Kumkuma Puvvu November 24 2023 Episode 2035: అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మ సాగర్ చెప్పినట్లుగా స్ట్రాంగ్ టీ తీసుకువచ్చి సాగర్ కు ఇస్తుందా లేదా..

Published by
siddhu

Kumkuma Puvvu November 24 2023 Episode 2035: కొండమ్మ ఓయమ్మో పద్మావతమ్మ ఒకసారి ఇలాగా రా నన్ను గట్టిగ అని అంటుంది.పద్మావతి ఎందుకు కొండమ్మ అంటూ కొండమ్మను గట్టిగా గిల్లుతుంది.కొండమ్మ ఇదంతా నిజమేనమ్మా కల కాదు ఆ అంజలమ్మ లక్ష్మమ్మ లాగా మాట్లాడడం ఏంటి ఇది కల నిజమా అందుకనే నిన్ను గట్టిగా గిల్లమన్నాను అమ్మ అంటుంది కొండమ్మ.పద్మావతి ఏమో కొండమ్మ కొంపదీసి బంటి ఆరోగ్యం బాగోలేదని అంజలి ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటుందా ఏంటి అంటుంది.కొండమ్మ చి చి అంజిలమ్మ అలాంటి ఆడది కాదు తల్లి లక్ష్మమ్మ గా నటించేటప్పుడు గతంలో సాగర్ బాబు చేయి పట్టుకున్నందుకు ఎలా లాగి ఈడ్చి కొట్టింది మర్చిపోయావా పద్మావతమ్మ అంటుంది.పద్మావతి కరెక్ట్ కొండమ్మ కానీ ఒకే ఒక ఐదు నిమిషాల్లో అంజలి లక్ష్మీ గా మారిపోవడమేంటి లక్ష్మీలా మాట్లాడడమేంటి కన్న వాళ్ళని కాదని వెళ్లిపోమనడమేంటి  నాకు అంతా అయోమయంగా అనిపించింది కానీ ఏదైతే ఏంటి శ్వేతను చూసుకుంటుంది నాకది చాలు అంటుంది

Kumkuma Puvvu Today Episode November 24 2023 Episode 2035 Highlights

పద్మావతి. కొండమ్మ సినిమాల్లో లాగా సీత గీతల రాముడు భీముడులా మారడం సినిమాలు ఎన్ని చూసి ఉంటాము కానీ నిజంగా రియల్ గా జరగడం ఇదేనమ్మా నేను చూడడం అంటుంది.సాగర్ ఈ అంజలి మళ్లీ ఏదైనా ప్లాన్ తో ఇంట్లోకి వచ్చిందా నేను తనను జైలుకు పంపించాను అన్న కోపం కూడా ఏమీ ఫేసులో కనిపించడం లేదు ఎంతో అమాయకంగా నటిస్తుంది అంత డబ్బు అంత ఆస్తి ఉన్నా కానీ తను ఇక్కడికి ఎందుకు రావాలనుకుంటుంది ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటుంది నాకేమీ అర్థం కావడం లేదు లేదంటే నన్ను ఏ విధంగానైనా దెబ్బ తీయాలని ప్లాన్ తో వచ్చిందా చూద్దాం అయినా నేను అంజలి కాదు లక్ష్మీని అంటూ తెగేసి చెప్పింది కదా ఇక చూపిస్తాను నా తడాఖా ఏంటో అని మనసులో అనుకుంటాడు సాగర్.కట్ చేస్తే అమృత అరుణ్ కుమార్ వాళ్ళ కోసం కావేరి ఎదురుచూస్తూ ఉంటుంది.

Kumkuma Puvvu Today Episode November 24 2023 Episode 2035 Highlights

కావేరి భర్త ఏంటికా కావేరి కాళ్లు కాలిన పిల్లి లాగా అలా తిరుగుతున్నావ్ మీ తమ్ముడు కోసమేనా వచ్చేస్తారు లే కూర్చో అంటాడు.కావేరి వాళ్ల కోసం ఏమీ కాదు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి నా ఆరాటం అంతా ఉంటుంది కావేరిఇంతలోనే అమృత అరుణ్ కుమార్ వాళ్ళు ఇంటికి వస్తారు.కావేరి భర్త ఏంటి బామ్మర్ది ఇంత లేట్ అయింది అంజలి ఏది రాలేదా అని అడుగుతాడు.ఆశ మధ్యలో వచ్చి అక్కడ జరిగిన స్టోరీ అంత నేను చెబుతాను నాకు ఇప్పుడే సాగర్ ఫోన్ చేసి చెప్పాడు అంజలి నేను రాను మీరు వెళ్ళండి అని పంపించింది అంట పాపం పైగా మీరెవరు మీరు ఎందుకు నా పాపని విడిచి రమ్మంటున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలుఅడిగిందంట అదే కాక ఇది నా ఇల్లు సాగర్ నా భర్త శ్వేత నా కూతురు నా కుటుంబాన్ని విడిచి రమ్మంటున్నారు ఎందుకు అని తిరిగి అడిగింది అంట అదికాక ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే బంటి కోసం రా అని పాపం వీళ్లు అడిగారంట అడిగితే అంజలి ఆ బంటీ ఎవరు అసలు బంటికి నాకు సంబంధం ఏంటి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ పాపం తరిమేసిందంట మీ కూతురు అంజలి ఎవరో నాలాగే ఉంటుందేమో నన్ను అంజలి అనుకుంటున్నారేమో మీ అంజలి ఎక్కడుందో వెతుక్కోండి అంటూ చెప్పేసిందంట పాపం అంజలి మాట్లాడిన మాటలకి అంకుల్ ఆంటీ కి ఏం సమాధానం చెప్పాలో తెలియక వచ్చేశారు అంటుంది ఆశ.కావేరి ఏంటి ఆ అంజలి ఇన్నాళ్లు ఆడిన నాటకమంతా ఆడేసి తీరా చివరికి వచ్చేసరికి మీరెవరు అని అడుగుతుందా అమ్మో అమ్మో చూశారా అండి మీ కోడలు అంజలి ఏం మాట్లాడిందో నీ వెటకారంగా అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode November 24 2023 Episode 2035 Highlights

ఆశ మరి ఇంకేం చేస్తుంది ఆంటీ ఇక్కడ బంటి మీద మోజు తగ్గిపోయింది వంటి ఎలాగూ ఇప్పట్లో కోలుకోడు అనుకుని ఇప్పుడు సాగర్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది అందుకే పాప వంకతో అక్కడికి చేరుకుంది అంజలి అంటుంది ఆశ.అమృత చి అసలు నువ్వు ఆడదానివే నా ఒక సాటి ఆడదాన్ని గురించి ఇంత నీచంగా మాట్లాడుతావా అంటుంది అమృత.అరుణ్ కుమార్ ఆశ మాటలు జాగ్రత్తగా మాట్లాడు ఇంకొక్క మాట మా అంజలి గురించి తప్పుగా మాట్లాడావు ఊరుకునేది లేదు అంటాడు అరుణ్ కుమార్.కావేరి చాలు చాలు లేరా తమ్ముడు దాని రూపం అంజలిదే అయినా బుద్ధి మాత్రం ఆ లక్ష్మీ లాగే మారింది కదా అంటుంది అయినా ఆశ అన్నదాంట్లో తప్పేముంది కూతురు తిట్లు అన్ని తీయటి బొబ్బట్లు కోడలు అనే మాటలన్నీ భరించలేని గుండెపోట్లు అన్నట్టు ఉంది మీరు చెప్పేది అంటుంది కావేరి.అరుణ్ కుమార్ అక్క చెప్పడానికి ఏమీ లేదు శ్వేతకు ఒంట్లో బాగోలేదు కొన్నాళ్లు పాటు అంజలి అక్కడే ఉంటుంది అంతే ఇంకా ఏమీ మాట్లాడొద్దు అంటాడా అరుణ్ కుమార్.బంటి అదేంటి ఏదో అంజలి అని మాట్లాడుతున్నారు అని అడుగుతాడు.

Kumkuma Puvvu Today Episode November 24 2023 Episode 2035 Highlights

ఆశ ఇంకా ఎక్కడ అంజలి బంటి తన దారి తను చూసుకుంది అంటుంది.బంటి సరే అంజలి లేదు లక్ష్మీ గారు ఉండాలి కదా అని అడుగుతాడు.కావేరి ఆ లక్ష్మి గారికే సాగర్ మీద గాలి మళ్లీ ఎలక్షన్ టైం లో పార్టీ అభ్యర్థులు రాత్రికి రాత్రే పార్టీ మారి ఈ గోడ నుంచి ఆ గోడ దుకేసినట్లు ఆ లక్ష్మికి ఎగిరిపోయిందిరా అంటుంది కావేరి.
బంటి ఒకసారి అంజలి ఒకసారి లక్ష్మీ అంటారు ఇంతకు తను ఎవరు అంటాడు. ఆశ ఆ అంజలి నీ గతం నేను నీ భవిష్యత్తు తన గురించి ఏమీ మాట్లాడకు అంటుంది ఆశ.బంటి గతానికి భవిష్యత్తుకు మధ్యల ఏదో జరుగుతుంది కదా అదేంటి అని అడుగుతాడు.ఆశ అబ్బే అదేం లేదు బంటి నీకు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కదా అంటూ బంటిని తీసుకెళ్తుంది ఆశ.కావేరి స్విచ్ వేస్తే తిరిగే ఫ్యాను స్విచ్ వేస్తే అన్నం ఉడికే రైస్ కుక్కర్ స్విచ్ వేస్తే పిండి రుబ్బే మిషన్ స్విచ్ వేస్తే నీళ్లు కాచే పొయ్యి అని సంబర పడే లోగానే స్విచ్లు నొక్కి నొక్కి ఉన్నవేలు కాస్త ఊడిపోయినట్టు అంజలి లక్ష్మీ గా మారితే ఆ సాగర్ చేతిలో చచ్చింది అనుకోండి అంటుంది కావేరి.
కట్ చేస్తే సాగర్ ఇంట్లో లక్ష్మీ ఆత్మ అంజలి శరీరంలోకి వచ్చి నన్ను క్షమించు అంజలి నేను నా కూతురు మీద ప్రేమతో నీ శరీరంలోకి వచ్చాను నువ్వు ఎక్కడ నా కూతురు శ్వేత నుంచి వెళ్ళిపోతావు అని నీ శరీరంలోకి వచ్చాను అని అనుకుంటుంది.

Kumkuma Puvvu Today Episode November 24 2023 Episode 2035 Highlights

అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మ తన కూతురు శ్వేతతో సంతోషంతో గడిపేస్తుంది.
పద్మావతి దీపం పెట్టి హారతి తీసుకుని అంజలి దగ్గరికి వెళుతుంది అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మ ఈ దేవుడి హారతి నేను గాని తీసుకుంటే కాలిపోతాను అలా జరగకూడదు నా కూతురు నుంచి అంజలి విడిపోవడానికి నేను ఒప్పుకోను అంటూ అంజలి శరీరం నుంచి పక్కకు వెళ్లి నిలబడి చూస్తూ ఉంటుంది.
పద్మావతి అంజలి దగ్గరికి వచ్చి హారతి తీసుకో అని హారతిస్తుంది అంజలి హారతి తీసుకుని నేనేంటి ఎక్కడున్నాను అసలు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి నేనెలా ఆగిపోయాను ఒక్క క్షణం కూడా నేనిక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ అంజలి వెళ్లబోతుండగా మళ్లీ లక్ష్మీ ఆత్మ అంజలి శరీరంలోకి చేరుతుంది.
అంజలి మళ్లీ లక్ష్మీ లాగా మారిపోతుంది టిఫిన్ చేయడానికి కిందికి వస్తుంది.సాగర్ అంజలిని చూసి ఓయమ్మో దీని యేషాలు ఎంత బాగా నటిస్తుంది ఇది ఇంత అమాయకంగా నటిస్తుంది అంటే అసలు దీని మనసులో ఏ ప్లాన్ తో వచ్చిందో ఏంటో చూద్దాం అని అనుకుంటాడు సాగర్.అంజలి పద్మావతి దగ్గరికి వచ్చి ఏంటి అత్తయ్య మీరు వంటిల్లు నా ప్రపంచం నేను వండి పెడతాను మీరు తినాలి మీరు వంట చేయడమేంటి మీరు లేవండి అని అంటుంది. అందుకు పద్మావతి కొండమ్మ షాక్ అయ్యి అదేం లేదమ్మా ఈరోజు మేము చేస్తాను నువ్వు తిను అంటారు.అంజలి సరే అంటూ వెళ్ళిపోతుంది.పద్మావతి అంజలిని శ్వేతకు సాగర్ కు ఏం కావాలో చూసుకో అంటుంది.అంజలి లో ఉన్న లక్ష్మీ ఆత్మ సాగర్ దగ్గరకు వెళ్లి ఏం కావాలండి మీకు అని అడుగుతుంది.
సాగర్ నాకు ఒక స్ట్రాంగ్ టీ పట్టుకురా స్ట్రాంగ్ అంటే ఎలా ఉండాలో తెలుసు కదా అంటాడు.
అంజలి తెలుసండి డికాషన్ ఎక్కువ చక్కెర తక్కువ పాలు తక్కువ ఉండాలి కదా అంటుంది.
సాగర్ వెరీ గుడ్ వెళ్లి త్వరగా వేడి వేడి టీ తీసుకురా అంటాడు

siddhu

Recent Posts

Jun 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 3: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

Jun 3: Daily Horoscope in Telugu జూన్ 3 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

June 3, 2024

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ .. నైరుతి వచ్చేసింది

నైరుతి రుతు పవనాలు శరవేగంగా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఈ రోజు (ఆదివారం)… Read More

June 2, 2024

ఏపీ పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీం చెంతకు..

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ చెల్లింపు అంశం ఆశక్తికరంగా మారింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో తొలి సారిగా… Read More

June 2, 2024

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు: సీఈవో మీనా

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటు వంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,  అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే… Read More

June 2, 2024

దేవినేని వార‌సుడికి ఎగ్జిట్‌ సెగ‌.. ఇలా జ‌రిగిందేంటి..?

విజ‌య‌వాడ రాజ‌కీయాల గురించి ఎవ‌రైనా చ‌ర్చించాల్సి వస్తే.. ఖ‌చ్చితంగా తెర‌మీదికి వ‌చ్చే పేరు దేవి నేని నెహ్రూ. సుదీర్ఘంగా 40… Read More

June 2, 2024

రాజ‌కీయాల్లో వెలిగి.. మేనేజ్‌మెంట్‌లో ఓడారు..!

రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయ‌కులు ఏపీలో చాలా మంది ఉన్నారు. వార‌సులుగా వ‌చ్చిన వారు.. సొంత‌గా ఎదిగిన వారు… Read More

June 2, 2024

ఆరా మ‌స్తాన్ చెప్పింది నిజ‌మైతే.. చంద్ర‌బాబుదే విజ‌యం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక స‌ర్వే సంస్థ‌లు వున్నాయి. అనేక సంస్థ‌లు ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వా త కూడా.. ప్ర‌జ‌ల… Read More

June 2, 2024

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

Siddharth-Aditi Rao Hydari: ప్ర‌ముఖ హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితి రావు హైద‌రి త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్కబోతున్న సంగ‌తి తెలిసిందే.… Read More

June 2, 2024

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

Shruti Haasan: సీనియర్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా… Read More

June 2, 2024

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

Chakram Movie: ఇటీవల కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ అనేది టాలీవుడ్ లో ఎంతలా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.… Read More

June 2, 2024

BRS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న బీఆర్ఎస్

BRS: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవశం చేసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి… Read More

June 2, 2024

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..  అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తొంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్… Read More

June 2, 2024

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

MLC Election: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8… Read More

June 2, 2024

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

దేశ‌వ్యాప్తంగా స‌ర్వే సంస్థ‌లు ముంద‌స్తు ఫ‌లితాన్ని ప్ర‌క‌టించాయి. దీనిలో భాగంగా తెలంగాణ ఎంపీ స్థానాల విష‌యాన్ని కూడా తేల్చి చెప్పాయి.… Read More

June 2, 2024