AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Published by
sharma somaraju

AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసే వరకూ వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కమిషనర్, గ్రామ సచివాలయ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధినేత రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ హైకోర్టులో విచారణ జరిగింది.

AP High Court

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వాలంటీర్లు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం గానీ, అభ్యర్ధులకు ఎన్నికల ఎజెంట్ లుగా గానీ ఉండకూడదు. అయితే రాష్ట్రంలో వేలాది మంది వాలంటీర్లు అధికార వైసీపీ అభ్యర్ధుల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. దీంతో అలా పాల్గొంటున్న వాలంటీర్లను అధికారులు సస్పెండ్ కూడా చేశారు.

Ramachandra Yadav

దీంతో వాలంటీర్లు వేలాది మంది స్వచ్చందంగా రాజీనామాలు చేశారు. ఆ తర్వాత యదేశ్చగా పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చాలా జిల్లాల్లో అధికార వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటుండగా, నెల్లూరు జిల్లాలో మాత్రం వంద మందికిపైగా వాలంటీర్లు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

రాజీనామా చేసిన వాలంటీర్లను ఎన్నికల ఎజంట్ లుగా కూడా నియమించుకోవాలని పార్టీ నేతలు యోచన చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా  లబ్దిదారుల కుటుంబాలకు ప్రభుత్వ సేవలు అందించిన వాలంటీర్లు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.

ఈ తరుణంలో బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. రామచంద్ర యాదవ్ తరపున సీనియర్ న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని ఈసీ ఇప్పటికే నిర్ధారించిందన్నారు. ఈ దశలో వారి రాజీనామాలు అంగీకరిస్తే ఆ పార్టీకి లబ్ది చేకూరుతుందని తెలిపారు.

వాలంటీర్లు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని, 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కాబట్టి వారి ప్రభావం ఉండనుందని, వారి రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు.. ఇప్పటి వరకూ ఎంత మంది వాలంటీర్లు రాజీనామా చేశారో వివరాలు ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ 41వ బర్త్ డే నేడు. దీంతో… Read More

May 20, 2024

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. దాంతో… Read More

May 20, 2024

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

Bengalore Rave Party: తాజాగా బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్… Read More

May 20, 2024

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఈ మేరకు… Read More

May 20, 2024

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న ఒక‌ప్ప‌టి వైసీపీ పొలిటిక‌ల్‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా… Read More

May 20, 2024

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

Brahmamudi May 20 Episode 414: రాజ్ కావ్యను రౌడీలబారి నుంచి కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కావ్య… Read More

May 20, 2024

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

ఏపీలో ఎన్నిక‌ల అనంత‌ర ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పైకి మాత్రం సైలెంట్‌గా ఉన్నా యని అనిపిస్తున్నా.. ఆయా పార్టీలు… Read More

May 20, 2024

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

రాజ‌కీయాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జ‌రిగింది? అని ఆలోచించుకునేలోగానే స‌మ‌యం క‌దిలి పోతుంది. అలా జ‌రిగి ఉండాల్సింది… Read More

May 20, 2024

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ… Read More

May 20, 2024

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది… Read More

May 20, 2024

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More

May 20, 2024

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More

May 19, 2024

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More

May 19, 2024