గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు విశాఖలో సర్వం సిద్ధం .. జనసేన అధినేత పవన్ ఆసక్తికర ట్వీట్

Published by
sharma somaraju

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విశాఖ ఇన్వెస్టర్ సమ్మిట్ కు ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విచ్చేసే అతిధులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏపి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాఫ్టర్లు, లగ్జరీ కార్లను ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులను సిద్దం చేశారు. ఈ సమ్మిట్ కి 35 మంది టాప్ ఇండస్టియలిస్ట్ లు, 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్ లు తరలివస్తున్నారు. సమ్మిట్ కోసం ఇప్పటికే 1200 లకు పైగా రిజిస్ట్రేషన్ లు జరిగాయి. సమ్మిట్ లో పాల్గొనడానికి అంబానీ, ఆదానీ, మిట్టల్, అదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు, అలానే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు ప్రత్యేక విమానాల్లో వస్తున్నారు.

ఇప్పటికే ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖకు చేరుకుని బస చేశారు. ఈ సదస్సుకు దాదాపు పదివేల మందికిపైగా ప్రతినిధులు హజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలమని ప్రభుత్వం భావిస్తొంది. అతిధుల కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక బస, విందు వంటి ఏర్పాట్లను చేసింది. నగర సుందరీకరణలో భాగంగా పలు కూడళ్లను తీర్చిదిద్దడం, రహదారుల మరమ్మత్తులు, విభాగినుల వద్ద పచ్చదనం ఉండేలా చర్యలు, బీచ్ ల సుందరీకరణ వంటి వాటికి దాదాపు వంద కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇదిలా ఉండే ఇన్వెస్టర్స్ సదస్సు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

ap cm ys jagan

 

ఈ సందర్బంగా ఏపి ప్రభుత్వానికి అభినందలు తెలిపిన పవన్ కళ్యాణ్..ప్రభుత్వానికి ఈ అంశంలో జనసేన సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. పకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశ విదేశాల నుండి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందన్నారు. మా శక్తి వంతమైన, అనుభవం కల్గిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యతుత్, మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతో పాటు ఇన్వెస్టర్స్ కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం.. ఏపిలో ఆర్దిక వృద్దికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్ర తీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి, రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కల్గించండి అని పేర్కొన్నారు.

Pawan Kalyan

 

ఈ సమ్మిట్ ఆలోచనలు కేవలం విశాఖకే పరిమితం చేయవద్దు. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప,.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్ లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపి మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్స్ సమ్మిట్ లాగా మార్చండి. ఇక చివరిగా రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సహకారం అందిస్తుంది. ఇన్వెస్టర్ ల సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు. మాకు రాజకీయం కంటే రాష్ట్ర శ్రేయస్సు మిన్న అని పవన్ కళ్యాణ్ ట్వీట్ లు చేశారు.

ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా.. ఎన్నికల ఫలితాలు ఇలా..

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

May 31: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 31: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 31: Daily Horoscope in Telugu మే 31 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More

May 31, 2024

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కి హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. కేంద్ర… Read More

May 30, 2024

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

YSRCP: ఏపీలో అధికారంపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని… Read More

May 30, 2024

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

Pushpa 2: సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2లోని 'కపుల్' సాంగ్ 12 దేశాల్లో ట్రెండింగ్… Read More

May 30, 2024

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

AP Election 2024: ఏపిలో ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారికి అరెస్టు చేస్తామని… Read More

May 30, 2024

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

KTR: రాజకీయ కక్షతోనే రేవంత్ సర్కార్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్… Read More

May 30, 2024

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

YCP MLA Pinnelli: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఇటీవల పలు కేసులు నమోదు అయిన… Read More

May 30, 2024

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

Road Accident: జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్ము – పూంచ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిన ప్రమాదంలో… Read More

May 30, 2024

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఏపీలో 2019, మే 30వ తేదీన ప్ర‌జా తీర్పున‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం మారింది. ఆ రోజు వైసీపీ అధినేత‌.. `జ‌గ‌న్… Read More

May 30, 2024

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఈ సారైనా గెలుస్తారా? సుదీర్ఘ ఓటముల త‌ర్వాత‌.. ఇప్ప‌టికై నా విజ‌యం ద‌క్కించుకుంటారా?… Read More

May 30, 2024

ఏపీలో ఎన్న‌డూ లేని టెన్ష‌న్‌.. ఉద్యోగాల‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఎందుకు..?

ఏపీలో ఎన్నిక‌లు ముగిసి.. ప‌ది రోజులు దాటింది. మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జ‌ర‌గ నుంది.… Read More

May 30, 2024

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే.. బీకాంలో ఫిజిక్స్ చ‌దివానంటూ.. మాట్లాడి..మంత్రి ప‌ద‌విని తృటిలో పోగొట్టుకున్న మైనారిటీ నాయ‌కుడు.. జ‌లీల్… Read More

May 30, 2024

ట‌ఫ్ ఫైట్ లీడ‌ర్లు… పూజ‌ల్లో బిజీబిజీ… ఈ సెంటిమెంట్ వెన‌క క‌థ ఇదే..?

ఈ నెల 13 వ‌ర‌కు ఎంతో బిజీగా ఉన్న నాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా.. త‌ర్వాత కొంత ఫ్రీ అయ్యారు.… Read More

May 30, 2024

ఫ‌స్ట్‌-ఫ‌స్ట్.. పలాస‌.. వైసీపీలో ఇదే బిగ్ హాట్ టాపిక్‌..?

సీదిరి అప్ప‌ల‌రాజు. డాక్ట‌ర్ టు పొలిటీషియ‌న్ అయిన నాయ‌కుడు. వైసీపీలో ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నా రు. వాస్త‌వానికి.. ఆయ‌న నిత్యం… Read More

May 30, 2024