Brahmamudi March 11 2024 Episode 354: రాజ్ రివర్స్.. కావ్య,బావలకు ఫుల్ పర్మిషన్స్.. ఇందిరా దేవి చివరి అస్త్రం ప్రయోగించనుందా?

Published by
bharani jella

Brahmamudi March 11 2024 Episode 354: రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి రాజ్ తో మాట్లాడుతూ ఉంటుంది. మనసులో మాట కళావతి కి చెప్పమని అంతరాత్మ రాజ్ ని తిడుతూ ఉంటుంది. అంత అందమైన కళావతి ఎదురుగా ఉంటే నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు తనకి నీ ప్రేమని అర్థమయ్యేలా చెప్పు చెప్తావా లేదా అని అంతరాత్మ రాజ్ ని బెదిరిస్తుంది. కానీ రాజ్ మాత్రం నేను ఎప్పటికీ కావ్య ని ప్రేమించట్లేదు అని అంటాడు. నేను నీ అంతరాత్మని రా నా దగ్గర నిజం దాస్తున్నావు అని అంటే నువ్వు అంతరాత్మ అయినా ఎవరైనా సరే నేను చెప్తున్నది నిజమే నేను కళావతిని ప్రేమించట్లేదు అని అంటాడు అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూస్తున్నావు అని అడుగుతుంది అంతరాత్మ. నేనేం తొంగి చూడట్లేదు ఏదో గాలి కోసం ఇట్లా వచ్చాను అని అంటాడు అయితే నువ్వు వాళ్లు మాట్లాడుకుంటుంటే నీకు ఇగో లేదా అని అంటే లేదు అని అంటాడు అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తావా అంటే చేస్తాను అని అంటాడు ఇక నేను ఇప్పటినుంచి వాళ్లను అసలు పట్టించుకోను నువ్వు నా లోపలికి వచ్చేసేయ్ అని రాజ్ అంతరాత్మకు చెప్పగానే చూస్తాను ఎంతకాలం ఇలా మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తావో అని అంతరాత్మ లోపలికి వెళ్తాడు. ఇక నేను రాజ్ స్వరాజ్ ఎవరైనా సరే అది అంతరాత్మ అయినా వేరే వాళ్ళైనా నా మాటే నెగ్గాలి అని అనుకుంటాడు మనసులో రాజ్.

Brahmamudi Today Episode March 11 2024 Episode 354 highlights

ఇక రాజ్ గదిలోనికి కావ్య భాస్కర్ ఇద్దరు వస్తారు. ఏమండీ అని కావ్యా లోపలికి వస్తుంది. తమ్ముడు అన్నయ్య రండి రండి రా తమ్ముడు అన్నయ్య ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు ఈ ఇల్లు నీది, నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు ఇదిగో ఈ గాలి ఎలా అయితే స్వేచ్ఛగా పీల్చుకుంటున్నావో ఇల్లు కూడా నీదే అలానే వాడేసుకో అని అంటాడు రాజ్. ఆ మాటలకు కావ్య భాస్కర్ ఇద్దరు బిత్తర పోతారు. ఏవండీ మీకు ఏమైంది అని అడుగుతుంది కావ్య నాకేం కాలేదు కళావతి ఎక్కడో అమెరికాలో ఉన్న తమ్ముడు అన్నయ్య నీకోసం వచ్చేస్తే మీ ఇద్దరికీ నేను కాస్త ఏకాంతం కల్పించలేని పాపిష్టి వాడిని, నువ్వు బుజ్జి అంటూ మీ మరదలు తో మాట్లాడతానంటే నేను అడ్డుపడ్డాను హనీ కావ్య భాస్కర్లతో రాజ్ మాట్లాడుతూ ఉంటే, ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు నిజమే చెప్తున్నాను మీరు నన్ను నమ్మాలి తమ్ముడు అన్నయ్య అని అంటాడు రాజ్ ఇక మీరేదో చెప్పాలని వచ్చినట్టున్నారు అదేంటో చెప్పండి అని అంటాడు రాజ్.

Brahmamudi Today Episode March 11 2024 Episode 354 highlights

ఇక భాస్కర్ చాలు అన్నయ్య చాలు గృహప్రవేశానికి పాలు పొంగించినట్లుగా నీలో నున్న మంచితనం బయటికి వస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. వెంటనే కావ్య ఈరోజు మా బావకి వాళ్ళ కంపెనీ బ్రాంచ్ మీటింగ్ ఉన్నది మా బావ సూట్స్ అవి తెచ్చుకోలేదు మీ దగ్గర చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఒకటి ఇస్తారేమోనని అడగగానే కళావతి అని గట్టిగా అరుస్తాడు రాజ్. ఏమైందండీ అని అడుగుతుంది కళావతి. మీ బావకు సూట్ కావాలంటే నన్ను అడగాలా నీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు తమ్ముడు అన్నయ్య నీకు ఆకు ఉంది అంటూ కబోర్డు దగ్గరికి తీసుకువెళ్లి సూట్స్ అన్ని తీసి నీకు ఏది కావాలో తీసుకో అని అంటాడు వెంటనే భాస్కర్ షాక్ అవుతాడు నీకు మీటింగ్ ఉంటే మాకళావతిని కూడా తోడు తీసుకెళ్ళు అని అంటాడు ఇక ఆ మాటలు కు ఇక కావ్య కూడా షాక్ అవుతుంది. వాళ్ళిద్దరిని దగ్గరుండి బయటికివెళ్లండి అని రూమ్ లో నుంచి బయటికి పంపిస్తాడు ఏమైంది ఈయనకి అని ఇద్దరు మాట్లాడుకుంటూ బయటికి వచ్చేస్తారు. ఇక రాజ్ అంతరాత్మ బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. వెంటనే రాజ్ చూశావా నేనేమైనా కుళ్లుకున్నానా వాళ్ళిద్దరినీ నేనే దగ్గర ఉండి బయటికి కూడా వెళ్ళమని చెప్పాను అని అంటే చూస్తున్నాను ఎన్ని రోజులు ఇలా ఉంటావో నేను చూస్తాను అని అంటుంది అంతరాత్మ.

Brahmamudi Today Episode March 11 2024 Episode 354 highlights

ఇక మరోవైపు అనామిక కళ్యాణి కూల్ చేయడానికి కాఫీ తీసుకొని కళ్యాణ్ దగ్గరికి వెళుతుంది అప్పటికే కళ్యాణ్ అప్పుతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పు నువ్వు ఎలాగైనా ఈ రోజు నన్ను కలవాలి అని అంటాడు నేను నిన్ను కలవను అని అంటుంది అప్పు కాదు మనిద్దరం కలుస్తున్నాము అని ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్ ఇక అది విన్నా అనామిక కోపంగా కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది. ఫోన్ పెట్టేసి కళ్యాణ వెనక్కి తిరిగేసరికి అనామిక ఎదురుగా ఉంటుంది ఎవరు ఫోన్లో అని అడుగుతుంది అనామిక విన్నావు కదా మళ్ళీ అడుగుతావెందుకు అని అంటాడు నీకోసం కష్టపడి కాఫీ చేసి తీసుకొస్తే నువ్వు మాట్లాడేది వినిపించింది అని అంటుంది అనామిక. ఏ పనైనా కష్టంతో చేయకూడదు నా మీకు ఇష్టంతో చేయాలి అని అంటాడు కళ్యాణ్ అందుకే కలవడానికి వెళ్తున్నావు అని అంటే దాన్ని అని అనాల్సిన అవసరం లేదు తనకు ఒక పేరు ఉంది అని అంటాడు. అయినా ఇప్పుడు దానికి అలవాల్సిన అవసరం ఏమి వచ్చింది అని అడగ్గాని కళ్యాణ్ ఇక్కడ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, అందుకే నా మనసులో ఉన్న మాట తనతో చెప్పుకోవాలనుకున్నాను అని అంటాడు కళ్యాణ్ అంటే పెళ్ళాం అన్న వేరే అమ్మాయిని కలుస్తున్నారు అంటే పోయేది నా పర్వే అని అంటుంది అనామిక, ఇక మరోవైపుఅప్పుతో వాళ్ళ అమ్మానాన్న కూడా కళ్యాణి కలవద్దు అని అంటే అప్పు వాళ్లతో వాదిస్తూ ఉంటుంది ఇక్కడ కళ్యాణ అనామికత వాదిస్తూ ఉంటాడు. రెండు సీన్స్ ఒకేసారి చూపిస్తూ ఉంటారు. అప్పు ఏది ఏమైనా నేను కళ్యాణి కలుస్తాను తను నా ఫ్రెండ్ తనకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది వేరే అమ్మాయి తన జీవితం లోకి వచ్చిన తర్వాత కూడా నేను తనని ఎలా ఇష్టపడతాను అని అంటుంది అప్పు వాళ్ళ అమ్మ వాళ్ళతో, ఇక కళ్యాణ్ కూడా నేను పెళ్లయిన తర్వాత అన్ని కలుస్తున్నానంటే తను నాకు మంచి ఫ్రెండ్ అని అనుకోవాలి తప్ప ఇలాంటి ఆలోచనలు చేయకూడదు అని అంటాడు అనామికతో, ఎవరు ఏమనుకున్నా సరే నేను ఈరోజు వెళ్లి కలుస్తున్నాను అని అంటుంది అప్పు. ఇక కళ్యాణ్ కూడా అనామికతో నేను అప్పుని కలిసే తీరుతాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode March 11 2024 Episode 354 highlights

ఇక ఇందిరా దేవి హాల్లో కాఫీ తాగుతూ పైనుంచి వచ్చిన కావ్య భాస్కర్ల దగ్గరికి వెళ్తుంది. మీ ఇద్దరిని చూస్తుంటే మనం అనుకున్నది సాధించినట్లే కనిపిస్తున్నారే అని అంటుంది. అవును బామ్మగారు మీ మనవడు నా భార్య నా సొంతం నా బట్టలు నా సొంతం నేను నీకు ఇవ్వను అని మా బావతో చెప్పేసాడు అని అంటుంది అవునా నా మనవడు అలాంటి వాడే వాడు ఏది మనసులో దాచుకోడు ప్రేమైనా కోపమైనా అందుకనే అని అనగానే అంత సీన్ ఏం లేదు అని అంటుంది కావ్య వెంటనే ఇందిరా దేవి ఏమైంది మనం అనుకున్నట్లు జరగలేదా అని అడిగితే, ఏం జరగలేదు రాజ్ మా ఇద్దరినీ కావాలనే బయట కూడా వెళ్ళమని చెప్పాడు కార్ కీస్ కూడా ఇచ్చాడు. అడగ్గానే బట్టలు కూడా ఇచ్చాడు అని చెప్పగానే నాకు అర్థమైంది అని అంటుంది ఇందిరా దేవి. ఏం అర్థమైంది అని అంటే వాడు రివర్స్ లో వస్తున్నాడు వాడు ఎలా వచ్చినా వాడి బండికి స్వీట్ బ్రేకర్స్ నేను వేస్తాను కదా అని అంటూ లోపలికి వెళుతుంది. ఇందిరాదేవి. కావ్య ఏంటి బావ నువ్వేం ఆలోచించవా అని అంటే బుజ్జి ఇప్పుడు నేను ఆలోచించే పొజిషన్లో లేను బామ్మ గారు ఎలా చెప్తే అలా అవన్నీ ఫాలో అవ్వడం తప్ప నేనేం చేయలేను అని అంటాడు.

Brahmamudi Today Episode March 11 2024 Episode 354 highlights

ఇక మరోవైపు అనామిక ఏడుస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అటువైపుగా వెళుతూ అనామికని చూసి తన దగ్గరికి వెళ్లి ఏమైంది మళ్లీ గొడవపడ్డారా అని అడుగుతుంది. కళ్యాణ్ గురించి ధాన్యంతో చెప్పేస్తుంది అనామిక. మీ అబ్బాయి నా మాట వింటే నాకు ఇన్ని బాధలు ఉండవు కదా అత్తయ్య అని అంటే ఏమైంది అని అడుగుతుంది. కవితలు రాసుకుంటూ ఆఫీసులకు వెళ్తున్నాడు ఇంట్లో మరోవైపు స్వప్నకు ఆస్తులు రాసిస్తున్నారు. ఇక ఇవన్నీ విషయాలు మీ అబ్బాయితో చెప్పినా అర్థం చేసుకునే పొజిషన్లో లేడు అని కళ్యాణ్ మీద తన కోపాన్నంత ధాన్యం ముందు చెప్తుంది అనామిక, వికానామిక కోపంగా మాట్లాడుతుందని తెలుసుకున్న ధాన్యం వెంటనే అనామికతో భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోవాలి ఇలా గొడవలు పడితే ఎలా నువ్వు కళ్యాణ్తో సరిగ్గా ఉంటే తను నీ గురించి ఆలోచిస్తాడు కదా తను బయట పడుకోవడం నేను చూశాను కాబట్టి ఇవాళ ఈ మాట నీతో చెప్పాల్సి వస్తుంది అని అంటుంది అంటే మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారా అత్తయ్య అని అంటుంది అపార్థం చేసుకోవట్లేదు నువ్వు కళ్యాణి అర్థం చేసుకోమని చెప్తున్నాను అని అంటుంది ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య ఉండాలి కానీ అలా బయటికి వచ్చి కళ్యాణ్ పడుకుంటే పోయేది ఎవరి పరువు అని అడుగుతుంది ఇక వెంటనే అనామిక కోపంతో మీ అబ్బాయి నేను ప్రేమగా ఉందామని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ మీ అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ అప్పు తో కలిసి బయట తిరగడానికి వెళ్ళాడు అని అంటుంది ఆ మాటలకు ధన్యం షాక్ అవుతుంది. ఏంటి నువ్వు చెప్పేది అని అంటే అవును అత్తయ్య అప్పుతో మాట్లాడుతున్నాడు తనని కలవడానికి బయటకి వెళ్ళాడు అని చెప్తుంది. సరే ముందు నువ్వు కాస్త కూల్వదు గానివి మనం షాపింగ్ కి వెళ్దాం పద అని అంటుంది నాకు ఇప్పుడు అంత మూల్ లేదు అత్తయ్య అని అంటే మూడు మార్చుకోవడానికి షాపింగ్ కి వెళ్దాం పద నువ్వు ముందు రెడీ ఐయిరాపో అని అంటుంది ధాన్యం అనామికతో, ఇక మరోవైపు భాస్కర్ కావ్య ఇద్దరు రెడీ అయ్యి బయటకు వెళ్తూ ఉంటారు. నాకేం అర్థం కావట్లేదు బుజ్జి అన్నయ్య ఏం చేస్తున్నాడు అని అనేసరికి వెనకాల రాజ్ హాయ్ అని అంటాడు ఇక ఇద్దరు ఒకసారి గా వెనక్కి తిరిగి చూస్తే రాజ్ కూడా రెడీ అయ్యి కిందకి వస్తాడు.

రేపటి ఎపిసోడ్ లో కావ్య వంటగదిలో ఉంటే రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఒక పార్సిల్ ఇచ్చి ఓపెన్ చేయమంటాడు అందులో పాస్పోర్ట్ ఉంటుంది ఇక వెంటనే రాజ్ హ్యాపీగా నువ్వు మీ బావతో కలిసి అమెరికా వెళ్లడానికి పాస్పోర్ట్ కూడా ఇచ్చేశాను ఇప్పుడు మీకు అడ్డంకులు లేవు. నేను నిన్ను వదిలిపెట్టిన తర్వాత నువ్వు డల్లుగా కూర్చోవాల్సిన అవసరం లేదు మీ బావతో కలిసి చక్కగా అమెరికా వెళ్ళచ్చు అని చెప్తాడు ఆ మాటలకు కావ్య చాలా బాధ వేస్తుంది వెంటనే బామ్మ గారి దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పేస్తుంది. మనమేదో ఆట పట్టిద్దామనుకుంటే తను ఇలా మారి పాస్పోర్ట్ ఇచ్చి అమెరికా వెళ్ళమంటున్నాడు బామ్మ గారు అని ఏడుస్తుంది. ఇక వెంటనే ఇందిరా దేవి అయితే మనం చివరియాస్త్రం ప్రయోగించాల్సిందే అని అంటుంది. ఇక రాజ్ ధారిలోకి వచ్చి తీరాల్సిందే అని ఇందిరా దేవి అంటుంది.కావ్య బాబాయి ఇద్దరు షాకే అలాగే ఇందిరా దేవి వైపు చూస్తూ ఉంటారు.

bharani jella

Recent Posts

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More

May 16, 2024

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More

May 16, 2024

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More

May 16, 2024

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More

May 16, 2024

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More

May 16, 2024

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

Tollywood Actor: పైన ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? చైల్ట్ ఆర్టిస్ట్ గా అత‌ను సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాడు.… Read More

May 16, 2024

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

Sai Pallavi-Sreeleela: సాయి పల్లవి, శ్రీలీల.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్… Read More

May 16, 2024

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

Serial Actress Sireesha: ఇటీవల విడాకుల వైపు మొగ్గు చూపుతున్న సెలబ్రిటీల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. కలిసుండి బాధపడే కంటే… Read More

May 16, 2024