Varalaxmi Sarathkumar: ప్రముఖ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హీరో విశాల్ తో బ్రేకప్ ఆనంతరం ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లకుండా కెరీర్ పైనే ఫోకస్ పెట్టిన వరలక్ష్మి.. హీరోయిన్ గా ఎదగలేకపోయినా నెగిటివ్ క్యారెక్టర్స్ మరియు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సౌత్ ఇండస్ట్రీలో నటిగా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ అమ్మడు మరి కొద్ది రోజుల్లో తన సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేయబోతోంది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో ఏడడుగులు వేసేందుకు సిద్ధం అవుతోంది.
రీసెంట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల నుంచి వరలక్ష్మి, నికోలాయ్ మధ్య పరిచయం ఉంది. ఇటీవల ఈ పరిచయం కాస్త చిగురించి ప్రేమగా మారింది. ఇప్పుడు వరలక్ష్మి, నికోలాయ్ మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే నికోలాయ్ సచ్దేవ్ కు ఇది రెండో వివాహం. గతంలో అతను కవిత అనే ఓ మోడల్ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 15 ఏళ్ల కూతురు ఉంది. ఆమె పేరు కష సచ్దేవ్. నికోలయ్ సచ్దేవ్ మాదిరిగానే ఆయన కూతురు కూడా పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ వైడ్ పతకాలు సాధించింది.
మనస్పర్థలు కారణంగా నికోలాయ్, కవిత విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు నికోలాయ్ వరలక్ష్మితో మళ్లీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. అయితే పెళ్లై కూతురున్న వ్యక్తితో వరలక్ష్మి వివాహానికి రెడీ అవ్వడంతో ఎన్నో విమర్శలు వస్తున్నాయి. డబ్బు కోసమే వరలక్ష్మి నికోలాయ్‌ను పెళ్లి చేసుకుంటుందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అలాగే మరికొందరు నికోలాయ్ లుక్స్ ను దారుణంగా విమర్శిస్తున్నారు. అయితే తాజాగా వారందరికీ వరలక్ష్మి స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చింది.
`డబ్బు కోసమే నికోలాయ్ ను పెళ్లి చేసుకుంటున్నానని కొందరు విమర్శిస్తున్నారు. కానీ నేను కష్టపడి పని చేస్తున్నా. నా సంపాదనతో చాలా సంతోషంగా ఉన్నా. డబ్బు నా వద్ద కూడా ఉంది. డబ్బు కోసం మరొకరిని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు` అంటూ వరలక్ష్మి ట్రోలర్స్ కు గట్టిగా క్లాస్ పీకింది. అలాగే `నికోలాయ్ తనను రెండో పెళ్లి చేసుకుంటున్నాడు.. అందులో తప్పేంటి..? అతను సంతోషంగా ఉన్నంత వరకు ఏదీ తప్పు కాదు. మా నాన్న కూడా రెండో పెళ్లి చేసుకున్నార`ని వరలక్ష్మి పేర్కొంది.
నికోలాయ్ మాజీ భార్యతో తాను స్నేహపూర్వకంగా ఉన్నానని, ఆమెది అద్భుతమైన వ్యక్తిత్వం, మేమంతా బాగానే ఉన్నామని వరలక్ష్మి పేర్కొంది. ఇక నిక్ లుక్స్ గురించి చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ విషయంపై వరలక్ష్మి స్పందిస్తూ.. తన కళ్లకు నిక్ ఎంతో అందంగా కనిపిస్తున్నారు, అది చాలు అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో వరలక్ష్మి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, వరలక్ష్మి ప్రస్తుతం శబరి మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ సినిమాతో అనిల్ కాట్జ్దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ మే 3న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More
Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More
OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More
Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More
Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More
Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More
Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More
Tollywood Actor: పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? చైల్ట్ ఆర్టిస్ట్ గా అతను సినీ పరిశ్రమలోకి వచ్చాడు.… Read More
Sai Pallavi-Sreeleela: సాయి పల్లవి, శ్రీలీల.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్… Read More
Serial Actress Sireesha: ఇటీవల విడాకుల వైపు మొగ్గు చూపుతున్న సెలబ్రిటీల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. కలిసుండి బాధపడే కంటే… Read More