానీ!

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలంగాణకు తదుపరి సీఎంగా కేటీఆర్ కాబోతున్నారా? తన కుమారుడిని సీఎంగా చూడాలని కేసీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నారా? గత కొద్ది రోజులు వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మిగతా పార్టీలకు అందనంత ఎత్తులో ఆ పార్టీ నిలిచింది. ఈ విజయం క్రెడిట్‌ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖాతాలోకి చేరింది. దీంతో కేటీఆర్‌ను త్వరలోనే సీఎం చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. మున్సిపల్ ఎన్నికల ముందు నుంచే కేటీఆర్‌ను సీఎం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరో రెండు మూడు నెలల్లో తనయుడికి సీఎం పగ్గాలు అప్పగించి.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం కేసీఆర్ చేసిన సుదీర్ఘ ప్రసంగంలోని కొన్ని అంశాలను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. పురపాలక ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా, ముందుండి నడిపించినదని కేటీఆర్ అని గుర్తు చేసిన కేసీఆర్, విజయ సారధి అతనేనంటూ ఆశీస్సులు అందించారు.

“ఎవరు సీఎం కావాలి, ఎవరు కావొద్దనేది సమయ సందర్భాలను బట్టి నిర్ణయాలు ఉంటాయి తప్పితే.. ఎవరో కోరుకుంటే అవుతుంది. కోరుకోపోతే కాదనేది కాదు. విష్ ఫుల్ థింకింగ్‌లో మంత్రులు కేటీఆర్ సీఎం కావాలని కోరుకొని ఉండొచ్చు. రెండేళ్లయ్యింది హెల్త్ చెకప్‌ చేయించుకోక.. మొన్న జబ్బు పడ్డాను. జ్వరం రావడంతో హాస్పిటల్‌కు వెళ్లి చెకప్ చేయించుకున్నాను. 30-40 రకాల టెస్టులు చేశారు. ముందే సన్నగ ఉన్నరా బాబంటే 20-30 సీసాల రక్తం తీశారు. రిపోర్టులన్నీ చూసి నువ్వు దుక్కలా ఉన్నావ్.. జలుబు ఎక్కువైందన్నారు. ఈ కండీషన్లో నేనేం చేయాలి? నన్ను జబర్దస్తీగా రిటైర్ చేయిస్తారా ఏంది? ఇంత పెద్ద విప్లవం చేసినోణ్ని నేనేమైనా తప్పు పని చేశానా? నరేంద్ర మోదీ సీఎంగా ఉండి ప్రధాని కాలేదా?” అంటూ కేసీఆర్ సరదాగా ప్రశ్నించారు. తానే సీఎంగా కొనసాగుతానని శాసన సభలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

తాను వంద శాతం జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని కేసీఆర్ తెలిపారు. తాను చేతగానితనంతోని ఊరుకొని ఉంటే.. వంద శాతం తెలంగాణ వచ్చేది కాదన్నారు. ‘నాడు చంద్రబాబు ఎంత పవర్‌తో ఉండే.. నేను ఒక్కడినే బయల్దేరాను. లక్షల అవమానాలు, నిందలు భరించాను. ఇవాళ తెలంగాణ గౌరవంగా బతుకుతోంది’ అని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాబోతోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ దేశాన్ని పాలించడంలో విఫలమయ్యాయని కేసీఆర్ ఆరోపించారు. సీఏఏ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తుందని, త్వరలోనే తాను సీఎంల సమావేశాన్ని నిర్వహించి, కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకునేందుకు పోరాడతానని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా పేర్కొన్నారు.

2019 ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్‌ను తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్.. తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, కేటీఆర్‌ను సీఎం చేయాలని భావించారు. కానీ అప్పుడు బీజేపీ ప్రభంజనం కారణంగా అది సాధ్యం కాలేదు. అయితే, కేసీఆర్ ప్రస్తుతం సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకీ పడిపోతుందని భావిస్తోన్న కేసీఆర్.. ఆ పార్టీకి వ్యతిరేకంగా అందర్నీ కలుపుకొని పోరాటం చేయాలని భావిస్తున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి నిర్ణయాలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రలతో చేతులు కలపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మోదీ సర్కారుకు ఫెడరల్ ఫ్రంట్‌ మాత్రమే ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో తీసుకొచ్చేందుకు ఆయన కార్యచరణ రూపొందిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌కు అవకాశం ఉందన్న నమ్మకం బలపడ్డాక.. కేటీఆర్‌కు సీఎం పీఠాన్ని అప్పగించి.. కేసీఆర్ పూర్తిగా జాతీయ స్థాయి రాజకీయాల్లో వెళ్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ ఘన విజయం క్రెడిట్ మొత్తం కేటీఆర్ ఖాతాలోకి వెళ్లిపోవడంతో ఆయనే కాబోయే సీఎం అని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

This post was last modified on January 26, 2020 1:45 pm

Mahesh

Recent Posts

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

Road Accident: హరియాణలోని అంబాలాలో ఢిల్లీ – జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును మినీ… Read More

May 24, 2024

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఓ హెలికాఫ్టర్ అదుపుతప్పి గాల్లో గింగిర్లు కొట్టింది.… Read More

May 24, 2024

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

Kalki 2898 AD: బుజ్జి.. ఇప్పుడు అంద‌రి నోట ఇదే మాట‌. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్… Read More

May 24, 2024

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

Shruti Haasan: శృతి హాసన్.. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలను… Read More

May 24, 2024

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

Brahmamudi May 24 Episode 418:  కావ్య ఇంట్లో కి మాయ ని తీసుకురావడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. దుగ్గిరాల… Read More

May 24, 2024

May 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 24: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 24: Daily Horoscope in Telugu మే 24 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More

May 24, 2024

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై… Read More

May 24, 2024

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలింగ్ కేంద్రంలో… Read More

May 23, 2024

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

AP High Court: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. అదే విధంగా పోటీ చేసిన… Read More

May 23, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్తకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన… Read More

May 23, 2024

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

AP High Court: రీపోలింగ్ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేర్వేరుగా… Read More

May 23, 2024

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో మరో ముగ్గురు నిందితులను… Read More

May 23, 2024

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ… Read More

May 23, 2024