విశాఖ జిల్లాతో పాటు ఉత్తరంధ్రలో వైసీపీ సీనియర్లకు సొంత పార్టీ నేతల నుంచి సెగ తగులుతుంది. కిందిస్థాయి నేతలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీటు ఇచ్చిన వారికి సహకరించేది లేదని.. వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఎమ్మెల్యేలు, మంత్రులు తమను అసలు ఏమాత్రం పట్టించుకోలేదని.. ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చాక.. తమను బతిమిలాడుకుంటున్నారని వారు వాపోతున్నారు. ఐదేళ్లపాటు పార్టీ కార్యకర్తలను నియోజకవర్గాన్ని పట్టించుకోని నేతలకే.. ఇప్పుడు టిక్కెట్లు కేటాయించడం ఏంటని రగులుతున్న కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
గాజువాకలో గుడివాడ అమర్నాథ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తాజా మాజీ ఇన్చార్జిగా ఉన్న ఉరుకుటి రామచంద్ర యాదవ్ పనిచేయటం లేదు. ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు సీటు ఇవ్వడంతో నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ ఏకతాటి మీదకు వచ్చి మరి గణేష్ కుమార్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇక ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు.
పొందూరుకు చెందిన సీనియర్ నేత సువారి గాంధీ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. పలాస నియోజకవర్గంలో మంత్రి శ్రీ అప్పలరాజు అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గంలో కీలక నేత దువ్వాడ శ్రీకాంత్ వ్యతిరేకిస్తున్నారు. ఈసారి పలాసలో అప్పలరాజుకు రెండు బలమైన కులాలకు చెందిన నేతలు ఎంత మాత్రం సహకరించే పరిస్థితి లేదు. ఇప్పటికే అప్పలరాజును వ్యతిరేకిస్తూ సీనియర్ నేత హేమ బాబు చౌదరి పార్టీని వీడారు. ఇక ఇచ్చాపురంలో పిరియా విజయ, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ పాతపట్నంలో రెడ్డి శాంతి అభ్యర్థిత్వాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసిపి నేతలు రచ్చకెక్కుతున్నారు.
టెక్కలిలో కిల్లి కృపారాణి, పేరాడ తిలక్ వర్గాలు దువ్వాడ శ్రీనివాస్‌కు అస్సలు సహకరించే పరిస్థితి లేదు. ఇక విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వ్యతిరేకిస్తూ.. కీలక నేత అవనాపు విజయ్ నిరసన ర్యాలీ చేసి మరి పార్టీ నుంచి వైదొలిగారు. పైగా నియోజకవర్గ కేంద్రంలో బలంగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ వర్గం.. వీరభద్ర స్వామికి సహకరించే పరిస్థితి లేదు. విజయనగరంలో వైసీపీ సీనియర్ నేత కాళ్ల గౌరీ శంకర్ కోలగట్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఎస్ కోట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు సీటు వద్దని చెప్పిన జగన్ మరోసారి ఆయనకే సీటు ఇవ్వడంతో.. ఎమ్మెల్సీ రఘురామరాజు వర్గం పార్టీ విడిపోయింది. ఇలా ఉత్తరాంధ్రతో పాటు విజయనగరంలో పలు కీలక నేతలు వరుసగా పార్టీని వీడిపోతున్నారు. ఇవన్నీ వైసీపీకి షాకుల మీద షాకులే అని చెప్పాలి.
Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More
Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More
TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More
Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More
This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More
Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More
NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More
ఎన్నికల పోలింగ్‌కు నెలరోజుల ముందు.. ఖంగు ఖంగున మోగిన షర్మిల గళం .. ఇప్పుడు వినిపించడం లేదు. సొంత అన్న… Read More