ఒక రోజు విలన్.. పక్క రోజు హీరో…! జగన్ గ్రాఫ్ పైపైకి

Published by
siddhu

 

దేశమంతా లాక్ డౌన్ వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురి అవుతుంటే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను ఎలా సమయానికి అమలు చేస్తున్నారో అర్థం కాక అటు విపక్షాల తో పాటు ఇటు రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అంతెందుకు వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రతి సామాన్యుడిని ఒక ప్రశ్న వేధిస్తోంది. ఇలా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు జగన్ కనబరుస్తున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే పాలకులను చూసిన వాళ్ళకు… అనాదికాలంగా వస్తున్నా రాజకీయాలకు విరుద్ధంగా కష్టకాలంలో మేనిఫెస్టో అమలుకు ఏకంగా క్యాలెండర్ ను విడుదల చేసిన ఘనత ఒక్క జగన్ కే చెల్లింది.

జగన్ ను ఏ కోరికతో అయితే సీఎం గా అందరూ గెలిపించుకున్నారో…. ఆ జనం.. ఇప్పుడు కష్టకాలంలో జగన్ తను చెప్పిన మాట పై నిలబడి ప్రజల్లో మరింత నమ్మకం మరియు అభిమానం పెంచుకున్నాడు అని అనుకుంటున్నారు. అయితే జగన్ సర్కార్ పై ఒక చిన్న అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది. దానిని కూడా జగన్ పరిగణలోకి తీసుకొని వెంటనే పరిష్కారం చేయడం గమనార్హం.

అది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు పూర్తి స్థాయిలో అందక పోవడమే. నిజానికి లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం జరిగింది. ఇక మన రాష్ట్రం దానికి ఏమీ మినహాయింపు కాదు. అయితే గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల్లో 2, 3 డిపార్ట్మెంట్ లకు తప్ప మిగిలిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సృష్టించబడ్డ సచివాలయం ఉద్యోగాలు జీవితాల్లో కూడా 10% వేతనాలను కట్ చేయడం గమనార్హం.

ప్ర‌తి నెలా వివిధ క‌మిట్‌మెంట్ల‌కు పోనూ వేత‌నాన్ని పొదుపుగా వాడుకుంటున్న ఉద్యోగుల‌కు స‌గం జీతంతో ఇబ్బందులు పడ్డారు. అయితే క‌రోనాతో ఆర్థిక ఇబ్బందుల‌ని స‌రిపెట్టుకుంటున్నా….మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల‌ను య‌ధావిధిగా జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌లు చేస్తుండ‌టం ఉద్యోగ వ‌ర్గాల్లో ఓ ర‌క‌మైన అసంతృప్తి వచ్చి జగన్ కొద్ది రోజులు వాళ్ళ జీవితాల్లో విలన్ గా మారాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే జగన్ ఆ వేతనాల్లో కోత ను కేవలం రెండు నెలల కే పరిమితం చేయడం నిజంగా అభినందనీయం. వచ్చే నెల నుండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పూర్తిస్థాయి వేతనాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకపక్క మద్యం షాపులు తెరుచుకోవడం మరియు మరొక పక్క మిగతా షాపులకు నిర్దేశిత సమయం లో వ్యాపారం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిన మరునాడే ఉద్యోగులందరికీ వచ్చేనెల నుండి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జగన్ గ్రాఫ్ మరింత పైకి పెరిగిపోయింది. ఇక మిగిలి ఉన్నదల్లా ఇప్పటివరకు కోత విధించిన వేతనాలను మళ్లీ ఎప్పటికీ తిరిగి ఉద్యోగులకు అందజేస్తారు అన్న విషయంపై స్పష్టతే. ఇన్ని చేసినా ముఖ్యమంత్రి అది ఒకటి చేయకుండా పోతాడా ఏమి?

siddhu

Share
Published by
siddhu

Recent Posts

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More

May 16, 2024

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More

May 16, 2024

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More

May 16, 2024