ఎమ్మెల్సీల కేటాయింపుల అనూహ్య మార్పులు..! జగన్ నిర్ణయం వెనుక ఆంతర్యమేంటి..??

Published by
sharma somaraju

వైసిపిలో అంతర్గత రాజకీయాలు ఊపందు కుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ కు పార్టీ అధినేతగా పెద్ద పని పడింది. పార్టీ స్థాపించిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత వరుసగా నామినేటెడ్ పదవులు పార్టీ నాయకులకు కేటాయించే పని జగన్ చేతిలోనే ఉంది. ఇది పార్టీ పరంగా సున్నితమైన అంశం. ఎవరికి ఇచ్చినా అది ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలో ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. దీన్ని చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అయితే నెలలు తరబడి నాన్చుతూ లీకులు, లాబీయింగ్ లతో నెట్టుకొస్తారు. కానీ జగన్ మాత్రం అనూహ్య నిర్ణయాలతో ఎవరికీ అంతుపట్టని విధంగా కేటాయింపులు చేస్తున్నారు.

ఎమ్మెల్సీలు: చివరి నిముషాల్లో మార్పులు ఏమిటో?

వైసీపీలో ఎమ్మెల్సీల కేటాయింపు ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వీటిలో నిర్ణయాలలో మార్పులు కూడా అంతే జోరుగా ఉన్నాయి. మొదట చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తారని అనుకున్నారు. ఆయనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్ రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన మైనార్టీ నాయకుడు వీరందరికీ ఖచ్చితం అనుకున్నారు. ప్రచారం జరిగింది. పుకార్లు ఊపందుకున్నాయి. వైసీపీలో ఆంతరంగిక సంభాషణలలో కూడా చాలా వరకు ఇవే ఖరారు అయ్యాయి. కానీ ఈ పేర్లులో అనుగుణంగా మార్పులు కనిపించాయి. మర్రి రాజశేఖర్ కు మొండి చేయి ఎదురు అయ్యింది. కొయ్యే మోషేన్ రాజుకు ఇంకొన్నాళ్ళు వేచి చూపు తప్పలేదు. తాజాగా ఈ రోజు ఖరారు అయి గవర్నర్ ప్రకటించిన పేర్లు పరిశీలిస్తే..కొయ్యే మోషేన్ రాజు స్థానంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు వచ్చి చేరారు. ఈ ఊహించని పేర్లు, ఆకస్మిక మార్పులు సీఎం జగన్ కు, వైసీపీ ముఖ్య నేతలకు తప్ప ఇతరులకు ఎవరికీ అంతుపట్టడం లేదు. దీన్ని వివాదం చేయాలని కూడా ఎవరూ చూడటం లేదు. చర్చ కు కూడా కనీసం ఎవరు దిగడం లేదు. కారణం వైసీపీలో జగన్ నిర్ణయానికి తిరుగు లేదు. ఆయన ఏం చెప్తే అది నూటికి నూరు పాళ్లు అవ్వాల్సిందే. అమలవుతుంది. పైగా ఇది వివాదరహిత నిర్ణయం కూడా.

రవీంద్ర బాబుకు ఇవ్వడం వెనుక కారణాలు పరిశీలిస్తే…

కొయ్యే మోషేన్ రాజు వైసిపికి పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిదేళ్ల నుండి సేవలందిస్తున్నారు. పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కొన్నాళ్ళు పని చేశారు. కొన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జిల నియంకంలోనూ, మండల కన్వీనర్ ల నియంకంలోనూ కీలకంగా వ్యవహరించారు. అయితే 2014లో కొవ్వూరు టికెట్ తనకు దక్కలేదనే కారణంతో అలిగి పార్టీని వీడి టీడీపీలో చేరి పోయారు. కానీ అక్కడ కూడా సర్దుబాటు కాలేక నెలల వ్యవధిలోనే మళ్లీ వైసీపీ గూటికి చేరారు. ఇలా మోషేన్ రాజు ఒక చిన్న మచ్చ వేసుకున్నప్పటికీ జగన్ కి నమ్మిన బంటుగానే ఉంటూ వచ్చారు. ఆయన వివాదరహితుడు. రాజకీయంగా పెద్దగా అందరికీ తెలిసిన వ్యక్తి కాదు. ఆయన స్థానంలో అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు కి ఎమ్మెల్సీని ఖరారు చేశారు. రవీంద్ర బాబు సొంత జిల్లా అంటే ఆయన పుట్టింది, పెరిగింది పశ్చిమగోదావరి జిల్లా లోని దెందులూరు పక్కన ఉన్న కొవ్వలి గ్రామం. ఆయన ఎంపి గా పనిచేసింది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం. అంతకు ముందు ఆయన కేంద్ర సర్వీసుల్లో పని చేశారు. కస్టమ్స్ అధికారిగా ఢిల్లీలోనూ, ముంబయి లోనూ అనేక విభాగాల్లో పని చేశారు. విద్యా వంతుడు కావడం, రెండు జిల్లాల్లో పట్టు ఉండటం, కేంద్ర స్థాయిలో పని చేసినందున అనేక చట్టాలు, అనేక అంశాలపై పట్టు ఉండటం ఆయనకు ప్లస్ అయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు టిడిపిని వీడి జగన్ ను నమ్మి లో వైసీపీలో చేరగా అమలాపురం ఎంపీ సీటు కేటాయించకపోవడంతో ఆయనకు నాడు సర్ది చెప్పిన సీఎం జగన్ నేడు ఎమ్మెల్సీ ఇచ్చి శాంతింపజేశారు. దీనిలో రెండు వైపులా పార్టీకి, జగన్ కు మంచి చేసేవే కనిపిస్తున్నాయి. విద్యావంతుడు, ఒక మాజీ కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అధికారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, సామాజిక వర్గ పరంగా కూడా కొయ్యే మోషేన్ రాజు ఏ సామాజిక వర్గానికి చెందిన వారో రవీంద్ర బాబు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, రెండు జిల్లాలలో ప్రభావితం చేయగలగడం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కావడంతో రవీంద్రబాబుకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More

May 16, 2024

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More

May 16, 2024

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More

May 16, 2024

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More

May 16, 2024

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More

May 16, 2024

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More

May 16, 2024

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More

May 16, 2024

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More

May 16, 2024