ఫిబ్రవరి 1నే నిర్భయ దోషులకు ఉరి!

Published by
Mahesh

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేశ్‌ దరఖాస్తును రాష్ట్రపతి రామ్ నాథ్ శుక్రవారం తిరస్కరించారు.

నిజానికి నిర్భయం కేసులో నలుగురు దోషులకు జనవరి 7న ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జవవరి 22న ఉదయం ఏడు గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఆదేశించింది. అయితే నిందితుల్లో ఒకడైన ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో ఈ ఉరితీత అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే, తాజాగా ముఖేశ్ అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంతో కొత్త డెత్ వారెంట్ జారీ చేయాలంటూ తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టును కోరారు. దోషుల ఉరితీతకు కొత్త తేదీ, సమయం చెబుతూ డెత్ వారెంట్ జారీ చేయాలని పేర్కొన్నారు. దీంతో కోర్టు నలుగురు దోషులను ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సిందిగా కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.

అంతకుముందు.. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఘటన సమయంలో తాను బాల నేరస్థుడినని, దాని ప్రకరమే విచారణ జరపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ (26), ముకేశ్‌ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) లను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. దీంతో దోషులు ఇద్దరు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ జనవరి 9న తమకున్న చిట్ట చివరి అవకాశమైన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై మంగళవారం(జనవరి 14) ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్లను కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులకు జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయాలని భావించారు. ఇప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.

అయితే, క్షమాభిక్ష కోరుతూ ముకేశ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అభ్యర్థిన సమర్పించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఉరిశిక్ష అమలు జరగదని హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. జైళ్ల నిబంధనల ప్రకారం ఉరిశిక్ష పడిన కేసులో దోషులు క్షమాభిక్ష పిటిషన్ కోసం వేచి చూడాల్సి ఉంటుందని, ఈ  నేపథ్యంలో ఈ శిక్షను అమలు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కేవలం దోషి  పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాతనే మరణ శిక్ష అమలుపై తుది నిర్ణయం వుంటుందని తెలిపింది. అప్పటివరకు నలుగురు దోషులలో ఎవరినీ జనవరి 22న ఉరితీయలేమని స్పష్టం చేసింది. అయితే, తాజాగా ముఖేశ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిస్కరించడంతో ఉరిశిక్ష అమలుక కొత్త తేదీ ఖరారు చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న నిర్భయపై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ.. డిసెంబర్ 29న ప్రాణాలు విడిచింది. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేండ్ల శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. మిగతా నలుగురు.. ముకేశ్, వినయ్ శర్మ, పవన్, అక్షయ్ కుమార్ సింగ్ లను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం నలుగురు దోషులు ఢిల్లీలోని తీహార్ జైలులోఉన్నారు.

 

This post was last modified on January 17, 2020 5:45 pm

Mahesh

Recent Posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల… Read More

May 21, 2024

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More

May 21, 2024

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More

May 21, 2024

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More

May 21, 2024

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More

May 21, 2024

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More

May 21, 2024

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More

May 21, 2024

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More

May 21, 2024

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More

May 21, 2024

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More

May 21, 2024

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More

May 21, 2024

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More

May 21, 2024

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More

May 21, 2024

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More

May 21, 2024